Jurala Accident: ఓ కారు డ్రైవర్ నిర్లక్ష్యంగా కారును నడపడంతో ప్రమాదవశాత్తు పర్యాటకులపై కారు దూసుకెళ్లింది. ఈ క్రమంలో కారు టూ వీలర్ ను ఢీ కొట్టింది. బైక్ ను నడుపుతున్న వ్యక్తికి తీవ్ర గాయాలు కాగ, వెనూక కూర్చున వ్యక్తి ప్రమాదవశాత్తు ఎగిరిపడగా కృష్ణానదిలో పడి కొట్టుకపోయాడు. ఈ ఘటన ఆదివారం రాత్రి జూరాల ప్రాజెక్టు (Jura Project) మీద చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. జూరాల ప్రాజెక్టుకు (Jura Project) వరద ఉధృతి పెరగడంతో జూరాలకు జళకళ సంతరించుకుంది. డ్యామ్‌గేట్లను తెరిచి దిగువకు విడుదల చేస్తున్నారు.
Also Read: Palakurthy: పాలకుర్తి కాంగ్రెస్‌లో వర్గపోరు మరోసారి ఉద్రిక్తత..
గాలింపు చర్యలు
కావడంతో డ్యాం అందాలను చూడటానికి పర్యాటుకులు తరలివచ్చారు. ఈ క్రమంలో జోగులాంబ గద్వాల జిల్లా (Jogulamba Gadwal District) మానవపాడు మండలం బూడిదపాడు(ఎ) గ్రామానికి చెందిన జానకి రాము, మహేష్ లు సైతం ఆదివారం సెలవు దినం కావడంతో జూరాల ప్రాజెక్టు సందర్శనకు వెళ్లారు. జూరాల ప్రాజెక్టు సందర్శన అనంతరం బైక్ పై గద్వాలకు తిరిగి వస్తున్న క్రమంలో జూరాల డ్యాం మీద కర్ణాటక చెందిన ఓ కారు డ్రైవర్ కారును నిర్లక్ష్యంతో నడపడంతో రాంగ్ రూట్ లో వెళ్లి టూ వీలర్ ను ఢీకొట్టగా టూవీలర్ నడుపుతున్న జానకిరామ్ కు తీtవ్ర గాయాలయ్యాయి వెనకాల కూర్చున్న మహేష్ (Mahesh) ప్రమాదవశాత్తు జూరాల డ్యాం గేట్ల ముందు పడి కృష్ణానదిలో గల్లంతయ్యాడు. విషయాని తెలుసుకున్న ధరూర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో గాలింపు చర్యలను చేపట్టారు. సోమవారం తెల్లవారుజామున ప్రత్యేక బృందాలు కృష్ణానదిలో గాలింపు చర్యలు చేపట్టారు.
Also Read: Gold Rate Today: అయ్య బాబోయ్.. మళ్లీ పెరిగిన పసిడి ధరలు.. ఇవాళ ఎంతంటే?