Case on Pubs: మల్నాడు డ్రగ్స్ కేసులో విచారణ జరుపుతున్న ఈగల్ టీం అధికారులు తాజాగా మూడు పబ్బులపై కేసులు నమోదు చేశారు. దీంతో, తమపై నమోదైన కేసులను కొట్టివేయాలంటూ ఆయా పబ్బుల యజమానులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. పక్కాగా సేకరించిన సమాచారంతో ఇటీవల ఈగల్ టీం (Eagle Team) అధికారులు కొంపల్లిలోని మల్నాడు రెస్టారెంట్ వద్ద దాని యజమాని (Surya) సూర్యను అరెస్ట్ చేశారు. సూర్య కారు నుంచి ఓజీ కుష్, ఎక్టసీ పిల్స్‌తోపాటు కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
Also Read:Thai Women: సన్యాసులకు వలపు వల.. 80 వేల నగ్న వీడియోలు.. కిలేడీ గుట్టురట్టు!
విచారణలో వెల్లడైన వివరాల ఆధారంగా ఇదే కేసులో పోలీస్ (Police) అధికారుల కుమారులైన రాహుల్ తేజ, మోహన్‌తోపాటు మరో ఇద్దరిని కూడా అరెస్ట్ చేశారు. (Surya) సూర్యను జరిపిన విచారణలో (Hderabad) హైదరాబాద్‌లోని వేర్వేరు పబ్బుల్లో మరికొందరితో కలిసి అతను డ్రగ్ పార్టీలు నిర్వహించినట్టుగా వెల్లడైంది. ఈ పబ్బుల నిర్వాహకులు రాజశేఖర్, పృథ్వీ వీరమాచినేని, రోహిత్ మాదిశెట్టిలపై కేసులు నమోదు చేసి వారికి నోటీసులు జారీ చేశారు. ఇక, సూర్య ప్రిజం, ఫాం, బర్డ్ బాక్స్, బ్లాక్ 22 పబ్బుల్లో కూడా డ్రగ్ పార్టీలు జరుపుకున్నట్టు చెప్పిన నేపథ్యంలో వాటిపై కూడా విచారణ చేస్తున్నారు.
హైకోర్టులో పిటిషన్లు
తమపై నమోదు చేసిన కేసులను కొట్టి వేయాలంటూ రాజశేఖర్, పృథ్వీ వీరమాచినేని, రోహిత్ మాదిశెట్టిలు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. తమ పబ్బుల్లో సూర్య డ్రగ్ పార్టీలు చేశాడన్న విషయం తమకు తెలియదని పేర్కొన్నారు. డ్రగ్ పార్టీలు చేసుకోవడానికి తాము ఎలాంటి ప్రత్యేక ఏర్పాట్లు చేయలేదని తెలిపారు. ఈ పిటిషన్లపై విచారణ వాయిదా పడింది.
Also Read: US Visa: యూఎస్ వీసా వచ్చేదెట్టా?.. ఆందోళనలో భారతీయ విద్యార్థులు