Anupama Parameswaran: లేడీ ఓరియంటెడ్ చిత్రాలు తీయాలి అంటే దర్శకుడికి అయినా, నిర్మాతకు అయినా, కథానాయికకు అయినా చాలా ధైర్యం కావాలి. ఎందుకు అంటే లేడీ ఓరియంటెడ్ చిత్రాలకు ఆదరణ తక్కువ ఉంటుంది. అలాంటిది యువతలో మంచి క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్, ‘సినిమా బండి’ ఫేమ్ దర్శకుడు ప్రవీణ్ కాండ్రేగుల, నిర్మాతలు ఆనంద మీడియా బ్యానర్ శ్రీనివాసులు, శ్రీధర్ లు ఈ సినిమా తీసి సాహసం చేశారు. ఈ సినిమా నుంచి విడుదలైన ప్రచార చిత్రాలను చూసిన తర్వాత వారు ఎంతెలా నమ్మితే ఈ కథను తెరకెక్కించారో అనిపిస్తుంది. వారి నమ్మకానికి తగ్గట్టుగా ఇప్పటికే విడుదలైన టీజర్ సమాధానం చెబుతోంది. లక్షల్లో వ్యూస్ సాధించి అందరి మన్ననలు పొందుతోంది. ఈ సినిమాలో దర్శన రాజేంద్రన్, సంగీత, రాగ్ మయూర్ తదితరులు ప్రదాన పాత్రలు పోషిస్తున్నారు.
Read also- Junior Movie: ‘జూనియర్’ ప్రీ రిలీజ్ వేడుకలో హైలైట్ ఏంటో తెలుసా?
ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ‘పరదా’ సినిమా విడుదల తేదీని నిర్మాతలు ప్రకటించారు. దీనికి సంబంధించిన ఓ పోస్టర్ ను విడుదల చేశారు. అందులో సినిమా ఆగస్టు 22 తేదీన విడుదల కానుందని తెలుస్తుంది. పోస్టర్‌లో అనుపమ పరమేశ్వరన్ సాంప్రదాయ చీరలో కనిపించారు. బ్యాక్ డ్రాప్ లో దేవత విగ్రహం ఉండటం ఆధ్యాత్మిక, ఎమోషనల్ కోర్ ని యాడ్ చేసింది. దీనితో పాటు సంగీత దర్శకుడు గోపి సుందర్ స్వరపరిచిన ‘యత్ర నార్యస్తు’ పాటను విడుదల చేశారు. దానిలో మహిళల శక్తిని, పవిత్రతను స్ఫూర్తిదాయకంగా చూపిస్తూ.. దైవత్వాన్ని ప్రజెంట్ చేస్తోంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హీరో సత్యదేవ్, నిర్మాత సురేష్ బాబు హాజరయ్యారు.
Read also- Nimisha Priya: నిమిషా మరణశిక్షపై మరోసారి స్పందించిన కేంద్రం
ప్రొడ్యూసర్ సురేష్ బాబు మాట్లాడుతూ.. మనం జీవితంలో ముందువెళ్తున్న కొద్ది భయం మోటివేషన్ అనే రెండు ఫ్యాక్టర్స్ ఉంటాయి. విజయ్ తీస్తున్నప్పుడు ఎందుకంత రిస్క్ చేస్తున్నారు అనే భయం ఉండేది. ఈ సినిమా ట్రైలర్ చూపించాడు. షాక్ అయ్యాను. అంత అద్భుతంగా తీశారు. సినిమా చూశాను చాలా అద్భుతంగా ఉంది. చాలా ప్యాషన్ తో ఈ సినిమా చేశారు. ఒక కొత్త రకమైన కథ చెప్పాలి అనే తపన కనిపించింది. అని అన్నారు. అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ.. ప్రేక్షకులు ఈ సినిమా చిన్న సినిమా అంటున్నారేమో ఈ సినిమా ద్వారా మేము చెప్పదలచుకున్న కంటెంట్ చాలా పెద్దది. ఇందులో చాలా కమర్షియల్ మూమెంట్స్ ఉంటాయి. అందరూ తప్పకుండా చూడాల్సిన సినిమా. ఏంతో ధైర్యంతో ఈ సినిమాను చేశాము. ఒక స్టిరియోటైప్ బ్రేక్ చేయడం మా అందరి అల్టిమేట్ గోల్ అని అన్నారు.
ప్రొడ్యూసర్ విజయ్, శ్రీధర్ మాట్లాడుతూ.. ఇష్టంగా చాలా కష్టపడి చేసిన సినిమా ఇది. మూడేళ్ల ప్రయాణం. చాలా మంచి డేట్ కి సినిమా వస్తోంది. మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్ డే ఆగస్టు 22న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. అని అన్నారు. డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగుల మాట్లాడుతూ.. ఆగస్టు 22 న మెగాస్టార్ పుట్టినరోజు. అంతకుమించి మంచి డేట్ దొరకదు. సినిమా బండి, శుభం తర్వాత ఈ సినిమా నాకు చాలా పెద్ద ఫిల్మ్. చాలా హానెస్ట్ గా ఈ సినిమా చేశాం. మాకిది బాహుబలి లాంటి సినిమా అని అన్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు