Hair Fall
Viral, లేటెస్ట్ న్యూస్

Hair Fall: అసలు జుట్టు ఎందుకు రాలిపోతుందో తెలుసా?

Hair Loss: ఒకప్పుడు పెద్ద వయసువారిలో మాత్రమే జుట్టురాలే సమస్య ఉండేది. కానీ, ప్రస్తుత కాలంలో వయసు, లింగ భేదం లేకుండా ప్రతి ఒక్కరినీ ఈ సమస్య ఇబ్బందిపెడుతోంది. అయితే, కురులు రాలిపోవడాన్ని కేవలం అందానికి సంబంధించిన సమస్యగా మాత్రమే చూడకూడదు. జుట్టు రాలడానికి బాహ్య కారణాలు మాత్రమే కాకుండా శరీరంలోని అంతర్గత సమతుల్యత దెబ్బతినడం కూడా కారణం కావొచ్చు. అందుకే, ఈ సమస్య వెనుక బాహ్య కారణాలను మాత్రమే పట్టిపట్టి చూడకుండా, మూలకారణాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేయాలి.

అసలు కారణాలను తెలుసుకోవడం చాలా ముఖ్యమని కాస్మటాలజీ ప్రముఖ నిపుణురాలు డాక్టర్ శిఖా బాఘీ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. మానసిక ఒత్తిడి, హార్మోన్లలో మార్పులు, పోషకాల లోపం లేదా థైరాయిడ్, పీసీవోఎస్ వంటి శరీర అంతర్గత అసమతుల్యతలు కారణం కావచ్చని ఆమె సూచించారు. జుట్టు రాలడం కేవలం తలకు సంబంధించిన సమస్య మాత్రమే కాదని అంతర్గత ఆరోగ్యానికి ప్రతిబింబం కూడా కావొచ్చని, దీనికి శరీరానికే చికిత్స ఇవ్వా్ల్సి ఉంటుందని పేర్కొన్నారు. జుట్టు రాలడు సమస్యను తొలుత తల చర్మాన్ని విశ్లేషించడం ద్వారా మొదలుపెట్టాలని అన్నారు.

నూతన చికిత్సలు ఇవే
జుట్టు రాలుడు సమస్యతో బాధపడుతున్నవారికి కొన్ని ఆధునాతన చికిత్సలు అందుబాటులోకి వచ్చాయని డాక్టర్ శిభా బాఘీ తెలిపారు. పీఆర్‌పీ (ప్లేట్‌లెట్ రిచ్ ప్లాస్మా) థెరపీ, జీఎఫ్‌సీ (గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్‌ట్రేట్), ఎగ్జోసోమ్ రెజెనరేటివ్ ట్రీట్మెంట్స్, తల మిసోథెరపీ వంటి చికిత్సలు చక్కటి ఫలితాలను ఇస్తాయని పేర్కొన్నారు. రాలిపోయి నిస్తేజమై ఉన్న జుట్టు కణాలను ఉత్తేజితం చేసి, రక్త ప్రసరణ మెరుగుపరచి, సహజంగా జుట్టు పెరగడానికి సహాయపడతాయని డాక్టర్ బాఘీ వివరించారు. అయితే, క్లినిక్‌లో అందించే చికిత్సలకు తగ్గట్టు తగిన జీవనశైలి, ఆహారం తీసుకున్నప్పుడే మంచి ఫలితాలు వస్తాయని చెప్పారు.

Read Also- Mumbai blasts: పేలుళ్లు జరిగి 19 ఏళ్లు గడిచినా ‘దోషులు సున్నా’

పోషకాలు, జీవనశైలి కీలకం
జుట్టు రాలడానికి కారణమయ్యే బాహ్య సమస్యలపై దృష్టి పెట్టడానికంటే ముందు శరీరంలో అంతర్గత ఆరోగ్యాన్ని కాపాడుకోవడంపై దృష్టి పెట్టాలి. జుట్టుకు అవసరమైన బయోటిన్, విటమిన్ డీ, ఐరన్, ఒమేగా-3 వంటి పోషకాలు సమృద్ధిగా తీసుకోవాలి. ఒత్తిడిని నియంత్రించుకోవడం, సరిగా నిద్ర పోవడం, సమతుల్యత కలిగిన ఆహారాన్ని అనుసరిస్తే దీర్ఘకాలికంగా మంచి ఫలితాలు అందుకోవచ్చు.

విభిన్న కారణాలు
జుట్టు రాలుడు సమస్యలకు అనేక కారణాలు ఉండే అవకాశం ఉంది. డాక్టర్ విక్రం లాహోరియా అనే వైద్యుడు స్పందిస్తూ, దువ్వెనలో తక్కువ వెంట్రుకలు కనిపించడంతో మొదలై, చిన్నచిన్నగా జుట్టు రాలే సమస్య, అది కాస్త ఇంకాస్త తీవ్రంగా మారుతుందని చెప్పారు. టెలోజెన్ ఎఫ్లువియమ్ (ఒత్తిడి, శస్త్రచికిత్స, ప్రసవం తర్వాత వచ్చే తాత్కాలిక జుట్టు రాలడం), హెరిడిటరీ బాల్డ్నెస్ (పురుషులలో ముందుభాగంలో రాలిపోవడం, మహిళల్లో మద్యభాగంలో పలుచబడటం), పోషకాల లోపం (ప్రోటీన్, విటమిన్ బీ12, డీ, ఐరన్ తక్కువగా ఉండటం), థైరాయిడ్, పీసీఓఎస్ వంటి వ్యాధులు కారణం కావొచ్చని డాక్టర్ విక్రం లాహోరియా పేర్కొన్నారు. జుట్టు రాలడం ఆరోగ్యానికి ప్రతిబింబం లాంటిదని, చికిత్సకు ముందుగా అసలు కారణాన్ని తెలుసుకోవాలని పేర్కొన్నారు. మంచి అనుభవం ఉన్న డెర్మటాలజిస్ట్‌ను సంప్రదించాలని సూచించారు. జుట్టు రాలడం కేవలం అందానికి సంబంధించిన విషయం కాదు, వ్యక్తుల ఆరోగ్యానికి అద్దం లాంటిదని, శరీరం ఏదో చెప్పే ప్రయత్నం చేస్తున్నట్టే అని వైద్య నిపుణులు చెబుతున్నారు.

Read Also- Air India: ఎయిరిండియా విమానానికి తృటిలో తప్పిన ఘోర ప్రమాదం

గమనిక: సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిథిగా అందించాం. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘స్వేచ్ఛ’ ఎటువంటి బాధ్యత వహించదని గమనించగలరు.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!