Star Actress: సమీరా రెడ్డి, ఒకప్పుడు తెలుగు, హిందీ సినిమాల్లో నటించి తన అందం, నటనతో ఆకట్టుకున్న నటి, తన కెరీర్‌లో ఎదుర్కొన్న కొన్ని బాధాకరమైన సంఘటనలు ఓ ఇంటర్వ్యూలో ఫ్యాన్స్ తో పంచుకున్నారు. ఆమె జూనియర్ ఎన్టీఆర్‌తో ‘నరసింహుడు’ (2005), ‘అశోక్’ (2006) చిత్రాల్లో నటించింది. ఇంకా మెగాస్టార్ చిరంజీవితో ‘జై చిరంజీవ’ వంటి సినిమాల్లో మెరిసింది. ఆమె ఇతర సినీ ప్రముఖుల నుంచి అసభ్యకరమైన కామెంట్లు ఎదుర్కొన్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..
Also Read: Dinosaur Skeleton Auction: చరిత్రలో కనివినీ ఎరుగని వేలం.. ఓ వైపు అంతరిక్ష శిల.. మరోవైపు డైనోసార్!
ఎన్టీఆర్ నేను ఫ్రెండ్స్.. సమీరా రెడ్డి
సమీరా రెడ్డి తెలుగులో జూనియర్ ఎన్టీఆర్‌తో ‘నరసింహుడు’, ‘అశోక్’ చిత్రాల్లో నటించింది. ఈ రెండు సినిమాల్లో వీరి ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ అభిమానులను ఆకట్టుకోవడంతో , వీరిద్దరి మధ్య లవ్ ఎఫైర్ నడుస్తోందని, ఇది పెళ్లి వరకూ వెళ్తుందని రక రకాల రూమర్స్ వచ్చాయి. అయితే, సమీరా రెడ్డి ఒక ఇంటర్వ్యూలో ఈ పుకార్లను ఖండించారు. ఆమె మాట్లాడుతూ, “నేను ఏది ఉన్నా కూడా ఓపెన్ గా చెబుతా..
ఎన్టీఆర్ నాకు మంచి ఫ్రెండ్.. కో-స్టార్ కూడా. ఆయన ఎంతో సాయం చేశారు, నేను తెలుగు సినిమా రంగంలో కొత్తగా ఉన్నప్పుడు చాలా నేర్చుకునేలా చేశారు. కానీ, మా మధ్య ఇలాంటి రూమర్స్ రావడం అస్సలు బాలేదని ” అని అన్నారు. ఈ రూమర్స్ ఆమెను టాలీవుడ్‌లో ఎక్కువ కాలం కొనసాగకుండా చేశాయని, ఆమె తమిళ సినిమాల వైపు వెళ్ళానని తెలిపింది.
నువ్వు ముందు వాటి సైజులు పెంచుకో అన్నారు..
ఆమె మాట్లాడుతూ, “కొంతమంది నా మొహం మీదే నువ్వు ముందు వాటి సైజులు పెంచుకో.. బాగుంటుంది, అలా చేస్తేనే హీరోయిన్‌గా ఎక్కువ అవకాశాలు వస్తాయి ” అని సలహాలు ఇచ్చారు. ఇలాంటి మాటలు నన్ను చాలా బాధపెట్టాయి. నేను నా లాగే ఉండాలనుకున్నాను కానీ, ఎవరో చెప్పారని నన్ను నేను మార్చుకోవడం నాకు ఇష్టం లేదు” అని చెప్పింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Also Read: Pranava One HSEL: సోమాజిగూడ హెచ్‌ఎస్ఈఎల్ భవనంపై తప్పుడు సర్టిఫికేట్.. అధికారులకు ఫిర్యాదు!