Jangaon district: ముద్దులొలికే చిన్నారిని అల్లాడు ముద్దుగా చూసుకోవాల్సిన సమయం కానీ ఎవరూ చేసిన పాపమో ఏమో తెలియదు గానీ ముక్కుపచ్చలారని ఈ పసికందు(Baby)కు శాపంగా మారింది. అమ్మ ఒడిలో ఆడుకోవాల్సిన అభము శుభము తెలియని శిశువును నడి రోడ్డు పై వదిలేశారు. చక్కగా ఉన్న మగ శిశువును రోడ్డు పక్కన పడేసి వెళ్లిన ఆ కఠినాత్మురాలు ఎవరో ఇదేం పాడులోకమో అని ప్రజలు చర్చించుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే జనగామ జిల్లా(Jangaon District) రఘునాథ పల్లి మండలం ఖిలాషాపురంలో ఉదయం రోడ్డు పై పసికందు(మగ శిశువు) ను ఎవరో గుర్తు తెలియని వారు పడేసి వెళ్ళడం కలకలం రేగుతోంది.
తెల్లవారు జామున పసిపాప ఏడుపు వినిపిస్తుండటంతో గ్రామస్తులు లేసారు. గ్రామ పెద్దలు ఆ శిశువుకు స్నానం చేయించి పోలీసుల(Police)కు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి వెళ్లిన పోలీసులు పసికందును ఐసిడిఎస్(ICDS) అధికారులకు అప్పగించారు. ఐసిడిఎస్ జిల్లా అధికారులు మాత శిశు సంరక్షణ కేంద్రానికి(Maternal and Child Care Center) పసి కందును పంపిస్తామని తెలిపారు.
Also Read: High Court: మహిళకు ఇచ్చే గౌరవం ఇదేనా.. నల్లపురెడ్డిపై హైకోర్టు సీరియస్
అమ్మా నీకు మనసేలా వచ్చింది?
నవమాసాలు మోసి పురిటి నొప్పులకొర్చి ఈ లోకంలోకి వచ్చే అవకాశం ఇచ్చిన అమ్మా.. నీకు ఆ ముక్కుపచ్చలు ఆరని పసికందును రోడ్డుపై రోడ్డుపై పడేందుకు నీకు మనసేలా వచ్చింది. నడి రాత్రి రోడ్డు(Road)మీద వేసిన శిశువును గ్రామస్థులు చూసి అక్కున చేర్చుకున్నారు. ఎవరు గమనించకపోయి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో అని గ్రామస్తులు మండిపడుతున్నారు. కడుపారా కన్న ఆ తల్లికి రోడ్డుమీద పడేందుకు మనసేలా వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శిశువును చక్కగా చూసుకునేందుకు సంబంధిత అధికారులు చొరవ చూపాలని స్థానికులు కోరుతున్నారు.
Also Read: Farmers Protest: రోడ్డెక్కిన రైతన్నలు.. సీడ్ కంపెనీల తీరుపై తీవ్ర ఆగ్రహం..