Priyanka Chopra
ఎంటర్‌టైన్మెంట్, లేటెస్ట్ న్యూస్

Priyanka Chopra: హాలీవుడ్‌లో ప్రియాంక సక్సెస్ అయ్యిందా? సమీక్ష ఇదిగో

Priyanka Chopra: నటి ప్రియాంక చోప్రా (Priyanka Chopra) బాలీవుడ్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్న రోజుల్లో హాలీవుడ్ వైపు అడుగులు వేసింది. ఆమె హాలీవుడ్ కెరీర్ మొదలయ్యి దాదాపు పదేళ్లు గడిచిపోయింది. మరి ఆమె నిజంగా అక్కడ సక్సెస్ అయ్యిందా?.. భారత్‌లో పొందిన స్థాయిలో పాశ్చాత్య దేశాల్లో పాపులారిటీ సాధించిందా? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ఆమె హాలీవుడ్ జర్నీని గుర్తుచేసుకోవాల్సిందే.

హాలీవుడ్‌లో ప్రియాంక చోప్రా నటించిన మూవీస్ మిశ్రమ ఫలితాలు అందుకున్నాయి. 2017లో ‘బేవాచ్’ అనే సినిమాలో నెగటివ్ రోల్ ద్వారా ప్రియాంక హాలీవుడ్‌లో అరంగేట్రం చేసింది. ఈ మూవీలో డ్వేన్ జాన్సన్, జాక్ ఎఫ్రాన్, అలెగ్జాండ్రియా డాడారియో వంటి గ్లోబల్ స్టార్లు కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా 178 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. ఈ సినిమాలో ప్రియాంక నటనకు ప్రశంసలు దక్కాయి. ‘బేవాచ్’ మూవీ తర్వాత, ‘ఏ కిడ్ లైక్ జాక్’ (ఓటిటీలో విడుదలైంది), ‘ఈజ్ నాట్ ఇట్ రొమాంటిక్’ అనే మూవీస్‌లో సహాయక పాత్రల్లో నటించింది. అయితే, ఈ రెండూ పెద్దగా సక్సెస్ కాలేదు. ఇక, 2020లో, ‘ఉయ్ కెన్ బీ హీరోస్’ అనే సూపర్‌హీరో సినిమాలో నటించింది. అనంతరం ‘ది మ్యాట్రిక్స్:రిసర్రెక్షన్’ అనే హై-ప్రొఫైల్ సినిమాలో మెరిసింది. అయితే, ఈ సినిమా ఫ్లాప్ అయింది. 190 మిలియన్ డాలర్ల బడ్జెట్‌తో తెరకెక్కించగా 159 మిలియన్ డాలర్లు మాత్రం వసూలు చేసింది. 2023లో ‘లవ్ అగైన్’, గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ వాల్యూమ్-3లలో నటించింది. ఇవి కూడా పెద్దగా సక్సెస్ కాలేకపోయాయి. ఇక, ప్రస్తుతం ప్రియాంక చోప్రా నటించిన ‘హెడ్స్ ఆఫ్ స్టేట్’ సినిమా మంచి హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. హాలీవుడ్‌లో ఆమెకు దక్కిన తొలి విజయంగా ఈ సినిమాను చెప్పవచ్చు.

Read Also- F-35B Jet: కదిలిన యూకే యుద్ధ విమానం.. భారత్‌కు థ్యాంక్స్

ప్రియాంక సక్సెస్ అయ్యినట్టేనా?
ప్రియాంకా చోప్రా 2015లో అమెరికా వెళ్లింది. ఆ సమయానికి బాలీవుడ్‌లో ఆమె అగ్ర కథానాయికగా ఉన్నారు. మేరీ కోమ్, దిల్ ధడక్నే, బాజీరావు మస్తానీ వంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాలను అందుకున్నారు. ఇదే స్టార్‌డమ్‌ పాశ్చాత్త్య దేశాల్లో పొందాలని ప్రియాంక కలలు కన్నది. లీడ్ పాత్రల్లో నటించాలనుకుంది. కానీ, బాలీవుడ్ స్థాయి పాపులారిటీని ఇంకా అందుకోలేదని చెప్పాలి. అయితే, హాలీవుడ్‌లో ఎదిగేందుకు సిన్సియర్‌గా కష్టపడుతోంది. టీవీ షోలు, ప్రాముఖ్యత ఉన్న చిన్న పాత్రుల్లోనైనా నటిస్తోంది. తద్వారా అవకాశాలు దక్కించుకుంటూ ముందుకెళుతోంది. ప్రస్తుతానికైతే ప్రియాంక చోప్రా హాలీవుడ్‌లో ఓ గుర్తింపు ఉన్న నటిగా మారిపోయారు.

హాలీవుడ్ ప్రముఖ నటుడు నిక్ జోనస్‌కు పెళ్లి చేసుకోవడంతో ప్రియాంక పాపులారిటీ మరింత పెరిగింది. అయితే, బాక్సాఫీస్ వద్ద మాత్రం ఆమె సినిమాలు పెద్దగా వర్కౌట్ కాలేదు. ఆమె అందుకున్న విజయాలు ఎక్కువగా టీవీ, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లోనే ఉన్నాయి. ప్రస్తుతం ప్రియాంక చోప్రా చేతిలో జడ్జిమెంట్ డే, ది బ్లఫ్ అనే రెండు భారీ ప్రాజెక్టులు సిద్ధంగా ఉన్నాయి. ఈ సినిమాల్లో ప్రముఖ నటులు ఉండబోతున్నప్పటికీ, ప్రియాంక ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. కానీ, బాక్సాఫీస్ స్టామినాకు ఈ సినిమాలు ఒక పరీక్ష నిలవడం ఖాయంగా కనిపిస్తోంది.

Read Also- Dhankhar: ధన్‌ఖడ్ రాజీనామాకు రాష్ట్రపతి ఆమోదం.. మోదీ ఏమన్నారంటే

Just In

01

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ