Hari Hara Veera Mallu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఫ్యాన్స్‌తో పాటు సినీ అభిమానులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu). ధర్మం కోసం పోరాడే యోధుడి పాత్రలో పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో నటిస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమా జూలై 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమైంది. నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఎ. దయాకర్ రావు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ పీరియాడికల్ డ్రామా చిత్రానికి ఎ.ఎం. జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకులు. పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించగా, బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు. ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై భారీగా అంచనాలను పెంచేసిన విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా ట్రైలర్ విడుదల తర్వాత ఈ సినిమాను చూసే కోణమే మారిపోయింది. తాజాగా ఈ చిత్ర మేకింగ్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు.
Also Read- AM Rathnam: ఆ అనుభవంతో చెప్తున్నా.. ‘హరి హర వీరమల్లు’ పెద్ద హిట్!
ఈ మేకింగ్ వీడియో తర్వాత, ఈ సినిమాపై మరింతగా అంచనాలు పెరగడం తథ్యం. ‘డం డం డప్పు చికు.. డం డం డప్పు చికు’ అంటూ ఓ బ్యాక్‌గ్రౌండ్ సాంగ్‌తో వచ్చిన ఈ మేకింగ్ వీడియో మాములుగా లేదు.
‘‘పులిని తినే బెబ్బులొచ్చెరో దొర.. దొడ్డ కళ్లు చేసి చూడరో జర
కండకావరాల కొమ్ములిరిగిపాయె.. సూడనీకి రెండుకళ్లు చాలకపాయె
ఉరుము లేక, మెరుపులేక యాడనుండో ఊడినాడు.. అడుగు అడుగు నేల మీద పిడుగులాగ అలికినాడు
యాట మొదలు పెట్టినాడురో ఎవడొగానీ తాటవలిచి తరుముతాండురో..
ఎగిరిఎగిరి దూకుతాండురో.. ఎవడొగానీ ఎగుడు దిగుడు దున్నుతాండురో..
దొడ్డ కళ్లు చేసుకుని సూడరా.. దొరా దొరా దొరా..’’ అంటూ పవర్ ఫుల్ లిరిక్స్‌తో, లేడీ వాయిస్‌లో వెనుక పాట వస్తుంటే.. స్క్రీన్‌పై శివతాండవమాడే సన్నివేశాలు చూపు తిప్పుకోనివ్వడం లేదంటే నమ్మాలి. అవును.. వీరమల్లు చెబితే వినడమే కాదు.. నమ్మాలి కూడా.
Also Read- Etela New Party: తెలంగాణలో పెను సంచలనం.. త్వరలో ఈటల కొత్త పార్టీ.. పేరు కూడా ఫిక్స్!
ఓవరాల్‌గా అయితే ఈ మేకింగ్ వీడియో.. ఫ్యాన్స్‌కి సినిమా విడుదలకు ముందే మంచి ట్రీట్ అనేలా ఉంది. ఇందులోని ప్రతి షాట్ వావ్ అనేలా ఉంది. చార్మినార్ సెట్ మేకింగ్, యాక్షన్ ఎపిసోడ్స్, అన్నీ కూడా సినిమాలో ఉన్న కంటెంట్ మాములుగా ఉండదనే ఫీల్‌ని ఇస్తున్నారు. ఈ మేకింగ్ వీడియో తర్వాత అభిమానులకు సినిమాపై మరింత నమ్మకం ఏర్పడుతుందనడంలో అతిశయోక్తి ఉండనే ఉండదు. మరెందుకు ఆలస్యం.. మీరూ ఈ మేకింగ్ వీడియోను చూసేయండి.. వీరమల్లు మత్తులో మునిగిపోండి..
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు