Look At The Big Branches, Not the Small Crab
Politics

Deputy CM Bhatti : చిన్న పీట కాదు, పెద్ద శాఖలను చూడండి: భట్టి ఫైర్

Look At The Big Branches, Not the Small Crab : యాదాద్రి ఆలయంలో తాను కావాలనే చిన్నపీట మీద కూర్చున్నానని, దాన్ని సామాజిక మాధ్యమాల్లో అర్థం పర్థం లేకుండా ట్రోల్‌ చేస్తున్నారని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. బంజారాహిల్స్‌లో నిర్వహించిన సింగరేణి అతిథి గృహ శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యాదాద్రి ఘటనపై వివరణ ఇచ్చారు.

మా ప్రభుత్వం వచ్చాక మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో భాగంగా పేదలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం విజయవంతం కావాలని కోరుకుంటూ యాదగిరిగుట్టలో శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారికి ప్రత్యేక పూజలు చేశాం. దీనిలో భాగంగా కావాలనే చిన్నపీట మీద కూర్చున్నా.ఉప ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని శాసిస్తున్నా. మూడు శాఖలతో ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నా. అంతేకానీ లేనిపోని రూమర్స్‌ క్రియేట్ చేయొద్దని సోషల్‌మీడియాను హెచ్చరించారు.

Read More: ధరణి పేరుతో దిగమింగారు..!

ఆత్మగౌరవంతో జీవించే మనిషిని. నన్ను ఎవరూ అవమానించలేదు. అందరూ దీన్ని అర్థం చేసుకోవాలని కోరుతున్నా. సింగరేణి సంస్థను మరింత అభివృద్ధి చేస్తాం. ఈ సంస్థ ఆదాయాన్ని కార్మికులకు, రాష్ట్ర ప్రజలకే చెందేలా చూస్తాం అని భట్టి విక్రమార్క తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌, జీహెచ్‌ఎంసీ మేయర్‌ విజయలక్ష్మితో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు, తదితరులు పాల్గొన్నారు.

Just In

01

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు