Congress on KCR KTR: అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 9 సీట్లు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఏ మొహం పెట్టుకొని ఖమ్మం జిల్లాకి వస్తున్నావు. ఖమ్మం(Khammam) జిల్లా అభివృద్ధిని సర్వనాశనం చేసిన మీకు ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు ఇచ్చిన తీర్పు సరిపోదా అని నిలదీశారు. కెసిఆర్(KCR), కేటీఆర్(KTR) మీరా హామీల గురించి మాట్లాడేది అని ధ్వజమెత్తారు. సత్తుపల్లి క్యాంప్ కార్యాలయంలో జరిగిన ప్రెస్ మీట్‌లో కెసిఆర్, కేటీఆర్ పై సత్తుపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ మట్టా రాగమయి(Ragamai) హాట్ కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాగమయి మాట్లాడుతూ మీరిచ్చిన హామీ దళిత ముఖ్యమంత్రి ఎక్కడ, మీరిచ్చిన హామీ దళిత బంధు ఎక్కడ, మీరిచ్చిన హామీ బీసీ బందు ఎక్కడ, మీరిచ్చిన హామీ ఇంటికొక ఉద్యోగం ఎక్కడ, మీరిచ్చిన హామీ దళితులకు మూడు ఎకరాల భూమి ఎక్కడ, మీరిచ్చిన హామీ పూర్తిస్థాయిలో రుణమాఫీ ఎక్కడ.. ఇలా చెప్పుకుంటూ పోతే మీ హామీలు పుస్తకాలు రాయొచ్చ అందుకే తెలంగాణ రాష్ట్ర ప్రజలు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బుద్ధి చెప్పారని అన్నారు.
కార్యకర్తలే నిన్ను తరిముతారు
అయినా మీ తీరు మారకపోవడం దురదృష్టకరమన్నారు. మహిళలను అవమానపరుస్తూ, హేళన చేస్తూ మీరు చేసిన కామెంట్స్ ని ఒక మహిళగా ఖండిస్తున్నానని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy)ని నోటికి వచ్చినట్టు తిడుతున్నావ్ మీ దిగజారుడు రాజకీయాలు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలుసు. ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డిని మరి యొక్క సారి అవమానపరిస్తే మా ఖమ్మం జిల్లా కార్యకర్తలే నిన్ను తరిమి తరిమి కొడతారని స్పష్టం చేశారు. మా జిల్లా మంత్రులపై నువ్వు చేసిన కామెంట్స్ సత్తుపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాను అని చెప్పారు. మా జిల్లా మంత్రుల రాజకీయ అనుభవం అంత లేదు నీ వయసు వారి అనుభవం ముందు నీ పిల్ల చేష్టల అని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ కష్ట కాలంలో ఉన్నప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో పాదయాత్ర చేసి ప్రతి పేదవాడి కష్టం తెలుసుకొని కాంగ్రెస్ పార్టీ(Congress) గెలుపుకు ప్రధాన భూమిక పోషించిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) గారిపై నువ్వు చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి అన్నారు.
Also Read: Viral Video: యే క్యా హై.. పాములతో పండుగనా.. ఒక్కొక్కరు ఇలా ఉన్నారేంట్రా!
ఈసారి వారు కన్నెర్ర చేస్తే
ఖమ్మం జిల్లా అభివృద్ధి ప్రదాత మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Minister Tummala Nageswara Rao) ఈ ఉమ్మడి జిల్లాలో వారు చేసిన అభివృద్ధి తెలుసుకో చూసి నేర్చుకో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Ponguleti Srinivas Reddy) ఆనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బహిరంగంగా చాలెంజ్ చేసి మీ పార్టీని ఉమ్మడి ఖమ్మం జిల్లాలో లేకుండా చేశారు. వారిపై నువ్వు లేనిపోని బండాలు మాటలు మాట్లాడితే ఈసారి వారు కన్నెర్ర చేస్తే రాష్ట్రంలోనే నీ బీఆర్ఎస్ పార్టీ దిక్కు లేకుండా పోతుందని చెప్పారు. మీ బీఆర్ఎస్ పార్టీ పాలన కాలంలో మీరు చేసిన ఫోన్ ట్యాపింగ్(Phone Taping) వల్ల ఎందరి ఆడపిల్లల జీవితాలు తారు మారయ్యాయో ప్రజలందరికీ తెలుసన్నారు. టిఆర్ఎస్(TRS) పార్టీ అంటేనే వసూళ్లు దందా పార్టీ, గూండాయిజం పార్టీ, నయవంచన చేసే పార్టీ బీఆర్ఎస్(BRS) లో నిలబడే అభ్యర్థులే మీకు కరువయ్యారని అన్నారు. ఈ రాష్ట్రంలో, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ బిఆర్ఎస్ పార్టీకి డిపాజిట్ లేకుండా పోతుందని చెప్పారు.
కవిత ఫోన్ కూడా ట్యాపింగ్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రులు భట్టి, తుమ్మల, పొంగులేటి ఇతర క్యాబినెట్ మంత్రులు ఆధ్వర్యంలో ఇచ్చిన హామీలే కాకుండా ఇవ్వని హామీలు కూడా అమలు పరిచిన ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమేనన్నారు. మూడు నెలలకు ఒకసారి వచ్చే మీ అయ్య అక్కడ ముందు నీ ఇంటి సమస్యను చక్కదిద్దుకోండి స్వయంగా మీ అక్క కవిత నా ఫోన్ కూడా ట్యాపింగ్ అయిందని తెలిపారు. రేవంత్ రెడ్డి దెబ్బ ఎలా ఉంటుందో కెసిఆర్(KCR)కు, నీకు బాగా తెలుసు తెలుసుకో గుర్తు చేశారు. ఇందిరమ్మ ఇళ్లతో గ్రామ గ్రామాన పండగ వాతావరణం కాంగ్రెస్ ప్రభుత్వ అభివృద్ధిని చూసి ఓర్వలేక పోతున్నావు. రేవంత్ రెడ్డి కష్టపడి కింద స్థాయి నుంచి ఈరోజు ముఖ్యమంత్రి స్థాయి వరకు ఎదిగారు నీలాగా విదేశాల్లోంచి ప్రజల సొమ్ముతో ఎదగలేదు. ఆనాడు మీ ఆస్తి ఎంత ఈరోజు మీ ఆస్తి ఎంత ప్రశ్నించారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుందని జోష్యం చెప్పారు. తండ్రి కొడుకులు ఓ మాయల మరాఠీలని అన్నారు.
కృతజ్ఞత కూడా లేని నువ్వా మాట్లాడేది
కేటీఆర్(KCR) రాకతో ఖమ్మం జిల్లా అపవిత్రమైనదనీ పేర్కొన్నారు. సత్తుపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా కేటీఆర్(KTR), కెసిఆర్(KCR) దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. బిఆర్ఎస్ పార్టీ పాలనలో నిజమైన పేదవాడికి అందిన ఒక్క పథకం గురించి చెప్పగలవా అని నిలదీశారు. ప్రజల గురించి దేవుడి ఎరుగు కనీసం శాసనసభ్యులకు కూడా మీ నాన్న కేసీఆర్ కనపడేవారు కాదని గుర్తు చేశారు. ప్రజలిచ్చిన తీర్పు, గుణపాఠం చాల లేదా ఇంకా గట్టిగా కావాలా అని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియమ్మ పై కృతజ్ఞత కూడా లేని నువ్వా మాట్లాడేది అని సృష్టించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలతో తెలంగాణ రాష్ట్రంలో సంబరాలు చేసుకుంటున్నారన్నారు. మీ చెల్లె కవిత జైల్లో ఎందుకు వేసారో ప్రజలకు తెలుసన్నారు. మా జిల్లా మంత్రి ఎప్పుడూ ప్రజల్లోనే ఉంటూ, ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధి ప్రధాతలుగా నిలుస్తున్నారు. వారి అభివృద్ధి ఉమ్మడి జిల్లాలో జరగని ముద్ర ఖబర్దార్ కేటీఆర్ ఈసారి మా ప్రభుత్వం పై మా ముఖ్యమంత్రి పై మా మంత్రులు పై నిరాధార ఆరోపణలు చేసిన, అవాకులు చవాకులు పేలిన నిన్ను కాంగ్రెస్ కార్యకర్తలు తరిమి తరిమి కొడతారని గుర్తు చేశారు.
Also Read: ULI: సిబిల్ స్కోర్‌కు చెల్లుచీటీ.. కొత్త విధానం వచ్చేస్తోంది!