CM Revanth Reddy ( IMAGE credit: swetcha reporter)
తెలంగాణ

CM Revanth Reddy: ఈ నెల 25 నుంచి ఆగస్టు 10 వరకు రేషన్ కార్డుల డ్రైవ్

CM Revanth Reddy: రైతులు, పేద ప్రజల కంటే తమ ప్రభుత్వానికి ఏదీ ముఖ్యం కాదని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రకటించారు. వాళ్లకు ఎలాంటి ఇబ్బంది, కష్టం రాకుండా చూసుకోవడమే ప్రభుత్వ బాధ్యత అంటూ ఆయన వివరించారు. జూలై, ఆగస్ట్ నెలల్లో వర్షాలు కురియనున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రకటించారు. సోమవారం ఆయన జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షాలు, వరదల నేపథ్యంలో రైతులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

ఈ రెండు నెలల సీజన్లో అన్ని విభాగాల అధికారులు జిల్లాల్లో అందుబాటులో ఉండాల్సిందేనని నొక్కి చెప్పారు. ఎప్పటికప్పుడు వాతావరణ శాఖ అందించే వర్ష సూచనలను వెంటనే అన్ని గ్రామాలకు చేరవేసేలా కలెక్టర్లు బాధ్యత వహించాలన్నారు. దీంతో కనీసం మూడు గంటల ముందే రైతులు, ప్రజలను అప్రమత్తం చేసే వీలుంటుందన్నారు. జూన్ నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో 21 శాతం వర్షపాతం తక్కువగా నమోదైందన్నారు. వర్షాల కారణంగా జీహెచ్ఎంసీ పరిధిలో ట్రాఫిక్ ఇబ్బందులతో పాటు నీరు నిల్వ ఉన్నచోట్ల ప్రమాదాలు జరుగుతున్నట్లు సీఎం తెలిపారు.

 Also Read: GO 49: ఆదివాసీలకు అండగా 49 జీవో రద్దు.. సీఎం సంచలన నిర్ణయం

ఈ పరిస్థితిని అధిగమించేందుకు అన్ని విభాగాలు మరింత సమర్థంగా పని చేయాలన్నారు. ఎలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినా ఎదుర్కునేలా జీహెచ్ఎంసీతో పాటు పోలీస్, ట్రాఫిక్ విభాగాలు, ఎన్డీ ఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, హైడ్రా అధ్వర్యంలోని150 టీమ్‌లు వెంటనే రంగంలోకి దిగాలన్నారు. హైదరాబాద్ పరిధిలో పోలీస్ కమిషనర్లతో పాటు అన్ని విభాగాల ఉన్నతాధికారులు అన్ని విభాగాలు సమన్వయంతో పని చేసేలా జిల్లా కలెక్టర్లు బాధ్యతగా వ్యవహరించాలన్నారు.

అంటు వ్యాధులపై ప్రికాషన్స్ మస్ట్.. జిల్లా కలెక్టర్ ఖాతలో కోటి?
ఇక జిల్లాల పరిధిలో వర్షాల కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా ముందుజాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కొన్ని చోట్ల పిడుగు పాటుతో చనిపోతున్న వార్తలు వస్తున్నాయని, అటువంటి వివరాలను కూడా నమోదు చేయాలన్నారు. భవిష్యత్తులో వారికి ప్రభుత్వ పరంగా సాయం అందించే వీలుండేలా చర్యలు తీసుకోవాలన్నారు. వర్షాల సీజన్లో డెంగీతో పాటు సీజనల్ జ్వరాలు, అంటు వ్యాధులు ప్రబల కుండా వైద్యారోగ్య శాఖ సన్నద్ధంగా ఉండాలన్నారు. గిరిజన ప్రాంతాలు, ఐటీడీఏ ఏజెన్సీ ఏరియాలు, మారుమూల ప్రాంతాల్లో ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. పీహెచ్‌సీ, ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు ఎప్పుడూ అందుబాటులో ఉండాలన్నారు.

పశువులకు సంబంధించి వెటర్నరీ విభాగం అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎక్కడా ప్రజలకు ఆపద వచ్చినా కలెక్టర్లు వెంటనే స్పందించాలని, ప్రతి జిల్లా కలెక్టర్ ఖాతాలో రూ.కోటి అత్యవసర నిధులను ప్రభుత్వం వెంటనే విడుదల చేస్తుందన్నారు. మరోవైపు కలెక్టర్లు తమ జిల్లా పరిధిలోని పీహెచ్సీల నుంచి జిల్లా ఆస్పత్రులను ఆకస్మికంగా తనిఖీలు చేయాలన్నారు. ప్రతి రోజు ఉదయం పూట క్షేత్రస్థాయి పర్యటన చేపట్టాలన్నారు. ప్రతీ రోజు కలెక్టర్ల కార్యాచరణకు సంబంధించి సీఎస్ ప్రభుత్వానికి రిపోర్ట్ అందించాలని సీఎం ఆదేశించారు.

లైట్ తీసుకుంటే వేటే?
డ్యూటీల పట్ల అజాగ్రత్తగా ఉంటే అధికారులు ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని సీఎం హెచ్చరించారు. జిల్లాల పరిధిలో సాగునీటి ప్రాజెక్టులు, చెర్వులు, కుంటల నీటిని జాగ్రత్తగా ఒడిసిపట్టుకోవాలన్నారు. నీటి నిల్వలను అంచనా వేసుకోవాలన్నారు. వర్షాలకు అనుగుణంగా నీటి వినియోగ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని, చెరువులు, కుంటలకు, కాల్వలకు గండ్లు పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇక కృష్ణా బేసిన్ పరిధిలో ఇప్పటికే కొన్ని ప్రాజెక్టుల కింద నీటి విడుదల మొదలైందని, త్వరలోనే నాగార్జునసాగర్ నీటిని విడుదల చేస్తామన్నారు. గతేడాది రికార్డ్ స్థాయిలో 2 కోట్ల 85 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఉత్పత్తితో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్‌గా నిలిచిందని సీఎం గుర్తు చేశారు. ఈ ఏడాది కూడా అంతకంటే ఎక్కువ ఉత్పత్తి చేసి దేశంలోనే మరోసారి రికార్డు సృష్టించాలన్నారు.

కృత్రిమ కొరతకు చెక్
యూరియా కృత్రిమ కొరత ప్రచారానికి కలెక్టర్లు అడ్డుకట్ట వేయాలన్నారు. ఆగస్ట్ కోటా కూడా త్వరలోనే రాష్ట్రానికి సరఫరా అవుతుందన్నారు. అయితే యూరియా స్టాక్ వివరాలను డీలర్లు, షాప్ల వద్ద బోర్డుపై డిస్ ప్లే చేయాలన్నారు. స్టాక్ డీటైల్స్ ఆన్‌లైన్‌లో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. యూరియా అమ్మకాలు సాఫీగా సాగేలా రైతులకు ఇబ్బంది లేకుండా అన్ని చోట్ల డీలర్లు, షాపుల వద్ద ఇద్దరు అధికారులు, ఇద్దరు పోలీసులను అందుబాటులో ఉంచాలన్నారు.

కొన్ని చోట్ల చెప్పులు లైన్ లో ఉన్నట్లు, రైతులను ఇబ్బంది పెడుతున్నట్లు సోషల్ మీడియాల్లో వస్తుందని, దీన్ని కావాలని చేస్తున్నట్లు తనకూ తెలుసునని, కానీ ప్రభుత్వ యంత్రాంగం తరపున అలాంటి వాటికి అవకాశం ఇవ్వకుండా ముందస్తు జాగ్రత్తతో ఉండాలన్నారు. ఇక ఇతర వ్యాపార అవసరాలకు యూరియాను మళ్లిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ఇటీవలే కేంద్ర మంత్రి కూడా ఈ విషయాన్ని ప్రస్తావించారని సీఎం చెప్పారు. వ్యవసాయానికి కాకుండా ఇతర అవసరాలకు యూరియాను మళ్లిస్తే కఠినంగా వ్యవహరించాలన్నారు. ఎంతటి వారైనా ఉపేక్షించవద్దని, వెంటనే కేసులు పెట్టాలన్నారు. ఎరువులకు సంబంధించి టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించాలన్నారు.

రేషన్ కార్డుల డ్రైవ్
ఈ నెల 25 నుంచి వచ్చే నెల 10 వరకు అన్ని మండల కేంద్రాల్లో అధికారికంగా రేషన్ కార్డులు పంపిణీ చేయాలన్నారు. జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు ఈ కొత్త కార్డుల పంపిణీలో పాల్గొనాలన్నారు. ప్రతీ మండలంలో నిర్వహించే ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు పాల్గొనాలని సూచించారు. జిల్లాలో ఉన్న ప్రతి నియోజకవర్గంలో కనీసం ఒక చోట జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి కొత్త కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనాల్సిందే అని వెల్లడించారు.

ఇది నిరంతర ప్రక్రియ అని, పాత కార్డుల్లో పేర్లు తొలగించడం, కొత్త కార్డులు ఇవ్వడం వంటిని ఎప్పటికీ కొనసాగుతాయన్నారు. ఇక సన్న బియ్యం పంపిణీతో గతంలో ఎన్నడూ లేని విధంగా రేషన్ కార్డులు, రేషన్ షాపుల విలువ పెరిగిందన్నారు. రాష్ట్రంలో దాదాపు 7 లక్షల కొత్త కార్డుల పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. దీంతో దాదాపు 31 లక్షల కుటుంబ సభ్యులు లబ్ధి పొందుతారన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 96 లక్షల కార్డులతో 3.10 కోట్ల మంది సన్న బియ్యం తీసుకుంటున్నారని వెల్లడించారు.

 Also Read: Anil Murder Case: అనిల్ హత్యకు అదే కారణం.. సంచలన విషయాలు వెలుగులోకి!

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు