Anirudh Ravichander: సంగీత దర్శకులకు మంచి పేరు వచ్చిన తర్వాత చేతిలో సినిమాలు ఉన్నా, లేకపోయినా కన్సర్ట్‌లు నిర్వహించుకుంటూ.. పేరుకు పేరు, మనీకి మనీ సంపాదించకోవచ్చనే దానికి ఈ మధ్యకాలంలో చాలా మంది సంగీత దర్శకులు నిర్వహిస్తున్న కచేరీలే ఉదాహరణ. సినిమా అవకాశాలతో పని లేదు, చేతినిండా సినిమాలో బిజీగా ఉన్న దేవి శ్రీ ప్రసాద్, థమన్ వంటి వారు కూడా సంవత్సరంలో ఐదారు సార్లైనా కన్సర్ట్‌లు నిర్వహిస్తుంటారు. ముఖ్యంగా అమెరికాలో వీరి కన్సర్ట్‌ల కోసం, అక్కడి తెలుగు ప్రేక్షకులు ఎంతగా టైమ్ కేటాయిస్తారో తెలియంది కాదు. ఈ సంస్కృతి ఇప్పుడు భారతదేశంలో కూడా మొదలైంది. ప్రపంచ, దేశం అనే తేడాలు లేకుండా మ్యూజిక్ డైరెక్టర్స్ వారి కన్సర్ట్ టూర్‌లను ప్లాన్ చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఈ మధ్య బాగా ట్రెండింగ్‌లో ఉన్న సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ కూడా ‘హుకుమ్’ పేరిట వరల్డ్ టూర్‌ని ప్లాన్ చేశారు.
Also Read- Rahul Sipligunj: మాట నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. రాహుల్ సిప్లిగంజ్ కు కోటి రూపాయల నజరానా
అనిరుధ్ ఈ ‘హుకుమ్ వరల్డ్ టూర్’ (Hukum World Tour)లో భాగంగా జూలై 26వ తేదీన చెన్నైలోని తిరువిదంతైలో ‘హుకుమ్ చెన్నై’ పేరిట కన్సర్ట్ జరగాల్సి ఉంది. కానీ, చివరి నిమిషంలో ఈ కన్సర్ట్ వాయిదా పడినట్లుగా వార్తలు వచ్చాయి. ఈ వార్తలు నిజమే అని తెలుపుతూ.. సంగీత దర్శకుడు అనిరుధ్ కూడా సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. అంతేకాదు, ఈ కన్సర్ట్ వాయిదా పడడానికి కారణం కూడా ఆయన తెలియజేశారు. ఈ కన్సర్ట్ నిర్వహించే వేదిక సామర్థ్యాన్ని మించి టిక్కెట్లకు భారీ డిమాండ్ ఏర్పడిందని, దీంతో అనుమతులు రాలేదని అందుకే కన్సర్ట్‌ను వాయిదా వేస్తున్నట్లుగా అనిరుధ్ తన పోస్ట్‌లో తెలిపారు. హుకుమ్ చెన్నై కన్సర్ట్ టికెట్ల కోసం అంచనాలకు మించి స్పందన వస్తోంది. ఈ కారణంగా జూలై 26న తిరువిదంతైలో జరగాల్సిన ఈ కన్సర్ట్‌ను వాయిదా వేస్తున్నాము. మీ ప్రేమకు, మీ ఓపికకు ధన్యవాదాలు. అతి త్వరలోనే విశాలమైన వేదికను నిర్ణయించి, గ్రాండ్‌గా ఈవెంట్‌ని నిర్వహిస్తామని తెలిపారు.
మరో వైపు ఈ కన్సర్ట్ నిమిత్తం టికెట్ బుకింగ్ ఓపెన్ అయిన 45 నిమిషాల కంటే తక్కువ టైమ్‌లోనే టికెట్లన్నీ అమ్ముడైపోవడం విశేషం. ఈ కన్సర్ట్‌కు హాజరయ్యేందుకు టికెట్స్ కొనుక్కున్న వారందరికీ 7 నుంచి 10 రోజుల్లో రీఫండ్ చేయడం జరుగుతుందని కన్సర్ట్ నిర్వాహకులు తెలిపారు. అనిరుధ్ తన హుకుమ్ వరల్డ్ టూర్ 2024లో ప్రకటించారు. ఇందులో అనేక ప్రపంచ నగరాల్లో ప్రదర్శనలు ఇవ్వనున్నారు. ఈ పర్యటన గత సంవత్సరం ఫిబ్రవరిలో దుబాయ్‌లోని కోకా-కోలా అరీనాలో ప్రారంభమైంది.. పలు నగరాల్లో జరిగే ప్రదర్శనల అనంతరం చివరిగా చెన్నైలో గ్రాండ్ ఫినాలేతో ఈ టూర్ ముగియనుంది.
Dear Hukum Family,
Due to the incredible love and overwhelming demand, the Hukum Chennai concert scheduled for July 26 at Thiruvidanthai is being postponed.
Thank you so much for your love and patience. We’ll be back soon – bigger, better, and louder! @poomerfashions… pic.twitter.com/ZIW9mEMqRU— Anirudh Ravichander (@anirudhofficial) July 20, 2025
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు