Manchu Vishnu: రెబల్ స్టార్ కృష్ణం రాజు (Rebel Star Krishnam Raju) నటించిన ‘భక్త కన్నప్ప’ స్ఫూర్తితో మోహన్ బాబు (Mohan Babu) ఓ సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకున్నారు. అది మంచు విష్ణు (Manchu Vishnu) రూపంలో నెరవేరింది. తన తండ్రి డ్రీమ్‌ని తన డ్రీమ్‌గా మార్చుకున్న మంచు విష్ణు.. రీసెంట్‌గా ‘కన్నప్ప’ అనే టైటిల్‌తో సినిమా తీసి, ప్రేక్షకుల మన్ననలను అందుకున్నారు. వాస్తవానికి కృష్ణం రాజు జీవించి ఉన్నప్పుడు ప్రభాస్ (Prabhas)తో ‘భక్త కన్నప్ప’ని రీమేక్ చేయాలని ఎంతగానో ప్రయత్నించారు. ఆ ప్రయత్నాలేవీ ఫలించలేదు. దీంతో కృష్ణం రాజు అనుమతితో మోహన్ బాబు తన బిడ్డ మంచు విష్ణుతో ఆ సినిమాను చేశారు. ఇటీవల థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలు అందుకుంది. విశేషం ఏమిటంటే.. కృష్ణం రాజు కోరికను కూడా మోహన్ బాబు తీర్చారు. భక్త కన్నప్పగా చేయలేదు కానీ, ‘కన్నప్ప’ చిత్రంలో ఓ కీలక పాత్రను ప్రభాస్ చేసి, తన పెదనాన్న కోరిక తీర్చారు. ఇక ఈ సినిమా ఒక వారం సినిమాగానే థియేటర్లలో సందడి చేసింది. దాదాపు రూ. 200 కోట్ల బడ్జెట్‌తో రూపుదిద్దుకున్న ఈ సినిమా కేవలం రూ. 25 కోట్ల షేర్‌ని మాత్రమే రాబట్టినట్లుగా ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా, కలెక్షన్ల పరంగా మంచు ఫ్యామిలీని ఈ సినిమా నిరాశ పరిచినట్లుగానే టాలీవుడ్ సర్కిల్స్‌లో వార్తలు వైరల్ అవుతున్నాయి.
Also Read- Natti Kumar: ఫిష్ వెంకట్‌కు హీరోలు ఎందుకు సాయం చేయాలి?.. నట్టి కుమార్ షాకింగ్ కామెంట్స్!
ఇక ‘కన్నప్ప’ షాకిచ్చినా మంచు విష్ణులో ఏ మాత్రం మార్పు రాలేదనేలా రెండు మూడు రోజుల నుంచి ఓ వార్త టాలీవుడ్ సర్కిల్స్‌లో బాగా వైరల్ అవుతుంది. అదేంటంటే.. మరో భారీ బడ్జెట్‌ను రూపొందించేందుకు మంచు విష్ణు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా టాక్ నడుస్తుంది. అది అలాంటిలాంటి ప్రాజెక్ట్ కాదు. ‘రామాయణం’ (Ramayanam) పేరుతో మంచు విష్ణు స్క్రిప్ట్ రెడీ చేసి పెట్టుకున్నారని, ఇందులో నటించే నటీనటుల విషయంలో కూడా ఆయన ఓ క్లారిటీకి వచ్చారనేలా వార్తలు వైరల్ అవుతున్నాయి. మరి ఇందులో నిజం ఎంత ఉందనేది తెలియదు కానీ, వినిపిస్తున్న వార్తల ప్రకారం బయటికి వచ్చిన విషయమైతే.. వావ్ అనిపించక మానదు. అదేంటంటే..
‘కన్నప్ప’ కోసం మోహన్ లాల్, ప్రభాస్, అక్షయ కుమార్, శరత్ కుమార్ వంటివారిని యాడ్ చేసుకున్న మంచు విష్ణు.. ఇప్పుడు ‘రామాయణం’ విషయంలో రాముడిగా కోలీవుడ్ స్టార్ హీరో సూర్యని, సీతగా ఆలియా భట్, లక్ష్మణుడిగా కళ్యాణ్ రామ్‌ని నటింపజేయాలని ప్రయత్నాలు చేస్తున్నారట. అంతేకాదు, ఈ ప్రాజెక్ట్‌లో కీలక పాత్ర అయినటువంటి హనుమంతుడిగా మంచు విష్ణు నటించనున్నారట. రావణాసురుడిగా మంచు మోహన్ బాబును నటింపజేయాలని చూస్తున్నారట. ఇంకా ఇద్దరు ముగ్గురు పాత్రధారుల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. దీంతో అంతా ఈ ప్రాజెక్ట్ గురించే మాట్లాడుకుంటున్నారు. ‘కన్నప్ప’ విషయంలో షాక్ కొట్టినా, మంచు విష్ణులో మార్పు రాలేదని అంతా అనుకుంటున్నారు.
Also Read- Samantha: వెన్నెల కిషోర్ ఏంటి తేడాగా చేస్తున్నాడు.. పక్కన సమంత నవ్వు ఆపుకోలేకపోతుంది!
ఇదిలా ఉంటే, ఇప్పుడు ‘రామాయణ’ పేరుతో బాలీవుడ్‌లో ఓ సినిమా రెండు పార్ట్‌లుగా రూపుదిద్దుకుంటోన్న విషయం తెలిసిందే. రణబీర్ కపూర్, సాయి పల్లవి, యష్ వంటి వారు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం మొదటి పార్ట్ చిత్రీకరణ జరుగుతోంది. ఈ ‘రామాయణ’ చిత్రీకరణలో ఉండగానే మంచు విష్ణు మరోసారి ‘రామాయణం’ ప్రయత్నాలు చేయడం ఎంత వరకు కరెక్ట్? అసలు ఈ ప్రాజెక్ట్ ఉంటుందా? లేదంటే, ఊహాగానాలు మాత్రమేనా? ఏదైనా ఊహకు కూడా ఓ హద్దు ఉంటుందని.. నెటిజన్లు కొందరు కామెంట్స్ చేస్తుండటం విశేషం.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు