Telangana Bandh (imagecredit:swetcha)
తెలంగాణ

Telangana Bandh: నేడు రాష్ట్రవ్యాప్త విద్యా బంద్‌ విజయవంతం: కార్తీక్

Telangana Bandh: వామపక్ష విద్యార్తి సంఘాలు ఇచ్చిన బంద్ పిలుపు విజయవంతం అయ్యింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ(Telangana) రాష్ట్రంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ, స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (SFI) ఆధ్వర్యంలో జులై 23, 2025న రాష్ట్రవ్యాప్త విద్యా బంద్‌కు పిలుపునిస్తున్నాము. ప్రభుత్వ, ప్రైవేటు(Private) పాఠశాలలు, కళాశాలల్లో విద్యా వ్యవస్థలోని లోపాలను సరిచేయడానికి, విద్యార్థుల హక్కులను కాపాడటానికి ఈ బంద్‌ను జయప్రదం చేసినా విద్యార్థులకు, ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు, ప్రజా సంఘాలకు అభినందనలు తెలియచేస్తున్నామని తెలిపారు.

Also Read: Swetcha Effect: స్వేచ్ఛ ఎఫెక్ట్.. కదిలిన ఫారెస్ట్ యంత్రాంగం.. అటవీ భూమి ఆక్రమణలకు చెక్!

డిమాండ్లు
విద్యాశాఖ మంత్రి నియామకం: గత ఏడాది కాలంగా విద్యాశాఖకు మంత్రి లేకపోవడం వల్ల సమస్యలు పెరిగాయి. వెంటనే విద్యాశాఖ మంత్రిని నియమించాలి.
ప్రైవేటు విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణ: ప్రైవేటు, కార్పొరేట్ సంస్థల్లో అధిక ఫీజులను నియంత్రించే చట్టాన్ని అమలు చేయాలి.
స్కాలర్షిప్‌లు విడుదల: పెండింగ్‌లో ఉన్న స్కాలర్షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌లను తక్షణం విడుదల చేయాలి.
మౌలిక సదుపాయాలు: ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో తాగునీరు, శుభ్రమైన టాయిలెట్లు, సరైన భోజన సౌకర్యాలు కల్పించాలి.
ఉపాధ్యాయ నియామకాలు: ఖాళీగా ఉన్న టీచర్, MEO, DEO పోస్టులను భర్తీ చేయాలి.
ఉచిత బస్ పాస్‌లు: విద్యార్థులకు ఉచిత బస్ పాస్‌లను అందించాలి.

Also Read; Maha Lakshmi Scheme: మరో మైలురాయి దాటిన తెలంగాణ ఆర్టీసీ

ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బంద్ విజయవంతం చేశారు. పీడిఎస్ యు, ఎస్ఎఫ్ఐ, ప్రజా సంఘాల కార్యదర్శులు మరియు నాయకులు పాల్గొన్నారు.

 

Just In

01

The Raja Saab: ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘ది రాజాసాబ్’ ట్రైలర్ వచ్చేది ఎప్పుడంటే?

Warangal District: హన్మకొండలో అతిపెద్ద దుర్గామాత మట్టి విగ్రహం.. ఎత్తు ఎంతో తెలుసా..!

Guinness Record: గిన్నిస్ రికార్డ్ బద్దలు కొట్టిన.. ఇండియన్ స్టీల్ మ్యాన్.. 261 కేజీలను అలవోకగా!

Nagarjuna Akkineni: ప్రతి దానిలోకి మమ్మల్ని లాగొద్దు.. హైకోర్టును ఆశ్రయించిన నాగార్జున

Local Body Elections: స్థానిక ఎన్నికల కోసం ప్రభుత్వం జీవో పై కసరత్తు.. మరోవైపు అధికారులకు ట్రైనింగ్!