Kothapallilo Okappudu: ‘C/O కంచరపాలెం’, ‘ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య’ వంటి చిత్రాలు ఏ స్థాయిలో సినిమా ప్రేక్షకుల మనసుల్లో నాటుకుపోయాయో అందరికీ తెలిసిందే. అలాంటి సినిమాలను నిర్మించిన ప్రవీణ పరుచూరి ‘కొత్తపల్లిలో ఒకప్పుడు’ చిత్రానికి దర్శకత్వం వహించారు. పరుచూరి విజయ ప్రవీణ ఆర్ట్స్ ఈ ప్రాజెక్టును నిర్మించింది. మనోజ్ చంద్ర, మోనికా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా ప్రజెంట్ చేస్తున్న ఈ సినిమా రూరల్ కామెడీ నేపధ్యంలో ఉండనుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్ ట్రైలర్ లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నెల 18న సినిమా విడుదల సందర్భంగా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్‌ని నిర్వహించారు నిర్మాతలు. అనంతరం అక్కడ ఉన్న వారికి ప్రెస్ ప్రీమియర్ ఏర్పాటు చేశారు. ఇది చూసినవారు సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
Read also – Telangana excise special drive: కల్తీ కల్లుపై సాగుతున్న దాడులు..
ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్‌లో రానా దగ్గుబాటి మాట్లాడుతూ.. ‘కొత్తపల్లిలో ఒకప్పుడు’ ‘ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సినిమాను చూపించడం బహుశా ఇది మొదటి సారి కావొచ్చు. ఈ సినిమాను ఫస్ట్ టైం చూసినపుడు పాత్రలన్నీ చాలా సజీవంగా కనిపించాయి. అన్నీ మనకు తెలిసిన పాత్రలే మన చుట్టూ ఉన్న పాత్రలే అనిపించాయి. డైరెక్టర్ ప్రవీణ కార్డియాలజిస్ట్‌గా ప్రాక్టీస్ చేస్తూనే ఈ సినిమా తీశారు. హీరో మనోజ్ కూడా తన పని చేసుకుంటూనే సినిమాపై ఆసక్తితో ఇందులో నటించారు. ఒక సినిమా చేయాలంటే అన్నీ వదిలేసుకుని రావాలి అనే ఒక ఆలోచనకు భిన్నంగా వాళ్లు ఈ సినిమాని తీయడం చాలా ఆనందంగా అనిపించింది.’ అని అన్నారు.
Read also – Ariyana Glory: బెడ్ రూమ్ లో మా బావ మరో అమ్మాయితో అలాంటి పని.. చూసి బ్రేకప్ చెప్పా.. బిగ్ బాస్ బ్యూటీ
డైరెక్టర్ ప్రవీణ పరుచూరి మాట్లాడుతూ.. ‘నిర్మాతగా ఇది నా మూడో సినిమా. డైరెక్టర్‌గా మొదటి సినిమా. మీరు కేరాఫ్ కంచరపాలెం సినిమాని ఎంకరేజ్ చేశారు కాబట్టి నేను ఇప్పుడు ఈ సినిమా తీయగలిగాను. రానా లాంటి బిగ్ ప్రొడక్షన్ హౌస్ నాలాంటి ఫిలిం మేకర్స్ చేస్తున్న సినిమాల్ని సపోర్ట్ చేయాలంటే ఆడియన్స్ తప్పకుండా థియేటర్స్‌కు వచ్చి సపోర్ట్ చేయాలి. కంచరపాలెం సినిమాని చాలామంది థియేటర్స్ లో మిస్సయ్యామని చెప్పారు. ఈ సినిమా మాత్రం థియేటర్లో మిస్ అవ్వొద్దు. తప్పకుండా చూడండి. మీ మీద నమ్మకంతో ఈ సినిమా తీశాను.’ అని అన్నారు. హీరో మనోజ్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో చూస్తున్న రామకృష్ణ మొదట ఇలా లేడు. రామకృష్ణుని అంత అద్భుతంగా తయారుచేసిన క్రెడిట్ డైరెక్టర్‌కు దక్కుతుంది.’ అని అన్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ చూస్తుంటే.. ఈ మధ్య కాలంలో చ్చే సనిమాలకు భిన్నంగా కనిపిస్తోంది. అంతా కొత్తవారు కావడంతో సినిమా చాలా కొత్తగా అనిపించింది. నిర్మాత అంతకు ముందు తీసిన సినిమాలు హిట్ కావడం, రానా సపోర్టు చేయడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు