Heart health: బిల్వపత్రి అంటే కేవలం శివుని పూజ కోసం మాత్రమే కాదు, ఆరోగ్య సమస్యలకు కూడా చెక్ పెట్టగలదు. ఈ ఆకులో అంత పవర్ ఉంది. పరమేశ్వరుడికి బిల్వ ఆకులు సమర్పిస్తే సంతోషిస్తాడని పెద్దలు చెబుతారు. కానీ, ఈ ఆకులు మన ఆరోగ్యానికి కూడా అద్భుతమైన ఔషధమని మనలో చాలా మందికి తెలియదు. రోజూ ఉదయం ఖాళీ కడుపుతో బిల్వ ఆకులు తింటే అనేక ప్రయోజనాలున్నాయని నిపుణులు చెబుతున్నారు.
Also Read: Fish Venkat: దిల్ రాజు, సోను సూద్ సాయం చేస్తామని చెప్పి.. ఫోన్ కూడా ఎత్తలేదు.. ఫిష్ వెంకట్ కుమార్తె
బిల్వపత్రిలో దాగిన పోషకాలుబిల్వ ఆకులు కాల్షియం, ఫైబర్, విటమిన్ A, C, B1, B6లతో నిండి ఉన్నాయి. ఇందులోని యాంటీఆక్సిడెంట్ లక్షణాలు శరీరాన్ని రోగాల నుంచి కాపాడతాయి. ఈ ఆకులు చల్లని స్వభావం కలిగి ఉండటం వల్ల శరీరంలో వేడిని తగ్గించి, రోజంతా సౌకర్యవంతంగా ఉంచుతాయి.రోజూ ఉదయం బిల్వ ఆకులు తీసుకుంటే ఎన్ని లాభాలే ఇక్కడ తెలుసుకుందాం..
కడుపు సమస్యలకు సులభంగా చెక్ పెడుతుంది: గ్యాస్, అసిడిటీ, అజీర్ణం, ఫైల్స్ వంటి పొట్ట సమస్యలతో బాధ పడేవారు బిల్వ ఆకులతో తగ్గిపోతాయి. ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల ఈ సమస్యలకు ఉపశమనం లభిస్తుంది.
గుండె ఆరోగ్యం: యాంటీఆక్సిడెంట్స్ గుండెను వ్యాధుల నుంచి రక్షిస్తాయి. అధిక రక్తపోటు ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి.
మధుమేహ నియంత్రణ: డయాబెటిక్ రోగులకు బిల్వ ఆకులు వరం లాంటివి. దీనిలోని ఫైబర్, పోషకాలు రక్తంలో షుగర్ స్థాయిలను అదుపులో ఉంచుతాయి.
నోటి పుండ్లకు ఉపశమనం: నోటిలో పుండ్ల సమస్యను తగ్గించడంలో ఇవి ముఖ్య పాత్ర పోషిస్తాయి.
శరీరంలో చల్లదనం: వేసవి కాలంలో ఈ ఆకులు తీసుకోవడం వల్ల శరీరం చల్లగా ఉంటుంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘స్వేచ్ఛ’ ఎటువంటి బాధ్యత వహించదని గమనించగలరు.