Jasprit Bumrah
Viral, లేటెస్ట్ న్యూస్

Jasprit Bumrah: బుమ్రా స్థానంలో ఎవరు?.. తెరపైకి డెబ్యూట్ ప్లేయర్!

Jasprit Bumrah: ‘అండర్సన్-టెండూల్కర్’ ట్రోఫీలో ఇప్పటికి మూడు మ్యాచ్‌లు పూర్తవ్వగా, ఆతిథ్య జట్టు 2, టీమిండియా (Team India) 1 విజయం సాధించాయి. దీంతో, 2-1 తేడాతో ఇంగ్లండ్ సిరీస్‌లో ముందంజలో నిలిచింది. ఫలితంగా మిగిలివున్న రెండు మ్యాచ్‌ల్లో ఒక్క విజయం సాధించినా సిరీస్‌ను ఇంగ్లండ్ కైవసం చేసుకుంటుంది. అందుకే, ఈ నెల 23 నుంచి ప్రారంభం కానున్న నాలుగవ టెస్ట్ మ్యాచ్‌కు అత్యంత పకడ్బందీగా బరిలోకి దిగి, ఎలాగైనా విజయం సాధించాలని టీమిండియా కృతనిశ్చయంతో ఉంది. మాంచెస్టర్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్ సమం చేయాలని పట్టుదలగా ఉంది. అయితే, కీలకమైన ఈ మ్యాచ్‌లో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) ఆడతాడా? లేదా? అన్నది ఉత్కంఠగా మారింది.

మాంచెస్టర్ టెస్ట్‌కు సమయం దగ్గర పడుతుండడంతో బుమ్రా అందుబాటులో ఉంటాడా లేదా అన్నది హాట్ టాపిక్‌గా మారింది. ఎందుకంటే, సిరీస్‌లో భాగంగా 5 మ్యాచ్‌లు జరగాల్సి ఉండగా, అందులో మూడు మ్యాచ్‌ల్లో మాత్రమే బుమ్రాను ఆడించాలని సిరీస్ ఆరంభానికి ముందే నిర్ణయించి ప్రకటించారు. దీంతో, ప్లాన్ ప్రకారం లీడ్స్ వేదికగా జరిగిన తొలి టెస్ట్, లార్డ్స్ వేదికగా జరిగిన మూడవ టెస్ట్‌లో బుమ్రా ఆడాడు. రెండవ మ్యాచ్‌కు విశ్రాంతి తీసుకున్నాడు. ప్లానింగ్ ప్రకారం సిరీస్‌లో బుమ్రా మరొక్క మ్యాచ్ మాత్రమే ఆడాల్సి ఉంది. దీంతో, నాలుగవ టెస్ట్‌ మ్యాచ్‌ తుది జట్టులోకి బుమ్రాను ఎంపిక చేస్తారా? లేక ఐదో టెస్ట్‌కు రిజర్వ్ చేసుకుంటారా? అన్నది సస్పెన్స్‌గా మారింది.

Read Also- Asia Cup: ఆసియా కప్ బాయ్‌కాట్ చేస్తాం.. పాక్‌కు బీసీసీఐ వార్నింగ్!

అర్షదీప్ సింగ్ బెస్ట్: రహానె
నాలుగువ టెస్ట్ మ్యాచ్‌లో బుమ్రాను ఆడించకపోతే, అతడి స్థానంలో యువ పేసర్ అర్షదీప్ సింగ్‌కు తుది జట్టులో చోటు కల్పించడం సరైన ఆప్షన్‌గా భావిస్తున్నట్టు టీమిండియా మాజీ కెప్టెన్ అజింక్య రహానె అభిప్రాయపడ్డాడు. అర్షదీప్ సింగ్ బెస్ట్ ఆప్షన్‌గా భావిస్తున్నాను, ఎందుకంటే, ఒక ఎడమచేతి పేసర్ జట్టులో ఉండడం అవసరమని పేర్కొన్నాడు. అర్షదీప్ సింగ్ రెండు వైపులా బంతిని స్వింగ్ చేయగలడని, విభిన్నమైన యాంగిల్స్‌లో బౌలింగ్ చేస్తూ, పిచ్‌పై స్పిన్నర్లకు అవసరమైన రఫ్‌ను కూడా క్రియేట్ చేయగలడని, అందుకే బుమ్రా అందుబాటులో లేకుంటే అర్షదీప్‌నే ఆడించాలని రహానే పేర్కొన్నాడు.

Read Also- Viral News: మరిదితో వివాహేతర సంబంధం.. భర్తను ఎలా చంపారంటే?

అవసరమైతే కుల్దీప్
పిచ్ పరిస్థితుల ఆధారంగా అవసరమైతే స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కి అవకాశం ఇవ్వాలని రహానె అభిప్రాయపడ్డాడు. ‘‘గత మూడు టెస్ట్‌ల మాదిరిగానే పిచ్ ఉంటే కుల్దీప్‌ను ఆడించాలి. ఎందుకంటే, వికెట్లు తీయగల ఆటగాళ్లు జట్టులో ఉండడం అవసరం. మన బ్యాటర్లు బాగానే రాణిస్తున్నారు. కొన్ని పరుగులు తక్కువ చేసినా పర్వాలేదు. కానీ, వికెట్లు తీసే బౌలర్లు జట్టులో అవసరం. ప్రతిసారి ఫాస్ట్ బౌలర్లపై ఆధారపడకూడదు’’ అని రహానే వ్యాఖ్యానించాడు. కాగా, పేసర్ అర్షదీప్ సింగ్‌కు టీ20 ఫార్మాట్‌లో మంచి అనుభవం ఉంది. ఇప్పటివరకు 63 టీ20 మ్యాచ్‌లు ఆడి 99 వికెట్లు పడగొట్టాడు. అయితే, ఇప్పటివరకు ఒక్క టెస్ట్ మ్యాచ్‌ కూడా ఆడలేదు. అయితే, ఇంగ్లండ్ పర్యటనకు సెలక్ట్ అయిన అర్షదీప్ సింగ్ నెట్ ప్రాక్టీస్‌లో గాయపడ్డాడు. వేగంగా దూసుకొచ్చిన బంతిని ఆపే ప్రయత్నం చేయబోగా, అది బలంగా తగలడంతో హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. చిన్నపాటి గాయం అయినట్టు తేలింది. కుట్ల పడ్డాయా? లేదా? అన్నది తేలలేదు.

Just In

01

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్