EX Sarpanch Suicide: తమ సొంత భూమి, బంగారం తాకట్టు పెట్టి అభివృద్ధి పనులు చేసిన పాత బిల్లులు ప్రభుత్వం చెల్లించడం లేదని ఆగ్రహంతో కరీంనగర్(Karimnagar) జిల్లా గంగాధర మండలం లక్ష్మీదేవిపల్లి గ్రామంలో మాజీ సర్పంచ్ తాళ్ల విజయలక్ష్మి భర్త రవి(Ravi) పురుగుల మందు తాగి ఆత్మహత్య(Suside) యత్నానికి పాల్పడ్డాడు. ఈ విషయమై మాజీ సర్పంచ్ తాళ్ల విజయలక్ష్మి(Vijayalaxmi) మాట్లాడుతూ అప్పటి ప్రభుత్వ సూచన ఒత్తిడి మేరకు అప్పులు చేసి గ్రామంలో అభివృద్ధి పనులు చేశాంరు.
సమాధానం చెప్పలేక వేదన
అందుకు సంబంధించిన రూ.11 లక్షల బకాయిలు రావాలని ప్రభుత్వానికి ఎన్ని సార్లు మొర పేరుకుని బిల్లులు సమర్పించినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆమె అన్నారు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షణాలు చేసి ఎన్ని సార్లు వేడుకున్నా బిల్లులు మంజూరు కాకపోవడంతో, అప్పులు ఇచ్చిన వారికి సమాధానం చెప్పలేక వేదన అనుభవిస్తున్నాం. అప్పులకు వడ్డీలు పెరిగాయని అప్పు ఇచ్చిన వారు వేధించడంతో ఆవేదనలో మనస్తాపం చెంది తన భర్త రవిగడ్డి మందు గుళికలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని ఆమే ఆవేదన వ్యక్తం చేశారు. కరీంనగర్‌లోని ప్రైవేటు ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో తన భర్త చికిత్స పొందుతుందని విజయలక్ష్మి పేర్కొంది.
Also Read: Farmers Protest: రోడ్డెక్కిన రైతన్నలు.. సీడ్ కంపెనీల తీరుపై తీవ్ర ఆగ్రహం..