Junior Movie: పారిశ్రామిక వేత్త గాలి జనార్దన్ రెడ్డి కొడుకు కిరీటీ రెడ్డి తెలుగు , కన్నడ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. అయితే, తన మొదటి ‘జూనియర్’ చిత్రం జూలై 18న ప్రేక్షకులు ముందుకు వచ్చింది. కిరీటీ సరసన యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రంతో స్టార్ హీరోయిన్ జెనీలియా కూడా రీ- ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీలో హీరో అక్క పాత్రలో ఆమె నటించడం గొప్ప విశేషమనే చెప్పుకోవాలి. ఇక దేవి శ్రీ ప్రసాద్ తన మ్యూజిక్ తో మరోసారి మేజిక్ చేశాడనే చెప్పుకోవాలి.
ముఖ్యంగా ‘వైరల్ వయ్యారి’ పాట మిలియన్ వ్యూస్ తో దూసుకెళ్లింది. నిజం చెప్పాలంటే ఈ పాట ఒక్కటే సినిమాకి ప్రాణం పోసిందని చెప్పుకోవాలి. ఇది బాగా వైరల్ అవ్వడం వల్ల ఈ సినిమాకి ఫ్రీ పబ్లిసిటీ జరిగింది. రాధాకృష్ణ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం మిక్స్డ్ టాక్ అందుకున్నప్పటికీ కలెక్షన్స్ బాగానే వచ్చాయని చెప్పాలి. కానీ, వీక్ డేస్ లో అనుకున్న స్థాయిలో రాణించలేకపోతుంది. ఒకసారి ఐదు రోజుల కలెక్షన్స్ ని గమనిస్తే..
నైజాం – 1.0 CR
సీడెడ్ – 0.23 CR
ఆంధ్ర – 1.30 CR
ఏపీ+తెలంగాణ – 2.53 CR
Also Read: Ambati Rambabu: వీరమల్లుపై అంబటి ట్వీట్.. ఏం తాతా ప్రీమియర్ టికెట్స్ దొరకలేదా? అంటూ కామెంట్స్!
కర్ణాటక – 1.04 CR
రెస్ట్ ఆఫ్ ఇండియా+ఓవర్సీస్ – 0.54 CR
వరల్డ్ వైడ్ (టోటల్) – 4.11 CR
” జూనియర్ ” మూవీకి వరల్డ్ వైడ్ గా రూ.8 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించాలంటే రూ.8.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. అయితే, ఐదు రోజుల్లో ఈ చిత్రం రూ.4.11 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ ఇంకా కోసం మరో రూ.4.39 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. వీక్ డేస్ లో ఈ చిత్రం బాగా డౌన్ అయింది. బ్రేక్ ఈవెన్ కు రీచ్ అవ్వాలంటే.. ఇంకా కలెక్ట్ చేయాల్సి ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత కలెక్ట్ చేయడం పెద్ద సాహసమనే చెప్పుకోవాలి.