Sir Madam Trailer: భార్యభర్తల మధ్య గొడవలు సహజం. వారి మధ్య గొడవకు ఏ చిన్న కారణమైనా చాలు. ముఖ్యంగా ఇద్దరూ ఇగోకి పోతే మాత్రం ఇక ఆ జంటను కాపాడటం ఎవరితరం కాదు. వారంతట వాళ్లే తెలుసుకుని, కామ్ అయితే తప్ప.. వారి మధ్యలోకి ఎవరు వెళ్లినా వారి తలకాయలకు బొప్పి కట్టడం తథ్యం. భార్యభర్త అర్థం చేసుకుని జీవిస్తే.. అంతకంటే హ్యాపీ లైఫ్ ఏదీ ఉండదు. ప్రతి చిన్నదానికి గొడవపడే జంటను చూసిన వారంతా.. ఏ భార్యభర్తలకు ఇలాంటి కష్టం రాకూడదని అనుకుంటూ ఉంటారు. సేమ్ టు సేమ్ ఇప్పుడు వచ్చిన విజయ్ సేతుపతి, నిత్యా మీనన్‌ల సినిమా ‘సార్ మేడమ్’ ట్రైలర్ చూసిన వారంతా కూడా ఇదే అనుకుంటున్నారు. బాబోయ్.. ఈ జంట ఇలా ఉందేంటి? అని అంతా అవాక్కవుతున్నారు. విషయంలోకి వస్తే..
వెర్సటైల్ హీరో విజయ్ సేతుపతి (Vijay Sethupathi), టాలెంటెడ్ బ్యూటీ నిత్యా మీనన్ (Nithya Menen) జంటగా నటిస్తున్న రోమ్ కామ్ ఫ్యామిలీ డ్రామా ‘సార్ మేడమ్’. ‘A Rugged Love Story’ అనేది ఈ సినిమాకు ట్యాగ్‌లైన్. పాండిరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సత్యజ్యోతి ఫిలిమ్స్ బ్యానర్‌పై సెందిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ‘సార్ మేడమ్’ టీజర్ మంచి స్పందనను రాబట్టుకోగా, తాజాగా ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ ఎలా ఉందంటే.. ‘‘నాతో వస్తే లైఫ్ ఎలా ఉంటుందో ఆలోచించకుండా నేనే కావాలని వచ్చేశావు. మా అమ్మానాన్నే నన్ను ఇలా చూసుకోలేదని వాళ్ళే తిట్టుకునే విధంగా నిన్ను చూసుకుంటా’’ అని విజయ్ సేతుపతి డైలాగ్‌తో మొదలైన ఈ ట్రైలర్.. ఆ తర్వాత కాసేపటికే ఇదేం జంటరా బాబోయ్ అనిపిస్తుందంటే.. ఈ సినిమా మెయిన్ కాన్సెప్ట్ ఏంటో అర్థం చేసుకోవచ్చ.
Also Read- Mega vs Allu: అల్లు అరవింద్ బుద్ధి చూపించాడు.. ‘వీరమల్లు’కి పోటీగా ఆ సినిమా!
విజయ్ సేతుపతి, నిత్యా మీనన్ మధ్య వచ్చే గొడవలు చాలా ఎంటర్‌టైనింగా దర్శకుడు ఇందులో చూపించారు. పెళ్లి చూపులు, పెళ్లి లాంటి బ్యూటిఫుల్ ఎమోషన్స్‌తో ట్రైలర్ ఆసక్తికరంగా మొదలై.. చివరకు ‘మమ్మల్నిద్దర్నీ విడదీసేయండి’ అని నిత్యా మీనన్ చెప్పిన డైలాగ్‌తో ఊహించని మలుపు తీసుకోవడమే కాదు, చూస్తున్న వారికి కూడా ఎప్పుడెప్పుడు ఈ సినిమా వస్తుందా? అని ఆసక్తిని కలిగిస్తుంది. ఇందులో పరోటా మాస్టర్‌గా విజయ్ సేతుపతి కనిపించిన సీన్స్ నవ్వులు పూయిస్తున్నాయి. ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో మాస్ యాక్షన్ కూడా ఉండడం మరింత ఆసక్తిని పెంచుతోంది. ఎప్పటిలానే విజయ్ సేతుపతి మరోసారి తన సహజమైన నటనతో ఆకట్టుకోగా.. విజయ్ సేతుపతి, నిత్యా మీనన్‌ల కెమిస్ట్రీ వావ్ అనిపించే రేంజ్‌లో ఉంది. సంతోష్ నారాయణన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఓవరాల్‌గా ఈ సినిమాపై భారీగా అంచనాలు పెంచే విధంగా ట్రైలర్‌ని కట్ చేశారు. ఈ సినిమా జూలై 25 గ్రాండ్‌గా థియేటర్లలోకి రానుంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు