Minister Ponnam Prabhakar (imagecredit:swetcha)
తెలంగాణ

Minister Ponnam Prabhakar: నియోజకవర్గాల వారీగా కొత్త రేషన్ కార్డుల జారీ

Minister Ponnam Prabhakar: హైదరాబాద్ జిల్లాలో నూతన రేషన్ కార్డుల వెరిఫికేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) అనుబంధ శాఖల అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నూతన రేషన్ కార్డుల ప్రక్రియ వెరిఫికేషన్, సీజనల్ వ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల పై హైదరాబాద్(Hyderabada) జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి తో కలిసి ఆయన సమీక్షించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ వ్యాప్తంగా 10 సంవత్సరాల తర్వాత రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతుందని అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు అందాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రమంతటా రాజకీయాలకతీతంగా అర్హులందరికీ రేషన్ కార్డులు ఇచ్చే ప్రక్రియ కొనసాగుతుందని, అలాగే రేషన్ కార్డులో మిస్ అయిన వారి పేర్లు కూడా యాడ్ చేస్తున్నామని తెలిపారు.

రేషన్ కార్డుల అందజేత ప్రక్రియ ఆయన నియోజకవర్గంలోని అనుకూల ప్రాంతాలను గుర్తించి నివేదికలు అందజేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ నెల 25 నుండి ఆగస్టు 10 వరకు నియోజక వర్గాల వారీగా నూతన రేషన్ కార్డుల జారీ ప్రక్రియన నిర్వహించనున్నట్లు మంత్రి వివరించారు. జీహెచ్ఎంసీ(GHMC) తరుపున ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డుల జాప్యం జరిగిందన్నారు. హైదరాబాద్ జిల్లాల్లో ఉన్న 15 నియోజకవర్గాలకు 15 మంది నోడల్ అధికారులను నియమించి, నూతన రేషన్ కార్డుల వెరిఫికేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేశామని తెలిపారు.

సర్కిళ్ల వారీగా నోడల్ అధికారులు
హైదరాబాద్ జిల్లాలో 43,115 రేషన్ కార్డులు కొత్తగా పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని, జిల్లాలో నూతన రేషన్ కార్డుల కొరకు 2 లక్షల 19 వేల 717 మంది దరఖాస్తు చేసుకోగా, వాటిలో 92 వేల 842 దరఖాస్తులను పరిశీలించడం జరిగిందని, ఇంకా లక్షా 26 వేల 875 కార్డులు వెరిఫికేషన్ చేయాల్సి ఉందని మంత్రి వెల్లడించారు. పరిశీలించిన వాటిలో4 వేల 115 రేషన్ కార్డులు లబ్ధిదారులకు అందజేసేందుకు సిద్ధంగా ఉన్నాయని మంత్రి తెలిపారు. పెండింగ్ అప్లికేషన్ ప్రాసెస్ వెరిఫికేషన్ సర్కిళ్ల వారీగా నోడల్ అధికారుల పర్యవేక్షణలో వేగవంతంగా కొనసాగాలని ఆయన అధికారులను ఆదేశించారు. జీహెచ్ఎంసీ(GHMC) నుండి 1100 మంది రీసోర్స్ పర్సన్స్ ను వెరిఫికేషన్ ప్రక్రియకు వినియోగించుకోవాలని మంత్రి సంబంధిత అధికారులను ఆదేశించారు.

Also Read: Bandi vs Etela: హైకమాండ్ వద్ద బండి ఈటల ఇష్యూ.. చెక్ పడునుందా!

ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం, పేర్లు యాడ్ చేయడం, దేశంలో ఎక్కడ లేని విధంగా సన్న బియ్యం పంపిణీ చేయడం జరుగుతుందని, ప్రజలు సంతోషంగా ఉన్నారని మంత్రి స్పష్టం చేశారు. ముఖ్యంగా హైదరాబాద్(Hyderabad) లో జరిగే ప్రక్రియ పైనే రాష్ట్రంలో పాజిటివ్ దృక్పథం ఉంటుందని, ఇక్కడ జాప్యం చేయకుండా పని చేయాలని అధికారులను ఆదేశించారు. సివిల్ సప్లై ,రెవెన్యూ, జీహెచ్ఎంసీ విభాగాలు సమన్వయం చేసుకుని, వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని మంత్రి సూచించారు. అర్హులను మాత్రమే గుర్తించి కార్డులు అందించడం జరుగుతుందని మంత్రి స్పష్టం చేశారు.

వ్యాధుల నివారణపై ఫోకస్ పెట్టండి
జిల్లాలో అధిక వర్షాలు కురుస్తుండటంతో వ్యాధులు ప్రబలి నష్టం జరగకుండా ముందస్తుగా శాంపిల్స్ స్వీకరించి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందాలని మంత్రి పొన్నం ప్రభాకర్ వైద్యాధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ లో డెంగ్యూ, మలేరియా సీజనల్ వ్యాధులపై వైద్యాధికారులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి తో కలిసి మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలో డెంగ్యూ కేసులు ఎక్కువగా నమోదు కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు ముందస్తుగా అవగాహన కల్పించాలని మంత్రి ఆదేశించారు. ప్రభుత్వం వైద్య రంగానికి అత్యంత ప్రాధాన్యత కల్పిస్తుందని, అన్ని ప్రభుత్వ వైద్యశాలల్లో మందుల కొరత లేకుండా, రోగులకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించేందుకు వైద్యాధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.

ప్రత్యేక స్క్రీనింగ్ క్యాంపులు
హై రిస్క్ ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక ఫోకస్ పెట్టాలని ఆయన వైద్యాధికాలను ఆదేశించారు. ముఖ్యంగా రాపిడ్ టెస్టులు కాకుండా శాంపిల్ టెస్ట్ చేయాలని ఆదేశించారు. 91 పీహెచ్సీలు, 169 బస్తీ దవఖానాలలో వచ్చిన రోగులకు మెరుగైన వైద్యం అందాలని ఆదేశించారు. ప్రత్యేక స్క్రీనింగ్ క్యాంపులు చేపట్టి టీబీ నిర్ధారణ తర్వాత రెగ్యులర్ కోర్స్ మెడిసిన్ అందించాలని టీబీ అధికారులను ఆదేశించారు. స్లమ్ ఏరియాలలో ఎక్కువగా వైద్య క్యాంపులు నిర్వహించి, మెరుగైన వైద్యం అందించాలని, ప్రాంతాల వారీగా ఏర్పాటు చేసిన బృందాలచే ఫాగింగ్ చేపట్టాలని వైద్యాధికాలని ఆదేశించారు. ఈ సమీక్షలో డీఎంహెచ్ఓ డాక్టర్ వెంకటి, జిల్లా టీబీ నివారణ అధికారి డాక్టర్ చల్లా దేవి, డిప్యూటీ డీఎంహెచ్ఓలు, వివిధ విభాగాల వైద్యులు తదితరులు పాల్గొన్నారు.

Also Read: Free Bus: ఏపీలో ఉచిత బస్సుపై కీలక అప్డేట్.. ట్విస్ట్ ఏమిటంటే..!

Just In

01

CM Revanth Reddy: నిమజ్జనానికి సింపుల్ గా సీఎం.. ఏమైనా ఇబ్బందులున్నాయా?

Leaves denied: బ్రదర్ పెళ్లికి లీవ్స్ ఇవ్వలేదని ఓ మహిళా ఉద్యోగి తీసుకున్న నిర్ణయం ఇదీ

Students Protest: మా సార్ మాకు కావాలి.. నిరసనకు దిగిన విద్యార్థులు

Dhanush: మరో తెలుగు డైరెక్టర్‌కి ధనుష్ గ్రీన్ సిగ్నల్.. ఆ దర్శకుడెవరో తెలుసా?

Gaddam Prasad Kumar: మహిళల ఆర్థిక అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం.. గడ్డం ప్రసాద్ కీలక వ్యాఖ్యలు