CEO HR
Viral, లేటెస్ట్ న్యూస్

Viral News: సీఈవో హగ్ వైరల్.. గట్టిగా వాడేస్తున్న ప్రముఖ కంపెనీలు

Viral News: ఈ రోజుల్లో సోషల్ మీడియా ఎంతో పవర్ ఫుల్‌గా మారింది. ప్రతీ విషయం క్షణాల్లో వైరల్ అవుతున్నది. అలా, నాలుగైదు రోజులుగా వైరల్ అవుతున్న న్యూస్, ఆస్ట్రానమర్ కంపెనీ సీఈవో ఆండీ బిరాన్, హెచ్ఆర్ క్రిస్టిన్ కాబోట్ హగ్. ఓ మ్యూజిక్ కన్సర్ట్‌లో వీళ్లిద్దరూ హగ్ చేసుకున్న వీడియో నెట్టింట చక్కర్లు కొడుతున్నది. పెళ్లయి పిల్లలు ఉన్న ఈ వయసులో ఇలాంటివి అవసరమా అంటూ నెటిజన్లు ట్రోల్ చేయగా, చివరకు సీఈవో ఉద్యోగం ఊడింది. అలాగే, వీరిద్దరి హగ్ ప్రముఖ కంపెనీల బ్రాండ్లకు వరంగా మారింది.

అసలేం జరిగిందంటే?

గిల్లెట్ స్టేడియంలో కోల్డ్ ప్లే కన్సర్ట్ జరిగింది. ఆ సమయంలో స్పాట్ లైట్ ప్రేక్షకుల మీద వేశారు. అప్పుడు ఆండీ బిరాన్, క్రిస్టిన్ కాబోట్ చాలా క్లోజ్‌గా కనిపించారు. హగ్ చేసుకుని చాలా సంతోషంగా ఉన్నారు. అయితే, ఎప్పుడైతే స్పాట్ లైట్ వేశారో వెంటనే ఇద్దరూ ముఖం తిప్పేసుకున్నారు. ప్రముఖ కంపెనీకి చెందిన ఉద్యోగులు కావడంతో వీరిద్దరి వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ అయింది. నిజానికి వీళ్లిద్దరికీ వేర్వేరు వ్యక్తులతో పెళ్లయి పిల్లలు ఉన్నారు.

సీఈవో ఉద్యోగం ఊస్ట్

ఆస్ట్రానమర్ కంపెనీ కృత్రిమ మేధకు సంబంధించినది. సీఈవో, హెచ్ఆర్ వ్యవహారం నెట్టింట చక్కర్లు కొట్టి యాజమాన్యం దృష్టికి వెళ్లింది. వీరిద్దరి దెబ్బకు కంపెనీ పరువు పోవడంతో కీలక నిర్ణయం తీసుకున్నది. సీఈవో ఆండీ బిరాన్‌పై సస్పెన్షన్ వేటు వేసింది. ఈ విషయాన్ని సదరు కంపెనీ ఎక్స్‌లో ప్రకటించింది. ఆండీ కూడా తాను రాజీనామా చేసినట్టు ప్రకటించారు. తమ కంపెనీ ఉద్యోగులు నడవడిక విషయంలో అత్యున్నత స్థాయి ప్రమాణాలను పాటిస్తారని ఆస్ట్రానమర్ కంపెనీ తెలిపింది. అలాగే, ఆండీతో ఉన్న మహిళ హెచ్ఆర్ విభాగం వైస్ ప్రెసిడెంట్ కాదని స్పష్టం చేసింది.

Read Also- Indian Raiways: ప్రయాణికుడు చేసిన పనికి షాక్.. నెటిజన్ల ట్రోలింగ్

రంగంలోకి ప్రముఖ బ్రాండ్ల కంపెనీలు

సీఈవో, హెచ్ఆర్ వ్యవహారం నెట్టింట చక్కర్లు కొడుతుండగా, దీన్ని క్యాష్ చేసుకునేందుకు ప్రముఖ కంపెనీలు రంగంలోకి దిగాయి. వీళ్లిద్దరి హగ్ వీడియోను వాడుకుంటూ ప్రముఖ కంపెనీలు తమ బ్రాండ్లను ప్రమోట్ చేసుకుంటున్నాయి. ఐకియా సింగపూర్ తన ఇన్‌స్టాలో ఓ పోస్ట్ పెట్టింది. కోతి బొమ్మను వెనుక నుంచి పాండా కౌగిలించుకున్నట్టు ఉన్న ఫోటోను పోస్ట్ చేసి హెచ్ఆర్ ఆమోదించారు అని చేసిన పోస్ట్ నెటిజన్లను ఆకట్టుకుంటున్నది. ఫ్రిడో అనే దిండుల కంపెనీ కూడా దీన్ని వాడేసుకుంటున్నది. ఆండీ బిరాన్‌ తమ కంపెనీకి చెందిన దిండును కౌగిలించుకుని ఉన్నట్టు ఉన్న ఫోటోను పోస్ట్ చేసింది. ఇది కూడా నెటిజన్లను ఆకట్టుకుంటున్నది. ప్రైవేట్ జెట్ చార్టర్ కంపెనీ గ్లోబ్ ఎయిర్ కూడా వీరిద్దరి వీడియోకు తమ విమానాన్ని జోడించి ప్రత్యేక వీడియోను వదిలింది. ‘‘జీవితంలో ప్రతి దశలోనూ మేము మీకు సహాయం చేస్తాం, సెలవులు వస్తున్నాయి, మా విమానం ఎక్కేయండి’’ అని పోస్ట్ చేసింది. టెస్లా కంపెనీ కూడా కారు సర్వీస్‌కు సంబంధించి సీఈవో, హెచ్ఆర్ కన్సర్ట్ వీడియో గురించి ఫన్నీగా పోస్ట్ పెట్టింది. ఇవే కాదు ఇంకా చాలా మంది ఈ సంఘటనను వాడేస్తూ తమ కంపెనీలను, వ్యాపారాలను ప్రమోట్ చేసుకుంటున్నారు.

Read Also- Health Benefits: ఆ ఒక్క పండుతో 100 రోగాలకు చెక్ పెట్టొచ్చని తెలుసా?

Just In

01

Chamal Kiran Kumar: ఉద్యోగాల్లో కృత్రిమ మేధస్సు కీ రోల్.. ఎంపీ చామల కీలక వ్యాఖ్యలు

Peddi Update: రత్నవేలు ఇచ్చిన అప్డేట్‌తో రామ్ చరణ్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ!

Harish Rao: కవిత వ్యాఖ్యలపై.. తొలిసారి స్పందించిన హరీశ్‌ రావు

Srinivas Goud: వైన్స్ షాపుల్లో గౌడ్లకు 25శాతం ఇవ్వాల్సిందే… మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

CM Revanth Reddy: నిమజ్జనానికి సింపుల్ గా సీఎం.. ఏమైనా ఇబ్బందులున్నాయా?