Sarcoma cance
Viral, లేటెస్ట్ న్యూస్

Health: ఎందుకైనా మంచిది.. అరుదైన ఈ క్యాన్సర్‌ గురించి తెలుసుకోండి!

Health: ‘సార్కోమా’ (Sarcoma) క్యాన్సర్ పేరు ఎప్పుడైనా విన్నారా?. తెలియకపోతే ఎంతోకొంత ఆరోగ్య (Health) అవగాహన పొందడం మంచిదని చెప్పాలి. సార్కోమా అనేది చాలా అరుదైన క్యాన్సర్. కానీ, చాలా ప్రమాదకరమైనది. శరీర భాగాలను కలిపే ‘కనెక్టివ్ టిష్యూస్’ అంటే, ఎముకలు, కండరాలు, కొవ్వు, కండరాల మధ్య మృదువైన ద్రవ్యపదార్థం, రక్తనాళాలు వంటి భాగాల్లో ఈ క్యాన్సర్ పుడుతుంది. జీవనశైలి, వాతావరణం, జన్యుపరమైన అంశాలు ‘సార్కోమా’ క్యాన్సర్‌కు కారణాలు కొవొచ్చు. అయితే, ఈ క్యాన్సర్‌కు దారితీసే 6 ప్రధాన కారణాలను డాక్టర్ రాజేష్ కుమార్ జైన్ అనే ప్రముఖ సర్జికల్ అంకాలజిస్ట్ ఇటీవలే వెల్లడించారు.

1. జన్యుపరమైన లోపాలు
శరీరంలోని జన్యువుల్లో స్థిరమైన మార్పులు లేదా లోపాలు ‘సార్కోమా’ క్యాన్సర్‌కు ప్రధాన కారణమని చెప్పాలి. కొందరిలో పుట్టుకతోనే రావడం లేదా ఆ తర్వాత జన్యులో వచ్చే మార్పులతో ఈ క్యాన్సర్ వస్తుంది. వంశపారంపర్య కారణం ఇందుకు ప్రధాన ముప్పుగా ఉంటుంది. లీ-ఫ్రామేని సిండ్రోమ్, న్యూరోఫైబ్రొమటోసిస్ టైప్ -1, ఫ్యామీలియల్ రెటినోబ్లాస్టోమా వంటి జన్యు వ్యాధుల వల్ల ‘ట్యూమర్ సప్రెషర్ జీన్స్’ సరిగా పనిచేయవు. అలాంటప్పుడు కణాలు వేగంగా పెరిగిపోయి ‘సార్కోమా’కు దారితీస్థాయి.

2. రేడియేషన్‌కు గురికావడం
రేడియేషన్‌కు గురైనవారికి (Radiation exposure) కూడా సార్కోమా క్యాన్సర్‌ వస్తుంది. ఇతర క్యాన్సర్లకు చికిత్స కోసం రేడియేషన్ థెరపీ చేయించుకున్న వ్యక్తులు, ఏళ్ల తరబడి ఆ చికిత్స విభాగంలో పనిచేసిన లేదా భాగస్వామ్యమైనవారిలో సార్కోమా వచ్చే అవకాశం ఉంది. ఈ కారణంతో వచ్చే క్యాన్సర్‌ను రేడియేషన్‌తో వచ్చే క్యాన్సర్లను ‘రేడియేషన్ ఇండ్యూస్డ్ సార్కోమాస్’ అని పిలుస్తారు. రేడియేషన్‌కు గురయ్యి సార్కోమా క్యాన్సర్ సోకేవారి సంఖ్య తక్కువనే చెప్పాలి. అయితే, అవగాహనతో ఉండడంతో చాలా ముఖ్యం.

Read Also- Marriage: పెళ్లి కాని ప్రసాద్‌లకు దడ పుట్టించే వార్త.. వెంటనే చెక్ చేస్కోండి!

3. వాతావరణ ప్రభావం
Sarcoma canceప్రతికూల వాతావరణం కూడా సార్కోమా క్యాన్సర్‌కు దారితీస్తుంది. కానీ, అంతఎక్కువగా అవకాశం ఉండదు. ప్లాస్టిక్ తయారీలో ఉపయోగించే వినైల్ క్లోరైడ్, ఆర్సెనిక్, హెర్బిసైడ్స్ వంటి రసాయనాల ప్రభావానికి ఎక్కువ గురయ్యే వాతావరణంలో ఉంటే కొన్ని రకాల సార్కోమా క్యాన్సర్‌కు దారితీసే అవకాశం ఉంది. పైన పేర్కొన్న విషపూరిత రసాయనాలలో పనిచేసేవారికి ఈ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది.

4. లింపిడెమా
కొందరిలో బ్రెస్ట్ క్యాన్సర్ సర్జరీ తరువాత శరీరంలో కొన్ని భాగాల్లో నీళ్లు నిలిచిపోయి లింఫీడెమాకు (వాపు) దారితీస్తుంది. ఇలాంటి వారిలో అంగియోసార్కోమా అనే రకమైన సార్కోమా ముప్పు ఉంటుంది. అలాంటివారిలో శరీరంలో సార్కోమా ఉన్నప్పటికీ గాయం అయినప్పుడు మాత్రమే అది బయటపడుతుంది.

5. గాయాలు!
గాయం ప్రభావంతో సార్కోమా వస్తుందని విస్త్రతంగా ప్రచారంలో ఉంది. కానీ, దీనిపై స్పష్టమైన శాస్త్రీయ ఆధారాలు ఇప్పటివరకు లేవు. గాయం, సార్కోమా క్యాన్సర్ మధ్య ప్రత్యక్ష సంబంధం ఉన్నట్టుగా ఆధారాలు లభించలేదు. చాలా సందర్భాల్లో, క్యాన్సర్ ముందే ఉండి, ఆ భాగంలో గాయం అయినవారిలో మాత్రమే సార్కోమా బయటపడింది.

6. వయస్సు, లింగం
సార్కోమా ఏ వయస్సు వారిలోనైనా రావచ్చు. అయితే, కొన్ని రకాల సార్కోమాలు చిన్నపిల్లలు, యువతో ఎక్కువగా వస్తాయి. ఉదాహరణగా చూస్తే, ఇవింగ్ సార్కోమా, రాబ్డోమయోసార్కోమా అనే క్యానర్లు యువతలో, లిపోసార్కోమా అనే క్యాన్సర్ వృద్ధుల్లో వస్తుంది. స్త్రీలతో పోల్చితే పురుషుల్లోనే ఎక్కువగా ఉన్నట్టు పరిశోధనలు చెబుతున్నాయి.

Read Also- Priyanka Chopra: హాలీవుడ్‌లో ప్రియాంక సక్సెస్ అయ్యిందా? సమీక్ష ఇదిగో

Just In

01

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?