Farmers Worried: వర్షాకాలం ఆరంభానికి ముందు మురిపించిన వరుణుడు ఖరీఫ్ సాగు ప్రారంభం కాగానే ముఖం చాటేశాడు. ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు పడతాయని ఐ ఎం డి శాస్త్రవేత్తలు అంచనా వేసినా అందుకు తగ్గట్టు వర్షాలు పడకపోవడంతో జూన్(JUN), జూలై(JULY) నెలలో జోగులాంబ గద్వాల జిల్లాలో లోటు వర్షపాతం నమోదయింది. సమృద్ధిగా వర్షాలు పడతాయని ఆశించి వాణిజ్య పంటలు పత్తి(Cotan), కంది, ఆముదం, వేరుశనగ పంటలను సాగు చేస్తున్నారు. అందుకు తగ్గట్లు అదును వర్షాలు పడకపోవడంతో రైతులు(Farmers) తీవ్ర నైరాశంలో కూరుకుపోయారు. మే నెలలో కురిసిన ముందస్తు వర్షాలకు దుక్కులు దున్ని సేద్యం చేసుకుని విత్తనాలు విత్తుకోగా మొలకెత్తిన విత్తనాలు సరైన వర్షం లేక ఎదుగుదల లోపిస్తుంది. వేడి వాతావరణం, ఈదురు గాలుల వలన భూమిలో తేమ శాతం తగ్గడంతో లేత మొక్కలు వాడు ముఖం పడుతున్నాయి.
జిల్లాలో సాగు విస్తీర్ణం ఇలా
జిల్లాలో పంటల సాగు విస్తీర్ణం 3,94066 లక్షలలో ఉంది అందులో ఆహార ఉత్పత్తి పంటలు సాగు 1,86395 లక్షల ఎకరాలలో, వాణిజ్య పంటలు 2,07988 లక్షల ఎకరాలలో సాగు చేయాల్సి ఉంది. సరైన అదును వర్షాలు పడకపోవడంతో ప్రస్తుత ఖరీఫ్ లో ఇప్పటికీ 94,937 వేల ఎకరాలలో పంటలు సాగు చేస్తున్నారు వర్షాలు పడితే సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉంది. జూరాల, నెట్టెంపాడు ఎత్తిపోతల పథకాల సుంకేసుల డ్యాం ద్వారా వరి పంట సాగుకు ఇప్పటికే వరినారు పెరుగుతుండగా పొలాలు సిద్ధం చేసుకుని నాటుకు సమాయత్తమవుతున్నారు.
Also Read: Farmers Protest: రోడ్డెక్కిన రైతన్నలు.. సీడ్ కంపెనీల తీరుపై తీవ్ర ఆగ్రహం..
పలు మండలాలలో లోటు వర్షపాతం
జిల్లా వ్యాప్తంగా జూన్ నెలలో సాధారణం కంటే పలు మండలాలలో లోటు వర్షపాతం నమోదైంది. మానవపాడు 54%, ఉండవల్లిలో 39% ,అలంపూర్ 25%, ఎర్రవల్లి మండలాలలో 27% సాధారణం కంటే లోటు వర్షపాతం నమోదయింది. జూలై నెల పూర్తవుతున్న నేటికి వాగులు, వంకలు పారే వర్షాలు పడకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పంటల సాగుపై ప్రభావం
జిల్లా వ్యాప్తంగా మే నెలలో అకాల వర్షాలు కురవడం, రుతుపవనాలు ముందుగా రావడంతో వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని అన్నదాతలు ఆశించారు. అందుకు భిన్నంగా జూన్, జులై నెలలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. ఆకాశంలో మబ్బులు కమ్ముకుంటున్నా కేవలం కొద్దిచోట్ల చిరుజల్లులు పడిపడక ఊసురుమనిపిస్తుండడంతో రైతులు మౌనంగా రోదన చెందుతున్నారు. సాధారణ వర్షపాతం 84% నమోదు కావాల్సి ఉండగా అందులో 59 శాతం లోటు నమోదయింది. మిరపకు ఆశించిన స్థాయిలో మద్దతు ధర లభించకపోవడంతో ప్రస్తుతం జిల్లాలో పత్తి పంటను అధికంగా సాగు చేస్తున్నారు. ముందస్తు వర్షాలకు విత్తనాలను విత్తుకోగా మొలచిన మొలకలు సరైన వర్షాలు లేక వాలిపోతున్నాయి. ఫలితంగా దిగుబడులపై ప్రభావం చూపే అవకాశం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Kothapallilo Okappudu: ‘కొత్తపల్లిలో ఒకప్పుడు’.. ఏం జరిగిందో తెలియాలంటే!