Gurukul kitchens: రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గురుకులాల కిచెన్ లలో ఇక నుంచి అత్యాధునికమైన సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు ఉన్నతాధికారులకు సీఎం(CM) ఆదేశాలిచ్చినట్లు సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ(SC), ఎస్టీ(ST), బీసీ(BC), మైనార్టీ గురుకులాల్లో ఈ కెమెరాలను ఫిట్ చేయనున్నారు. ఇప్పటికే గురుకులాల సెప్టీలో భాగంగా ప్రాంగణంలో సీసీ కెమెరాలు(CC Camera) ఉన్నప్పటికీ, నేరుగా కిచెన్ లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నదని సీఎం సూచించినట్లు తెలిసింది. దీంతో పాటు అడిషనల్ కలెక్టర్లు, స్థానిక నేతలు, అధికారులతో కమిటీ వేయాలని ప్రభుత్వం సూచించింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం త్వరలోనే కలెక్టర్లకు జారీ చేయనున్నది.
వానాకాలం సీజన్ షురూ కాగానే రెగ్యులర్ గా గురుకులాల్లో పుడ్ పాయిజన్ ఘటనలు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేస్తున్నాయి. గతంలోనూ జరిగినప్పటికీ, సోషల్ మీడియా ప్రభావంతో ఇప్పుడు మరింత ఎక్కవగా పబ్లిక్ లో చర్చ జరుగుతున్నది. హాస్టల్స్, గురుకులాల్లో ని ఘటనలతో ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వంపై ఎటాక్ చేస్తున్నాయి. దీంతోనే పుడ్ పాయిజన్ ఘటనలను సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం స్పష్టమైన యాక్షన్ ప్లాన్, సెక్యూరిటీ మెజర్స్ తో ముందుకు సాగాలని భావిస్తున్నది.
అక్కడే ఎందుకంటే? కుట్రకోణమేనా?
ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఏ గురుకులాల్లోని కిచెన్ లలోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయలేదు. సహజంగానే ఆ అవసరం కూడా ఉండదు. కానీ ఈ దఫా తప్పనిసరిగా ఏర్పాటు చేయాల్సిందేనని సీఎం నుంచి ఆదేశాలున్నాయి. ఈ కెమెరాలు ఏర్పాటు వెనక బలమైన కారణం ఉన్నదనే విషయాన్ని అధికారులు చెప్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రత్యేక రిపోర్టు కూడా ఉన్నట్లు వివరిస్తున్నారు. గత కొన్ని రోజుల నుంచి వరుసగా గురుకులాల్లో పుడ్ పాయిజన్(Food poisoning) ఘటనలు జరుగుతున్నాయి. గత ఏడాదిలోనూ ఎక్కువగానే సంభవించాయి. దీంతో ప్రభుత్వం సీరియస్ గా తీసుకొని ఘటనపై వివిధ రూపాల్లో సిక్రెట్ ఎంక్వైయిరీ చేసింది. పూర్తి స్థాయిలో స్టడీ చేసిన తర్వాత ప్రభుత్వానికి పలు అనుమానాలు తలెత్తాయి.
Also Read: Plane Crash: స్కూల్‌పై కూలిన ఎయిర్‌ఫోర్స్ విమానం.. మరో ఘోరం
ఆ తర్వాత మరోదఫా విచారణ తర్వాత పుడ్ పాయిజన్ లలో కుట్ర కోణం దాగినట్లు ప్రాథమికంగా అంచనా వేసింది. గతంలో గురుకులాలకు బాస్ గా ఉన్న అధికారి కి ఫేవర్ గా ఉన్న కొంత మంది ఎంప్లాయిస్ ఈ పాయిజన్ కు కారణమవుతున్నారనే అనుమానాలు సర్కార్ లో ఉన్నాయి. దీంతోనే ఇలాంటివి పునరావృతం కాకుండా, ఒక వేళ చేసిన స్పష్టమైన ఆధారాలను పసిగట్టేందుకు కిచెన్ లలోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నుంచి స్ట్రిక్ట్ గా ఆదేశాలున్నాయి. ఆయా సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ రూమ్ కు అనుసంధానించాలని సీఎం ఆదేశించారు. అక్కడ్నుంచి ప్రత్యేక టీమ్ గురుకులాలను మానిటరింగ్ చేయనున్నాయి.
ఎన్ ఐఎన్ తో స్టాఫ్‌కు ట్రైనింగ్?
ఇక నుంచి పుడ్ పాయిజన్ లు జరగకుండా గురుకులాలపై ఎన్ ఐఎన్ (National Institute of Nutrition) కూడా ఫోకస్ పెట్టనున్నది. ఈ మేరకు ప్రభుత్వం నుంచి (NIN) కు ప్రపోజల్ వెళ్లింది. ఆ సంస్థ అధికారులు కూడా సుముఖంగా ఉన్నట్లు తెలిసింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గురుకులాల పరిస్థితిని (NIN) అధికారులు సైతం పరిశీలించనున్నారు. ఆ తర్వాత స్టాఫ్ కు ట్రైనింగ్, డైట్ షీట్ రూప కల్పన వంటివి చేయనున్నారు. స్టాండర్డ్ ప్రోటోకాల్ ఆపరేషన్(SOP) ని కూడా సూచించనున్నారు. తప్పనిసరిగా ఫాలో అవ్వాలని ఆదేశాలివ్వనున్నారు.
ఇక పుడ్ సేప్టీ ఆఫీసర్లు కూడా సిక్రెట్ రెయిడ్స్ చేయనున్నారు. ఎప్పటికప్పుడు శాంపిల్స్ సేకరించి టెస్టులు నిర్వహించనున్నారు. నిర్లక్ష్యం వహించిన అధికారులపై వెంటనే చర్యలు తీసుకునేలా యాక్షన్ ప్లాన్ కూడా రెడీ అవుతున్నది. మరోవైపు అడిషనల్ కలెక్టర్లు కూడా గురుకులాల్లో ఒక పూట బోజనం అనే కార్యక్రమన్ని ఇంప్లిమెంట్ చేయనున్నారు. అడిషనల్ కలెక్టర్ల ఆధ్వర్యంలో ఏర్పడిన కమిటీ నిత్యం ఆహారాన్ని చెక్ చేయనున్నది. ప్రభుత్వానికి ప్రతి నెల రిపోర్టులు పంపించనున్నారు.
Also Read: GO 49: ఆదివాసీలకు అండగా 49 జీవో రద్దు.. సీఎం సంచలన నిర్ణయం