చల్లని పానీయాలకు దూరంగా ఉండండి
వర్షాకాలంలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నప్పుడు, చల్లని నీరు లేదా చల్లని ఆహారాలు తీసుకోవడం వల్ల గొంతు లోపలి పొర (మ్యూకోసా) ప్రభావితమవుతుంది. కాబట్టి వాటికి బదులుగా గోరువెచ్చని నీరు, హెర్బల్ టీ లేదా సూప్‌లు తీసుకోవడం గొంతు నొప్పి నుంచి ఉపశమనం పొందొచ్చు.
AC ఉష్ణోగ్రత తక్కువగా ఉండేలా చూసుకోవాలి
ACని 24°C కంటే తక్కువ ఉష్ణోగ్రతలో, ముఖ్యంగా రాత్రిపూట, ఉంచడం వల్ల గొంతు లోపలి పొర ఎండిపోయి, వాపు లేదా గొంతు నొప్పి వచ్చే అవకాశం ఉంది. రాత్రంతా AC వాడకానికి 25°C–26°C మధ్య ఉష్ణోగ్రత సరైనది.
తడిగా ఎక్కువసేపు ఉండకండి
తడి బట్టలు, తడి జుట్టుతో ఎక్కువసేపు ఉండటం వల్ల శ్వాసకోశ సంబంధిత ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. తడి బట్టలను వెంటనే మార్చి, తలను బాగా ఆరబెట్టడం ద్వారా గొంతు నొప్పి రాకుండా ఉంటుంది.
ఉప్పు నీటితో గొంతు పుక్కిలించడం
గొంతు నొప్పితో బాధపడేవారు రోజుకు రెండుసార్లు వెచ్చని ఉప్పు నీటితో పుక్కిలించడం వలన ఈ సమస్య తగ్గుతుంది. అలాగే, సీజనల్ వ్యాధులు కూడా రాకుండా ఉంటాయి. వైద్యుడి సలహా లేకుండా యాంటీబయాటిక్స్ ఉపయోగించడం మానండి.
చెవులను వీటితో శుభ్రం చేయకండి
ఇయర్‌బడ్స్, పిన్‌లు లేదా గుడ్డలతో చెవులను శుభ్రం చేయడం వల్ల సున్నితమైన చెవి పొర గాయపడవచ్చు. అలాగే రక్షణాత్మక ఇయర్‌వాక్స్ తొలగిపోతుంది. ఇయర్‌వాక్స్ ఇన్ఫెక్షన్ల నుండి చెవిని కాపాడుతుంది. అధిక చెవిని శుభ్రం చేసుకోవడం వలనా వల్ల చర్మం ఎండిపోయి, దురద మరింత తీవ్రమవుతుంది.
చెవులను ఇలా క్లీన్ చేసుకోండి..
వర్షాకాలంలో గాలిలో తేమ ఎక్కువగా ఉంటుంది, చెవిలోకి నీరు చేరడం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది. తలను పక్కకు వంచి నీటిని బయటకు పంపి, మెత్తటి టవల్‌తో చెవులను క్లీన్ చేసుకోండి. దురద, చెవి బ్లాక్ అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తే, అది ఫంగల్ ఇన్ఫెక్షన్ కావచ్చు. వీలైనంత త్వరగా వైద్య సహాయం తీసుకోవడం వలన త్వరగా కోలుకోవచ్చు.