Gali Kireeti : ‘జూనియర్’ సినిమాతో తెలుగు, కన్నడ సినీ ప్రేక్షకులకు పరిచయమైన గాలి కిరీటీ ఆ సినిమాతో మంచి విజయం అందుకున్నారు. అటు నటనలో అదరగొట్టి ఇటు సమాజ సేవలో కూడా ముందు ఉంటానని నిరూపించుకుంటున్నాడీ యంగ్ హీరో. ఆయన నటించిన సినిమా ‘జూనియర్’ రిలీజై మంచి టాక్ తెచ్చుకుంది. ఆ సినిమాలో బాగా వైరల్ అయిన పాట ‘వైరల్ వయ్యారి’. ఈ పాటలో శ్రీలీల, కిరీటి కలిపి వేసిన స్టె్ప్పులు బాగా వైరల్ అయ్యాయి. కొన్ని రోజులు ఈ పాట తెలుగు, కన్నడలో ఓ ఊపు ఊపింది. తాజాగా ఈ సినిమాలోని వైరల్ వయ్యారి పాటకు చిన్నారి వేసిన స్టెప్పులకు కిరీటి ఫిదా అయిపోయారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను సోషల్ మీడియా వేదికగా ప్రేక్షకులతో పంచుకున్నారు. అందులో.. బళ్లారిలో ఉన్న అందమైన గ్రామం కొరుగోడు నుంచి వచ్చిన పూజ వైరల్ వయ్యారి పాటకు డాన్స్ వేసి తన ప్రతిభ నిరూపించుకుందన్నారు. ఆమె వేసిన స్టెప్పులకు తాను ఎంతగానో ఆనందపడ్డానన్నారు. ఇలాంటి ప్రతిభను గుర్తించడానికి తాను ఎల్లపుడూ ముందుంటానన్నారు. అనంతరం ఆ చిన్నారికి బహుమతి ఇచ్చి పంపించారు.
Read also- Dacoit movie: షూటింగ్ లో ప్రమాదం.. మృణాల్ ఠాకూర్, అడివి శేష్ కు గాయాలు..
సోషల్ మీడియాలో చిన్నారి వేసిన స్టెప్పులకు నెటిజన్లు కూడా తమ సైలి లో కిరీటీపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇలా ఓ చిన్నారి టాలెంట్ ను ఎంకరేజ్ చేయడం చాలా మంచి పని అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇలాంటి వారు చాలా అరుదుగా ఉంటారని వారిలో ఉన్న టాలెంట్ వెలికి తీయడం, దానిని ఎంకరేజ్ చేయడం చాలా హర్షించ దగ్గ విషయం అని మరి కొందరు అంటున్నారు. మంచి మనసు ఉన్న వారు ఇలాంటి పనులు చేయడంలో వెనుకాడరని, కిరీటి మరొక్కసారి మంచి మనసు చాటుకున్నారని అంటున్నారు. ఏది ఏమైనా గాలి కిరీటీ పేదవారిలో ఉన్న హిడెన్ టాలెంట్ ను ప్రపంచానికి పరిచయం చేయడంపై సోషల్ మీడియాలో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
Read also- Indira Mahila Shakti: మహిళా శక్తిని గుర్తించింది కాంగ్రేస్ ప్రభుత్వమే
ప్రముఖ రాజకీయ నాయకుడు, పారిశ్రామికవేత్త గాలి జనార్దన్ రెడ్డి కుమారుడు కిరీటి హీరోగా పరిచయమైన చిత్రం ‘జూనియర్’ జూలై 18, 2025న తెలుగు, కన్నడ భాషల్లో విడుదలైంది. రాధాకృష్ణ రెడ్డి దర్శకత్వంలో, వారాహి చలన చిత్రం బ్యానర్‌పై రజనీ కొర్రపాటి నిర్మించిన ఈ చిత్రం యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శ్రీలీల హీరోయిన్‌గా, జెనీలియా కీలక పాత్రలో నటించగా, రవిచంద్రన్, రావు రమేష్, సత్య, వైవా హర్ష తదితరులు తమ నటనతో ఆకట్టుకున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, కేకే సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణలు. పీటర్ హెయిన్స్ యాక్షన్ కొరియోగ్రఫీ, నిరంజన్ దేవర మన్నే ఎడిటింగ్ అందించారు.