Pavan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటేనే అభిమానులకు పండగ. అలాంటి పండగ ఈ సారి రెండేళ్ల తర్వాత వస్తుంది. అందుకు అభిమానులు వానలను సైతం లెక్కచేయకుండా ‘హరి హర వీరమల్లు’ సినిమా విడుదలయ్యే థియేటర్ల దగ్గర క్యూ కడుతున్నారు. ఇప్పటికే ప్రముఖ నగరాల్లో థియేటర్ల ముందు హౌస్ ఫుల్ బోర్డులు పెట్టేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 2300 థియేటర్లలో విడుదల కాబోతుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే దాదాపు 900 థియేటర్లలో ఈ సినిమా ప్రదర్శించనున్నారు. ప్రీమియర్ షో ఈ రోజు రాత్రి 9:40 గంటలకు ప్రారంభమవుతోంది. ప్రపంచంలోని మొదటి షో అయితే యూకే, యూరప్, కువైట్‌లలో 9:30 గంటలకు ప్రారంభమవుతుంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజు మొత్తం కటెక్షన్ సుమారు 50 కోట్ల రూపాయలు వరకూ ఉంటుంది. ఈ సినిమా లాభాల బాట పట్టాలి అంటే 250 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేయాల్సి ఉంటుందని మూవీ క్రిటిక్స్ చెబుతున్నారు.
Read also- Medchal News: నివాస గృహాల మధ్య స్టీల్ కంపెనీ.. ప్రజలకు నరకం
హరి హర వీరమల్లు సినిమా విడుదల వేళ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రముఖుల నుంచి మూవీ టీంకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రి నారా లోకేశ్.. పవర్ స్టార్ అభిమానుల్లాగే తాను కూడా సినిమా కోసం ఎదురు చూస్తున్నానన్నారు. సాయి ధరమ్ తేజ్.. పవర్ స్టార్ పవర్ ఫుల్ స్టోమ్ కోసం ఎదురు చూస్తున్నామన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్.. పవన్ కేరీర్‌లో వీరమల్లు సినిమా మైలు రాయి అవుతుందన్నారు. సంగీత దర్శకుడు థమన్.. చరిత్ర రాయడానికి ఈ సినిమా సిద్ధంగా ఉన్నదన్నారు. నాగ బాబు కొణెదల.. ధర్మం కోసం జరిగే యుద్ధం ఎలా ఉంటుందో థియేటర్లలో చూడాలన్నారు. డైరెక్టర్ బాబి.. బాక్సాఫీసును రూల్ చేసే సత్తా ఈ సినిమాకు ఉందన్నారు. యాక్టర్ శ్రీవిష్ణు.. పవన్ అభిమానులకు జూలై 24 పండగ రోజన్నారు. యాక్టర్ శివాజీ.. హరి హర వీరమల్లు టీం అందరికీ అభినందనలు తెలిపారు. డైరెక్టర్ మారుతి.. ఈ సినిమా కోసం పని చేసిన అందరికీ అభినందనలు తెలిపారు.
Read also- Kannappa OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘కన్నప్ప’.. ఆ రూల్‌కి బ్రేక్!
పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో, నిధి అగర్వాల్ హీరోయిన్ గా దర్శకుడు క్రిష్ జాగర్లమూడి ఈ సినిమాను ప్రారంభించారు. అయితే వ్యక్తిగత కారణాల వల్ల క్రిష్ ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. తర్వాత నిర్మాత ఏఎం రత్నం తనయుడు ఈ సనిమాను టేక్ ఓవర్ తీసుకున్నారు. ఈ సినిమాను మెగా సూర్య ప్రొడక్షన్స్ బేనర్ పై ఏఎం రత్నం ఈ సినిమా నిర్మిస్తున్నారు. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ మెఘల్ చక్రవర్తి ఔరంగజేబు పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచారం చిత్రాలు చూస్తుంటే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పవన్ కళ్యాణ్ సినీ జీవితంలో ఈ సినిమా బిగెస్ట్ హిట్ అవుతుందని సినీ ప్రముఖులు చెబుతున్నారు.