Fitness: ప్రతిరోజూ చక్కటి ఆహారం తింటున్నప్పటికీ ఫలితం కనబడడం లేదా?, ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండడం లేదా?. అయితే, చేయాల్సింది తక్కువ తినడం కాదు, స్మార్ట్‌గా తినాలని ప్రముఖ ఫిట్‌నెస్ కోచ్ రాజ్ గణపతి చెబుతున్నారు. సులభమైనవే అనిపించిన ప్రతి రోజూ ఆచరించాల్సిన ఆరు కీలకమైన ఆహార అలవాట్లను ఆయన పంచుకున్నారు. ఈ మేరకు జులై 17న తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఆయన ఒక వీడియోను షేర్ చేశారు.
1. ప్రతి భోజనంలో కూరగాయలు ఉండాలి!
భోజనం ఏవిధంగా తీసుకున్నా అందులో ఏదోఒక రూపంలో ప్రొటీన్, ఒకరకమైన కూరగాయ తప్పక ఉండేలా చూసుకోవాలి. ఇలా చేయడం చాలా సులభం, పెద్ద ఖర్చు కూడా కాదు, కాబట్టి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆయిల్, క్రీమ్, (Creamy), వేయించినవి కాకుండా జాగ్రత్తపడాలి. దీనిని పాటిస్తే శరీరానికి తక్కువ క్యాలరీలు అందుతాయి. ఇదే సమయంలో చక్కటి పోషకాలు కూడా అందుతాయని డాక్టర్ రాజ్ సూచించారు.
2. నెమ్మదిగా తినాలి
ఏం తింటున్నా, ఎప్పుడు తింటున్నా, ఎక్కడ తింటున్నా నెమ్మదిగా తినాలని డాక్టర్ రాజ్ సూచించారు. వేగంగా తింటే ఎక్కువగా తినే అవకాశాలు పెరుగుతాయని, శరీరానికి అధిక కేలరీలు అందడానికి దారితీయవచ్చని అప్రమత్తం చేశారు. నెమ్మదిగా తింటే ఆహారంపై నియంత్రణ ఉంటుందని ఆయన సలహా ఇచ్చారు. ఆహారంపై నియంత్రణ ద్వారా మంచి ఫలితాలు ఉంటాయనేది త్వరగానే అర్థమవుతుందని పేర్కొన్నారు.
3. బాగా ఆకలి అయ్యే దాకా ఉండొద్దు
భోజనం చేయడానికి ముందు బాగా ఆకలిగా ఉండే స్థితి వరకు వేచిచూడొద్దని డాక్టర్ రాజ్ సూచించారు. భోజన విరామం తగినంతగా ఉంటే చాలు అని, చాలా ఎక్కువసేపు ఆగితే, ఆకలి ఎక్కువై ఏది దొరికితే అది తినేయాలనే స్థితికి వెళ్తారని సూచించారు. బాగా ఆకలితో ఉంటే తిండిపై నియంత్రణ తగ్గుతుందని పేర్కొన్నారు. అదే ఆకలి తక్కువగా ఉంటే ఆహార ఎంపికలు మంచిగా ఉండేలా చూసుకుంటారని, ఎప్పుడు ఆపివేయాలో కూడా నిర్ణయించుకుంటారని పేర్కొన్నారు.
4. ఎక్కువసార్లు తినొద్దు
జీవనశైలి తీరు మారిపోవడంతో ఎక్కువసార్లు తినడం పరిపాటిగా మారిపోయిందని, ఈ విధంగా నడుచుకుంటే తప్పులు చేసేందుకు అవకాశం ఉంటుందని డాక్టర్ రాజ్ పేర్కొంది. ఎక్కువసార్లు తింటే అధికంగా ఆహారం తీసుకునే అవకాశం కూడా ఎక్కువేనని చెప్పారు. అందుకే మధ్య మధ్యలో స్నాక్స్ తినడం మంచిదని సూచించారు. రోజులో 2 లేదా 3 ప్రధాన భోజనాలకే పరిమితం కావాలని ఆయన సలహా ఇచ్చారు. అత్యధికులకు 2-3 సార్లు భోజనాలు చేస్తే సరిపోతుందని చెప్పారు.
Read Also- Hair Fall: అసలు జుట్టు ఎందుకు రాలిపోతుందో తెలుసా?
5. అతిగా తినకండి
అతిగా తినకపోవడం చాలా ముఖ్యమని డాక్టర్ రాజ్ పేర్కొన్నారు. సులభమైన ఈ రూల్‌ను పాటిస్తే అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చని అన్నారు. ‘‘బిర్యానీ తిన్నా, ఐస్‌క్రీమ్ తిన్నా అది విషయమే కాదు. ఎక్కువగా తినకుండా ఉంటే చాలు. కాబట్టి ఏదైనా తినేటప్పుడు పరిమితిగా తినడమే ముఖ్యం’’ అని ఆయన వివరించారు.
6. తప్పు చేసినా సరిదిద్దుకోండి
ఆహారం విషయంలో ఒకవేళ తప్పు జరిగినా సరిదిద్దుకోవాలని డాక్టర్ రాజ్ సూచించారు. ‘‘తప్పు జరిగిందని, దానినే తలచుకుంటూ ఉండకండి. అదే మైండ్‌సెట్‌లో ఉండకూదు. తదుపరి చేయబోయే భోజనం కొన్ని గంటల దూరంలోనే ఉంటుంది. ఈసారి జాగ్రత్తగా ఉండండి సరిపోతుంది’’ అని డాక్టర్ రాజ్ పేర్కొన్నారు.
మొత్తంగా చూస్తే తక్కువ తినడమే కాదు, సరైన విధంగా తినడమే ఫిట్‌నెస్‌కు మార్గమని డాక్టర్ రాజ్ సూచనల ద్వారా అర్థమవుతోంది.
గమనిక: సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిథిగా అందించాం. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘స్వేచ్ఛ’ ఎటువంటి బాధ్యత వహించదని గమనించగలరు.
Read Also- Mumbai blasts: పేలుళ్లు జరిగి 19 ఏళ్లు గడిచినా ‘దోషులు సున్నా’