Palakurthy: పాలకుర్తి కాంగ్రెస్‌లో వర్గపోరు మరోసారి ఉద్రిక్తతలకు దారి తీసింది. టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రాజేందర్ రెడ్డి (hansi Rajender Reddy) ఆధ్వర్యంలో గ్రామంలో ఏర్పాటు చేసిన ఎంపీటీసీ క్లస్టర్ సమావేశానికి ప్రతిగా అదే గ్రామంలో హనుమాండ్ల తిరుపతి రెడ్డి, (Hanumantha Tirupati Reddy,) కాకిరాల హరిప్రసాద్ వర్గం కూడా సమావేశం పెట్టడం రాజకీయ వేడి పెంచింది.కాకిరాల హరిప్రసాద్ ఆధ్వర్యంలో జరుగుతున్న సమావేశానికి ఝాన్సీ వర్గీయులు వెళ్లి మాట్లాడాలని ప్రయత్నించగా హరిప్రసాద్ వర్గీయులు తీవ్ర అభ్యంతరం తెలిపారు.
Also Read: ULI: సిబిల్ స్కోర్‌కు చెల్లుచీటీ.. కొత్త విధానం వచ్చేస్తోంది!
ఇది న్యాయమా..?
వాగ్వాదం తారాస్థాయికి చేరడంతో పోలీసుల జోక్యం అవసరమైంది. రెండు వర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.ఈ సందర్భంగా హరిప్రసాద్ మాట్లాడుతూ మేం పార్టీ కోసం కష్టపడి పని చేశాం,ఎమ్మెల్యేను గెలిపించాం, కానీ ఇప్పుడు పాతవాళ్లను పక్కనబెట్టి కొత్తవారికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇది న్యాయమా..? పార్టీ బలోపేతం కావాలంటే పాత కొత్త అనే తేడా లేకుండా అందరినీ కలుపుకొని పోవాలి. పిలిస్తే మేము సిద్ధం. కానీ పక్కనపెట్టి ముందుకు వెళ్తే మేం చూస్తూ ఊరుకోము,అని హెచ్చరించారు.
ఎవరికి భయపడేది లేదు
ఇదే సందర్భంగా టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రెడ్డి మాట్లాడుతూ మేం ఎవరికి భయపడేది లేదు. ఇంకా 40 ఏళ్లు ప్రజలకు సేవ చేస్తాం. పార్టీ పాత కొత్త అనే తేడా లేకుండా అందరినీ కలుపుకొని పోతుంది. కానీ కొంతమందికి అది నచ్చదు. అందుకే మాపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. మేము ఎక్కడికి పోయే ప్రశ్నే లేదు అని తేల్చిచెప్పారు.కాబట్టి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పాతవారికే మొదటి ప్రాధాన్యత ఉంటుందని, ప్రతి కార్యకర్త ఇంటింటికి పార్టీ పథకాలు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత ప్రారంభమైన ఈ గ్రూపుల గందరగోళం పార్టీకి ఎంత మేలుచేస్తుందో వేచి చూడాల్సిందే.
Also Read: Farmers Protest: రోడ్డెక్కిన రైతన్నలు.. సీడ్ కంపెనీల తీరుపై తీవ్ర ఆగ్రహం..