Swetcha Effect (image credit: swetcha reporter)
నార్త్ తెలంగాణ

Swetcha Effect: స్వేచ్ఛ ప్రత్యేక కథనంతో.. ఎట్టకేలకు ఆస్పత్రి వైద్య సేవలకు మోక్షం..

Swetcha Effect: ఎట్టకేలకు ప్రజల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం నేడు అలంపూర్ చౌరస్తాలో 100 పడకల ఆసుపత్రి ప్రారంభానికి సిద్ధమైంది. జోగులాంబ గద్వాల జిల్లా (Jogulamba Gadwal District) జాతీయ రహదారి 44 కు సమీపంలో 21 కోట్లతో ఈ ఆసుపత్రి నిర్మాణాన్ని రెండు సంవత్సరాల క్రితం చేపట్టారు. ఏ ఒక్క తీవ్ర అనారోగ్య సమస్య వచ్చినా సమీపంలోని కర్నూల్ కు పరుగులు పెట్టాల్సిన పరిస్థితి వచ్చేది. అత్యవసర చికిత్సతో పాటు మహిళలు, గర్భిణీలు, వృద్ధులు అనేక ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు.

దీంతో సకాలంలో మెరుగైన వైద్యం అందక అనేక మంది ప్రాణాలు మార్గం మధ్యలోనే గాలిలో కలిసేవి. స్థానిక ప్రజలు అలంపూర్ లో ఆసుపత్రి (hospital) నిర్మించాలని మెరుగైన వైద్య సేవలు ఇక్కడే కల్పించాలని పలు వేదికలలో వినతిపత్రాలు ఇచ్చారు. పాలకులు సైతం ఆస్పత్రి నిర్మాణాన్ని చేపడతామని హామీ ఇవ్వగా ఎట్టకేలకు గత ప్రభుత్వ హాయంలో నిర్మాణాన్ని చేపట్టారు. వైద్య స్టాప్ నియామకం, మౌలిక వసతులు కల్పించకుండానే ఎన్నికల ముందు దానిని హడావిడిగా ప్రారంభించారు.

 Also Read: Jurala Accident: జూరాల వద్ద విషాదం.. కొంపముంచిన సెల్ ఫోన్ డ్రైవింగ్

వైద్య సదుపాయాలు సమకూర్చడంలో అలసత్వం

(hospital) ఆసుపత్రికి కేవలం కొన్ని వైద్య పరికరాలు కేటాయించగా అవి గత రెండు ఏళ్లుగా నిరుపయోగంగా ఉన్నాయి. ఆక్సిజన్ పరికరాలు, సెలైన్ బాటిల్ స్టాండ్స్, వైద్య పరీక్షలు నిర్వహించే పరికరాలు అందుబాటులో ఉన్నాయి. నిర్మించిన హాస్పిటల్ పై పర్యవేక్షణ లేకపోవడంతో కొన్ని పరికరాలు సామాగ్రి చోరీకి గురైంది. పేదల కోసం నిర్మించిన ఆసుపత్రి గత పాలకుల నిర్లక్ష్యంతో వైద్య సదుపాయాలు, అవసరమైన వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది కేటాయించక ప్రారంభానికి నేర్చుకోకపోవడంపై స్వేచ్ఛ దినపత్రికలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను వెలుగులోకి తెచ్చింది.ఓ.పి నిర్వహించేందుకు అవసరమైన సామాగ్రిని ఇటీవల సామాగ్రి సమకూర్చడంతో నేటి నుంచి వైద్య సేవలు ప్రారంభిస్తున్నామని డిసిహెచ్ఎస్ అధికారి డాక్టర్ రమేష్ చంద్ర తెలిపారు.

వైద్య సేవలు అందుబాటులోకి రావడంతో ప్రజలు హర్షం

గత ప్రభుత్వ హాయంలో చివరి దశలో నిర్మించిన (hospital) ఆసుపత్రికి అవసరమైన సామాగ్రి,స్టాఫ్ ను కేటాయించకుండానే హడావిడిగా (hospital) ఆసుపత్రిని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి (Niranjan Reddy) ప్రారంభించారు. దీంతో గత రెండు సంవత్సరాలుగా వైద్య సేవలో అందక ఆస్పత్రి నిరుపయోగంగా ఉంది. ప్రస్తుత వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ (Minister Damodar Rajanarsimha) గత సంవత్సరం క్రితం ఆస్పత్రిని సందర్శించి, ఆస్పత్రిలో నెలకొన్న సమస్యలను తెలుసుకున్నారు. ఈ మేరకు వైద్య సదుపాయాల కల్పనతో పాటు అవసరమైన స్టాఫ్ ను కల్పిస్తామని హామీని ఇచ్చారు.జిల్లాలో మెడికల్ కళాశాల ఏర్పాటు వల్ల అలంపూర్ 100 పడకల ఆస్పత్రికి వైద్య సిబ్బంది కేటాయింపుకు అవకాశం కల్పించారు. దీంతో నియోజకవర్గ ప్రజలు ఎట్టకేలకు స్థానికంగా వైద్య సేవలు ప్రారంభం కావడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.

 Also Read: Farmers Protest: రోడ్డెక్కిన రైతన్నలు.. సీడ్ కంపెనీల తీరుపై తీవ్ర ఆగ్రహం..

Just In

01

Betting Apps: బెట్టింగ్ యాప్స్ కేసులో.. సీఐడీ దూకుడు 8 మందిని అరెస్ట్

OG Movie: ఓజీ ప్రీమియర్ షోలో దారుణం.. వారికీ 20 లక్షలు నష్టం.. ఫ్యాన్స్ ఎంతకీ తెగించారంటే?

Puri Jagannadh: ఆ హీరోపై అభిమానంతో స్టార్ డైరెక్టర్ ఏం చేశాడంటే.. అప్పట్లో..

Seethakka: మన బతుకమ్మలను బ్రతికించుకుందాం.. మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు

Amazon Offers: అమెజాన్ బంపరాఫర్.. తక్కువ ధరకే బెస్ట్ ల్యాప్ టాప్స్.. అస్సలు మిస్ అవ్వకండి!