Mumbai train blasts
జాతీయం, లేటెస్ట్ న్యూస్

Mumbai blasts: పేలుళ్లు జరిగి 19 ఏళ్లు గడిచినా ‘దోషులు సున్నా’

Mumbai blasts: సరిగ్గా పందొమ్మిదేళ్లక్రితం 2006 జులై 11న ముంబై మహానగరంలో ఉగ్రవాద నరమేధం జరిగింది. ఆ రోజు సాయంత్రం 6:23 గంటల నుంచి 6:28 గంటల మధ్య ఏడు ముంబై లోకల్ ట్రైన్లలో ఫస్ట్ క్లాస్ బోగీల్లో బాంబు పేలుళ్లు జరిగాయి. ముంబై చరిత్రలో ఘోరమైన ఈ ఉగ్రదాడుల్లో 187 మంది మృతిచెందగా, 800 మందికిపైగా ప్యాసింజర్లు గాయపడ్డారు. ఈ కేసుపై విచారణ చేపట్టిన మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ (MCOCA) ప్రత్యేక కోర్టు 2015లో 12 మందిని దోషులుగా తేల్చింది. 5 మందికి మరణశిక్ష విధించి, కుట్రలో భాగమైన మిగతా ఏడుగురికి జీవిత ఖైదు విధించింది. అయితే, నాడు దోషులుగా తేలిన 12 మంది నిర్దోషులంటూ బాంబే హైకోర్టు సోమవారం (జులై 21) సంచలన తీర్పునిచ్చింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తులు అనిల్ కిలోర్, శ్యామ్ చంద్ర చందక్‌లతో కూడిన బెంచ్ తీర్పునిచ్చింది. ‘‘ఈ కేసులో నిందితులు చేసిన నేరాన్ని నిరూపించడంలో ప్రాసిక్యూషన్ పూర్తిగా విఫలమైంది. అభియోగాల ఆధారంగా వీళ్లే ఈ నేరం చేశారని నమ్మడం కష్టం. అందుకే వీరిపై ఉన్న శిక్షలు రద్దు చేస్తున్నాం’’ అని కోర్టు తీర్పు పేర్కొంది. బాంబుల తయారీకి వాడారని చెబుతున్న సర్క్యూట్ బాక్స్‌లు, పేలుడు పదార్థాలు లాంటి కీలక ఆధారాలను పోలీసు విభాగం తగిన రీతిలో నిర్వహించలేదని కోర్టు తీవ్ర విమర్శలు గుప్పించింది.

జడ్జిలు ఏం చెప్పారు?
నిందిత వ్యక్తులంతా దోషులని నిరూపించడంలో ప్రాసిక్యూషన్ దారుణంగా విఫలమయ్యారని జస్టిస్ అనిల్ కిలోర్‌, జస్టిస్ శ్యామ్‌ చండక్‌‌ల బెంచ్ పేర్కొంది. ఇతర కేసుల్లో వాంటెడ్‌గా లేకుంటే నిందితులందరినీ జైలు నుంచి విడుదల చేయాలని ఆదేశాలు ఇచ్చింది. ముంబై లోకల్ ట్రైన్స్ బాంబు పేలుళ్ల కేసులో ఆధారంగా చూపిన సాక్ష్యాలు సందేహాస్పదంగా ఉన్నాయని న్యాయమూర్తులు తేల్చిచెప్పారు. బాంబు పేలుళ్లు జరిగిన 100 రోజుల తర్వాత ఎవరైనా నిందితులను గుర్తుపట్టగలరా? అనే జడ్జిలు నిలదీశఆరు. కేసు తదుపరి విచారణలో భాగంగా గుర్తించిన బాంబులు, పిస్తోళ్లు, మ్యాపులు ఇవేమీ పేలుళ్లతో సంబంధం లేనివని జడ్జిలు చెప్పారు. పైగా, రైళ్లలో పేలుళ్లకు ఏ రకమైన బాంబులను ఉపయోగించారో కూడా ప్రభుత్వం నిర్ధారించలేకపోయిందని వ్యాఖ్యానించారు.

దోషులు లేనట్టేనా?
దోషులంతా నిర్ధోషులంటూ బాంబే హైకోర్టు సోమవారం ఇచ్చిన తీర్పు అనూహ్య పరిణామం. ఏకంగా 187 మంది ప్రాణాలను బలిగొన్న ఇంతటి తీవ్ర ఉగ్రవాద ఘటనలో ఇప్పటివరకు దోషులు ఎవరూ లేరని తీర్పును బట్టి అర్థమవుతోంది. ఇది చాలా బాధాకరమైన, విచారకరమైన పరిస్థితిగా చెప్పాలి. పేలుళ్లు జరిగిన 19 ఏళ్ల తర్వాత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఆధారాల్లో ఖచ్చితత్వం లేకపోతే న్యాయవ్యవస్థ దోషిగా పరిగణించలేదని ఈ తీర్పు ద్వారా స్పష్టమైంది. ఇదే సమయంలో ఈ కేసులో ఆధారాలను దర్యాప్తు అధికారులు ఎలా నిర్వహించారనేది ప్రశ్నార్థకంగా మారింది. పోలీసుల దర్యాప్తు, ఆధారాల సేకరణ, విచారణ పద్ధతులపై అనుమానాలు కలుగుతున్నాయి. ఇప్పటివరకు దోషులు అనుకున్న వాళ్లను నిర్దోషులుగా తేల్చడంతో అసలు నేరస్తులు ఇంకా బయటే ఉన్నట్టుగా స్పష్టమవుతోంది. ఇదే నిజమైతే ముంబై పేలుళ్ల ఘటనలో బాధితులకు, వారి కుటుంబాలకు న్యాయం జరగలేదనే చెప్పాలి. అంతేకాదు, ఈ పరిణామం వ్యవస్థపై ప్రజల్లో నమ్మకాన్ని మరింత దిగజార్చుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

Read Also- Mumbai Blasts: ముంబై పేలుళ్ల కేసులో దోషులంతా నిర్దోషులే.. హైకోర్టు సంచలన తీర్పు

పేలుళ్లు ఎప్పుడు జరిగాయి?
ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ముంబై ట్రైన్ బాంబు పేలుళ్లు 2006 జూలై 11న సాయంత్రం 6.24 గంటల నుంచి 6.35 గంటల మధ్య సమయంలో జరిగాయి. కేవలం 11 నిమిషాల వ్యవధిలో వేర్వేరు లోకల్ ట్రైన్లలో ఏడు చోట్ల బాంబు పేలుళ్లు సంభవించాయి. చర్చి గేట్‌ నుంచి వెళ్లే ట్రైన్లలో ఫస్ట్ క్లాస్ కంపార్టుమెంట్లలో ప్రెషర్ కుకర్లలో బాంబులను అమర్చారు. జనాలు ఉద్యోగాలు, పనులు ముగించుకొని ఇంటికి వెళ్లే రద్దీ సమయంలో పేలుళ్లు జరిపారు. మటుంగా రోడ్‌, మహిమ్ జంక్షన్‌, బాంద్రా, ఖార్ రోడ్‌, జోగేశ్వరి, భయందర్‌, బోరివలి స్టేషన్లకు సమీపంలో బాంబులను పేల్చివేశారు. తొలి పేలుడు 6.24 గంటల సమయంలో జరిగింది. ఈ కేసుపై విచారణ జరిపిన ట్రయల్ కోర్టు 2015లో 13 మందిని దోషులుగా ప్రకటించింది. ఒకరు విచారణ సమయంలో చనిపోయారు. ఫైసల్ షేక్, ఆసిఫ్ ఖాన్, కమల్ అన్సారీ, ఎహ్తెషాం సిద్దికీ, నవీద్ ఖాన్‌లకు మరణశిక్ష విధిస్తూ ‘ది స్పెషల్ కోర్టు ఆఫ్ మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ యాక్ట్’ తీర్పునిచ్చింది. పేలుళ్ల కుట్రలో భాగస్వాములుగా ఉన్న మిగతా ఏడుగురు నిందితులైన మహ్మద్ సాజిద్ అన్సారీ, మొహమ్మద్ అలీ, డాక్టర్ తన్వీర్ అన్సారీ, మజీద్ షఫీ, ముజమ్మిల్ షేక్, సోహైల్ షేక్, జమీర్ షేక్‌లకు జీవిత ఖైదు విధించింది. ఈ తీర్పును తాజాగా బాంబే హైకోర్టు తోసిపుచ్చడంతో ఇన్నా్ళ్లు దోషులుగా ఉన్నవారంతా ఇప్పుడు జైళ్ల నుంచి విడుదల కానున్నారు. వీరిపై ఇతర కేసులు ఏమీ లేకుంటే త్వరలోనే బయటకు వచ్చేస్తారు. ప్రస్తుతం ఆ 12 మంది మహారాష్ట్రలోని జైళ్లలో ఉన్నారు. హైకోర్టు తీర్పును వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వీళ్లకు చదివి వినిపించారు.

Read Also- Air India: ఎయిరిండియా విమానానికి తృటిలో తప్పిన ఘోర ప్రమాదం

Just In

01

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?