Dacoit movie : అడివి శేష్ హీరోగా, మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా తెరకెక్కుతున్న‘డెకాయిట్’ (Dacoit). ఇది ఒక తెలుగు-హిందీ ద్విభాషా చిత్రం. ఈ చిత్రానికి షేన్ బాబు దర్శకత్వం వహిస్తున్నారు. అడివి శేష్ స్వయంగా కథ, స్క్రీన్‌ప్లే రాశారు. ఇది ఒక యాక్షన్-డ్రామా థ్రిల్లర్ఇం గా రూపొందిస్తున్నారు. ఈ కథ ఒక దొంగ (డెకాయిట్) జీవితం చుట్టూ నడుస్తుందని తెలిసిన సమాచారం.
Also Read: Herbal Teas: వర్షాకాలంలో జీర్ణ సమస్యలా? ఈ హెర్బల్ టీలు తాగండి.. రాళ్లు తిన్నా అరిగిపోతాయ్!
ప్రస్తుతం, ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. అయితే, ఈ సినిమాకి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
షూటింగ్ సమయంలో ఒక చిన్న ప్రమాదం జరిగిందని ఓ వార్త బయటకు వచ్చింది. అడివి శేష్, మృణాళ్ ఠాకూర్‌లకు గాయాలయ్యాయి. అయినప్పటికీ, వారు గాయాలతోనే షూటింగ్‌ను పూర్తి చేసినట్లు సమాచారం. గాయాలు అయినా షూటింగ్ పూర్తిచేసి హాస్పిటల్ కి వెళ్లారని సమాచారం. అంతక ముందు కూడా ఒకసారి ఇలాగే ప్రమాదం జరిగింది. ఇప్పుడు మళ్ళీ జరగడంతో ఫ్యాన్స్ కూడా ఆందోళన చెందుతున్నారు. షూటింగ్ కన్నా ప్రాణాలు ముఖ్యం అని కొందరు అంటున్నారు. ఇంకొందరు ఇలాంటివి సహజం అని అంటున్నారు.