BRS Party ( IMAGE credit: twitter)
Politics

BRS Party: స్థానిక ఎన్నికల ముందు నేతలు చేజారకుండా ప్లాన్..

BRS Party: స్థానిక ఎన్నికలకు బీఆర్ఎస్ (BRS) క్యాడర్‌ను సన్నద్ధం చేస్తుందా? లేక గ్రామస్థాయి నుంచి చేజారుతారనే భయం పట్టుకుందా? అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ క్యాడర్ దగ్గరకు వెళ్లలేదు. కేవలం మీడియా సమావేశాలకే పరిమితం అయింది. అడపాదడపా మాత్రమే పార్టీ కార్యక్రమాలు చేపడుతూ తాము ఉన్నామనే హింట్‌ను ప్రజలకు ఇస్తున్నారు. బీఆర్ఎస్ చేపట్టే కార్యక్రమాలకు సైతం ప్రజల నుంచి ఆశించిన స్పందన రావడం లేదనే ప్రచారం జరుగుతున్నది. అయితే, స్థానిక సంస్థల్లో మెజార్టీ స్థానాలు సాధించి పార్టీ క్యాడర్‌లో ఆత్మస్థైర్యం నింపే ప్లాన్ చేస్తున్నారు. అయితే, ఏ మేరకు కలిసి వస్తుందో అనేది పార్టీ నేతల్లో చర్చనీయాంశమైంది.

సమావేశాలు నిర్వహించాలని జిల్లా నేతలకు ఆదేశాలు
రాష్ట్రంలో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. ప్రభుత్వం సైతం నిర్వహించేందుకు సిద్ధమవుతున్నది. దీంతో ఆ ఎన్నికలకు పార్టీ క్యాడర్‌ను సన్నద్ధం చేయాలని బీఆర్ఎస్ (BRS) భావిస్తున్నది. అందులో భాగంగానే నియోజకవర్గాల వారీగా ముఖ్య కార్యకర్తల సమావేశాలు నిర్వహించాలని భావిస్తున్నది. ఇప్పటికే కేటీఆర్ సిరిసిల్లలో, హరీశ్ రావు గజ్వేల్‌లో పార్టీ ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. గ్రామాల్లో పరిపాలన తిష్టవేయడం, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పాలన వైఫల్యాలు, హామీల అమలులో జాప్యాన్ని వివరిస్తున్నారు.

గ్రామ గ్రామాన కాంగ్రెస్ (Congrss)  గ్యారంటీలు వివరించాలని నేతలకు సూచిస్తున్నారు. బీఆర్ఎస్ (BRS) పాలనలో చేసిన పనులను వివరించాలని, యువత, విద్యార్థి, అన్ని వర్గాల ప్రజలతో పాటు ఉద్యోగ, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను సైతం ప్రతి ఇంటికి తెలియజేయాలని, అవసరమైతే కరపత్రాలను పంపిణీ చేసేందుకు సిద్ధమవుతున్నది. వరుసగా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో సన్నాహక సమావేశాలు నిర్వహించాలని పార్టీ అధిష్టానం జిల్లా నేతలకు ఆదేశాలు ఇచ్చింది.

 Also Read: Kavitha on BRS: మల్లన్న వ్యాఖ్యలపై బీఆర్ఎస్ స్పందించలేదు.. కవిత

పంచాయతీలపై బీఆర్ఎస్ దృష్టి
అయితే, గతానికి భిన్నంగా ఈసారి ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ (BRS) మెజార్టీ గ్రామ పంచాయతీలపై దృష్టిసారించినట్లు పార్టీ నేతలే అభిప్రాయపడుతున్నారు. అందుకే స్థానిక ఎన్నికలకు ముందు గ్రామస్థాయిలో నేతలు, కార్యకర్తలు పార్టీని వీడకుండా చర్యలు చేపడుతున్నారు. నియోజకవర్గ స్థాయిలో ముఖ్య కార్యకర్తల సమావేశాలు నిర్వహించేందుకేనని పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే, కాంగ్రెస్ (Congress)  అధికారంలో ఉండడంతో అటువైపు గ్రామస్థాయి నేతలు ఇప్పటికే మొగ్గుచూపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.

వారికి అడ్డుకట్ట వేయాలని భావించి సమావేశాలకు శ్రీకారం చుట్టి ప్రభుత్వ వైఫల్యాలను వివరించేందుకు సిద్ధమవుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఇప్పటివరకు గ్రామస్థాయిలో ఏ ఒక్క కార్యక్రమం చేపట్టలేదు. వారిలో నైరాశ్యం నెలకొన్నది. ప్రస్తుతం కార్యక్రమాలు లేకపోవడంతో స్తబ్దుగా క్యాడర్ ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతుండడంతో వారి పార్టీ కార్యక్రమాలు ఇవ్వబోతున్నది. ఇప్పుడు కూడా మేల్కోకపోతే పార్టీకి భారీగా నష్టం జరుగుతుందని, రాబోయే అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీ మరింత బలహీన పడుతుందనే గ్రహించి సమావేశాలు నిర్వహిస్తున్నది.

మెజార్టీ స్థానాలు చేజిక్కించుకునేందుకు కసరత్తు
కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలులో వైఫల్యంతో అన్ని వర్గాలు నైరాశ్యంలో ఉన్నారని, ప్రజలంతా కేసీఆర్ (KCR)  పాలన కోసం ఎదురుచూస్తున్నారని ఇప్పటికే పలు సందర్భాల్లో బీఆర్ఎస్ కీలక నేతలు పేర్కొంటున్నారు. ఇదే సందేశాన్ని గ్రామస్థాయిలో క్యాడర్‌కు వివరించాలని భావిస్తున్నారు. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, పార్టీ మారినవారికి రాజకీయ భవిష్యత్ ఉండదని, వచ్చే మన ప్రభుత్వంలో పదవులు ఇస్తామని హామీలు ఇస్తూ నేతలు పార్టీ మారకుండా చర్యలు చేపడుతున్నారు. పార్టీకోసం పనిచేసేవారికి తగిన గుర్తింపు ఇస్తామనే హింట్ ఇస్తూ భరోసా కల్పిస్తున్నారు. మెజార్టీ జడ్పీ స్థానాలు చేజిక్కించుకునేందుకు కసరత్తును ముమ్మరం చేశారు.

బీఆర్ఎస్‌ను అక్కున చేర్చుకుంటారా?
రాష్ట్రంలో రెండుసార్లు అధికారంలో ఉన్నప్పుడు స్థానిక క్యాడర్‌ను పట్టించుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి. స్థానిక ఎమ్మెల్యే సైతం నేతలు కలిసేందుకు వెళ్తే గంటల తరబడి వెయిట్ చేయించుకునేవారనే విమర్శలు ఉన్నాయి. అయినా కలువకుండా పోయేవారని, ఇంకొంతమంది మంది వర్గాలుగా నేతలను విడదీసి పాలించారని నేతలు నాడు బహిరంగంగానే పేర్కొన్నారు. అయితే, ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసి ముందుకు సాగుతారా? పార్టీ కష్టపడేవారికి టికెట్లు ఇస్తుందా? పైరవీలు చేసేవారికి పెద్దపీట వేస్తారా? ప్రజలు సైతం బీఆర్ఎస్‌ను అక్కున చేర్చుకుంటారా? అనేది చూడాలి. గతంలో గ్రామాల్లో డబుల్ బెడ్రూం ఇండ్లు, దళిత బంధు, బీసీలకు లక్ష సాయం పూర్తి స్థాయిలో ఇవ్వకపోవడంతో నారాజ్‌గా ఉన్నారు. ఇప్పుడు వారి దగ్గరకు వెళ్తే ఎలా రిసీవ్ చేసుకుంటారనేది ఇప్పుడు పార్టీ నేతల్లోనే చర్చనీయాంశమైంది. బీఆర్ఎస్ అధిష్టానం ఆశించిన ఫలితాలు స్థానిక ఎన్నికల్లో ఏ మేరకు వస్తాయనేది చూడాలి.

 Also Read: Fitness: ఫుడ్‌‌లో ఈ చిన్న మార్పులు చేస్తే చాలు.. అద్భుతమైన ఆరోగ్యం!

Just In

01

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ