Malla reddy land occupation case
క్రైమ్

Hyderabad:పోలీసుల తీరుపై మల్లారెడ్డి ఫైర్

  • పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉద్రిక్తత
  • కోర్టు వివాదంలో ఉన్న మల్లారెడ్డి స్థలం
  • ఆక్రమించుకోవడానికి యత్నించిన వ్యక్తులు
  • అల్లుడు, కొడుకుతో వెళ్లి అడ్డుకున్న మల్లారెడ్డి
  • పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్న మాజీ మంత్రి
  • ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని పోలీసులపై ఆగ్రహం

    Ex.Minister Mallareddy complaint against Police about Land occupation:

జీడిమెట్ల డివిజన్ సుచిత్ర మిలటరీ కాంపౌండ్ వాల్ రోడ్డు లో సర్వే నంబర్ 81,82 లో ఉన్న రెండు ఎరకాల 10 కుంటల స్థలం ఉంది. అది కోర్టు వివాదంలో ఉంది. స్థానిక ఎమ్మెల్యే మల్లా రెడ్డికి చెందిన భూమి అది. అయితే తమ స్థలాన్ని కబ్జా చేస్తున్నారంటూ శనివారం ఉదయం మాజీ మంత్రి మల్లారెడ్డి, ఆయన అల్లుడు ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి, కొడుకు భద్రారెడ్డిలు ముందస్తుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ పోలీసులు స్పందించలేదు. దీనితో కబ్జా జరుగుతున్న ఆ ప్రాంతానికి వెళ్లి కబ్జాను అడ్డుకున్నారు. దీనితో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణ ఏర్పడింది.

పోలీసులు రంగ ప్రవేశం

సమాచారం అందుకున్న పేట్ బషీర్ బాద్ పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఘర్షణ పడుతున్న రెండు వర్గాలను సముదాయించే ప్రయత్నం చేశారు. కాగా రాత్రికి రాత్రి తమ భూమిని కబ్జా చేసి వేసుకున్న రేకుల ఫెన్సింగ్ ను ఉదయం మల్లారెడ్డి అనుచరులు కూల్చేశారు. తమకు న్యాయం జరిపించకపోగా పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మల్లారెడ్డి, ఆయన అల్లుడు, కొడుకు ఆరోపించారు. ‘మా ప్రాణాలకు తెగించి మా భూమి మేం కాపాడుకుంటాం.. అప్పటిదాకా ఇక్కడి నుంచి కదిలేది లేదు.. మీకు దండం పెడతా” అంటూ ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, రాజశేఖర్ రెడ్డిలు పోలీసులతో తేల్చి చెప్పారు.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!