CITU Meeting: కార్మికులకు రక్షణగా ఉన్న చట్టాలను నిర్వీర్యం చేయడమే ప్రాధాని మోదీ లక్ష్యమని సిఐటియు(CITU) కేంద్ర కమిటీ కోశాధికారి సాయిబాబా పేర్కొన్నారు. మెదక్‌లో సిఐటియు(CITU) రాష్ట్ర ఐదవ మహాసభల ఆహ్వాన సంఘం సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సిఐటియూ, రాష్ట్ర, కేంద్ర కమిటీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎం సాయిబాబా(Saia Baba) మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ ఎజెండాలో కార్మికుల సంక్షేమం ఉండదని అన్నారు. కార్మికుల రక్షణగా ఉన్న చట్టాలను నిర్వీర్యం చేయడమే మోడీ లక్ష్యంగా పనిచేస్తున్నారని విమర్శించారు.
బానిసలుగా పని చేయాల్సిందే
మొన్న జరిగిన సమ్మెలో కనీస వేతనం 26 వేల కోసం దేశవ్యాప్తంగా కార్మికులు నినదించిన విషయాన్ని చెప్పారు. మోడీ తెచ్చిన లేబర్ కోడ్లు అమలు అయితే బానిసలుగా పని చేయాల్సిందేనని అన్నారు. అప్పుడు మనం అడుక్కోవడం తప్ప పోరాటం ఉండదని అన్నారు. అనంతరం సిఐటియు రాష్ట్ర నాయకులు చుక్క రాములు(Ramulu) మాట్లాడుతూ కార్మికుల ప్రయోజనాలే కాదు, సామాజిక బాధ్యత కలిగిన సంఘం సిఐటియూ అన్నారు. నాటి ఉమ్మడి మెదక్(Medak) జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం సిఐటియు ఎర్రజెండా పాదయాత్రలో ముందుందని అన్నారు. గజ్వేల్ లో రైతన్న ఆత్మహత్య చేసుకుంటే ఆదుకున్నాం నారాయణఖేడ్ లో కరువు వస్తే పాశుగ్రాస అందించి సామాజిక బాధ్యతగా సిఐటియు నిలిచిందన్నారు.
Also Read: Priyanka Chopra: నలభై మూడు వచ్చినా.. అదరగొడుతున్న బాలీవుడ్ క్వీన్ ప్రియాంక
సమస్యల పరిష్కారం కోసం
మెతుకు సీమలో సిఐటియూ 5వ మహాసభలు దిగ్విజయం చేసే బాధ్యత మనదేనని అన్నారు. వేతన జీవులే మహాసభల జయప్రదం కోసం ముందుకు రావడం అభినందనీయం అన్నారు. అనంతరం సుధా భాస్కర్ మాట్లాడుతూ కార్మికుల మధ్య మత విద్వేషాలను రెచ్చగొడుతూ బీజేపీ(BJP) పబ్బం గడుపుతుందని విమర్శించారు. సమస్యల పరిష్కారం కోసం పోరాటమే మార్గమని ఆయన పిలుపునిచ్చారు. హక్కుల రక్షణ కోసం పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. సమావేశంలో సిఐటియు కార్యవర్గ అధ్యక్షులు మల్లేశం,నర్సమ్మ తో పాటు ఉమ్మడి జిల్లా నేతలు, రాష్టస్థ్రాయి నేతలు పాల్గొన్నారు. మెదక్ జిల్లాలో జరిగే సిఐటియు(CITU) 5 వ మహాసభల ఆహ్వాన సంఘం చైర్మన్ గా చుక్కారాములును ఆహ్వాన సంఘం సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
Also Read: Jurala Project: జూరాలకు పెరిగిన వరద ప్రవాహం.. 18 గేట్లు ఎత్తివేత