Hanumakoda Farmers: హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని వ్యవసాయ సహకార సంఘం వద్ద యూరియా, ఎరువుల కోసం రైతులు బారులు తీరారు. ఎరువుల సరఫరా ఆలస్యం కావడంతో వారి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఎరువుల కోసం రోజుల తరబడి వేచి చూడాల్సి వస్తున్నదని, వ్యవసాయ పనులు ఆగిపోవడం వల్ల నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read: Farmers Protest: రోడ్డెక్కిన రైతన్నలు.. సీడ్ కంపెనీల తీరుపై తీవ్ర ఆగ్రహం..
క్యూలైన్‌లో చెప్పులు
మూడు రోజులుగా చెప్పులు, ఆధార్ కార్డులతో క్యూలో నిలబడుతున్నారు రైతులు. ఎరువుల కోసం తిరగడమే ప్రధాన పనిగా మారిందని, పంట పండించాలా లేక క్యూలో నిలబడాలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల మధ్య ఉద్రిక్తత పెరగడంతో పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. కమలాపూర్ పోలీసులు అధికారులతో మాట్లాడి త్వరలో ఎరువుల సరఫరా జరుగుతుందని రైతులకు భరోసా ఇచ్చారు. సమయానికి అందుబాటులోకి తేవాలని, బ్లాక్ మార్కెట్‌ను కట్టడి చేయాలని రైతులు కోరుతున్నారు. సంబంధిత అధికారులు గ్రామ స్థాయిలో వచ్చి సమస్యలను స్వయంగా తెలుసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Also Read: Khammam District Farmers: వినూత్న రీతిలో మామిడి పిక్కల నుండి మొక్క తయారీ.. ఎక్కడంటే!