Kavitha Slams BJP ( image Credit: twitter)
Politics

Kavitha Slams BJP: బీసీ రిజ‌ర్వేష‌న్లకు బీజేపీ మతం రంగు పులమడం బాధాకరం

Kavitha Slams BJP: తెలంగాణ ప్రజలను మోసగించడంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఒక్కటేనని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kalvakuntla  Kavitha)  ఆరోపించారు. నాంపల్లిలోని తెలుగు యూనివర్సిటీలో దాశరథి శతజయంతి ఉత్సవాలను తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కవిత (Kalvakuntla  Kavitha) మాట్లాడుతూ, బీసీ రిజర్వేషన్లకు బీజేపీ నాయకులు మ‌తం రంగు పులమడం బాధాక‌రమన్నారు. గుజ‌రాత్‌లో ఏ ర‌క‌మైన రిజ‌ర్వేష‌న్లు అమ‌లు చేస్తున్నారో అంద‌రికి తెలుసన్నారు.

Also Read: Farmers Protest: రోడ్డెక్కిన రైతన్నలు.. సీడ్ కంపెనీల తీరుపై తీవ్ర ఆగ్రహం..

బీజేపీ రిజ‌ర్వేష‌న్లను దూరం

తెలంగాణలోనూ ఆ పార్టీకి ఓట్లు రావ‌ని తెలిసి బీజేపీ (Bjp)  నాయ‌కులు ఈ ర‌క‌మైన వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. ఉత్తరాది రాష్ట్రాల్లో 50 శాతానికి పైగా రిజర్వేషన్‌లు అమలు చేస్తున్నారని, తెలంగాణతో సహా దక్షిణాది రాష్ట్రాల‌ విషయంలో మాత్రం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సాకులు చెబుతున్నదని మండిపడ్డారు. తెలంగాణ బీసీల‌కు కేంద్ర ప్రభుత్వం, బీజేపీ రిజ‌ర్వేష‌న్లను దూరం చేస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలో ప్రధాని మోదీపై బీసీల‌కు 42 శాతం రిజ‌ర్వేష‌న్ల విష‌యంలో సీఎం రేవంత్ రెడ్డి ఒత్తిడి తీసుకురావాలన్నారు. చ‌ట్టబ‌ద్ధంగా బీసీ రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించ‌కుండా ఎన్నిక‌లు నిర్వహించాల‌నుకుంటే బీజేపీ, కాంగ్రెస్ పార్టీల‌ను బీసీలు వ‌దిలిపెట్టబోరని హెచ్చరించారు. త‌క్షణ‌మే బీసీల‌కు 42 శాతం రిజ‌ర్వేష‌న్లు క‌ల్పిస్తూ ఆర్డినెన్సును తీసుకురావాలని డిమాండ్ చేశారు.

జాగృతి ఆధ్వర్యంలో దాశరథిని జయంతి
దాశరథి శత జయంతి ఉత్సవాలను ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించాలని తెలంగాణ జాగృతి విజ్ఞప్తి చేస్తూ వస్తున్నదని, అయినా, నిర్వహించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దాశరథికి ఈ ప్రభుత్వం సరైనా గౌరవం ఇవ్వడంలేదనే బాధ ఉన్నదన్నారు. దాశరథి చిన్న గూడూరులో జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించారని, ఆ ఊరు నుంచి ఆ కుటుంబాన్ని వెళ్లగొడితే ఖమ్మం వెళ్లి తలదాచుకున్నారన్నారు. ధైర్యంగా నిజం రాజును ఎదిరించి ప్రజల్లో చైతన్యం నింపిన వాడు దాశరథి అని కొనియాడారు.

 Also Read: MLC Kavitha: కవిత కయ్యాలపై కీలక భేటీ.. జాగృతిపైనే ప్రధానంగా చర్చ!

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు