Fauja Singh Case: ప్రముఖ మారథాన్ రన్నర్ ఫౌజా సింగ్ (Fauja Singh) మరణానికి దారితీసిన హిట్ అండ్ రన్ కేసును పంజాబ్ పోలీసులు ఛేదించారు. కెనడా (Canada)కు చెందిన 30 ఏళ్ల అమృత్ పాల్ సింగ్ (Amritpal Singh)ను బుధవారం అరెస్ట్ చేశారు. జలంధర్ జిల్లా (Jalandhar district)లోని తన గ్రామం సమీపంలోని రోడ్డు దాటుతున్న క్రమంలో వందేళ్ల మారథాన్ రన్నర్ యాక్సిడెంట్ కు గురయ్యారు. టయోటా ఫార్చ్యూనర్ కారు (Toyota Fortuner) అతడ్ని ఢీకొట్టి వెళ్లిపోయింది. దీంతో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 114 ఏళ్ల ఫౌజా సింగ్ తుదిశ్వాస విడిచారు. ఇది జరిగిన గంటల వ్యవధిలోనే నిందుతుడ్ని గుర్తించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
నిందితుడు అమృత్ పాల్ సింగ్ అరెస్ట్ కు సంబంధించిన సమాచారాన్ని జలంధర్ రూరల్ ఎస్పీ హర్విందర్ సింగ్ విర్క్ (Harvinder Singh Virk) మాట్లాడారు. సీసీటీవీ ఫుటేజీ (CCTV camera footage) ఆధారంగా వాహనాన్ని గుర్తించినట్లు చెప్పారు. నిందితుడు అమృత్ పాల్.. జలంధర్ జిల్లా కర్తార్ పురా సబ్ డివిజన్ లోని దాసుపూర్ గ్రామానికి చెందినవాడు. సింగ్ 8 రోజుల క్రితం కెనడా నుంచి వచ్చారని.. ఇటీవల కపుర్తలా నివాసి నుంచి వైట్ కలర్ టయోటా ఫార్చూనర్ (PB 20c7100) ను కొనుగోలు చేశారని అధికారులు తెలిపారు. పీటీఐ కథనం ప్రకారం.. అమృత్ పాల్ సింగ్ (26) భోగ్ పూర్ నుండి కిషాగఢ్ కు వెళ్తుండగా ఫౌజా సింగ్ ను ఢీకొట్టాడు. అమృత్ పాల్ సింగ్ ను పోలీసులు అతడి గ్రామంలోనే పట్టుకున్నారు. అదుపులోకి తీసుకున్న వెంటనే అతడు నేరం అంగీకరించాడు. అయితే తాను యాక్సిడెంట్ చేసిన వ్యక్తి.. ఫౌజా సింగ్ అని ముందుగా తనకు తెలియదని నిందితుడు తెలియజేశాడు.
Also Read: NASA’s Parker Solar: మహా అద్భుతం.. సూర్యుడ్ని అతి దగ్గరగా చూస్తారా.. కొత్త చిత్రాలు వచ్చాయోచ్!
సిక్కు సూపర్ మ్యాన్ (Sikh Superman)గా ప్రసిద్ధి చెందిన మారథాన్ రన్నర్ ఫౌజా సింగ్ ను బియాస్ గ్రామంలో రోడ్డు దాటుతుండగా వాహనం ఢీ కొట్టింది. ‘సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించినప్పటికీ సోమవారం సాయంత్రం నాటికి అతని పల్స్ రేటు బాగా పడిపోయాయి. వైద్య బృందం అతడ్ని బతికించలేకపోయింది’ అని జలంధర్‌కు చెందిన అతని కుమారుడు హర్విందర్ సింగ్ అన్నారు. ఇదిలా ఉంటే 1994 ఆగస్టులో ఫౌజా సింగ్ ఐదవ కుమారుడు కుల్దీప్ సింగ్ మరణించారు. ఆ బాధను అధిగమించడానికి ఫౌజా సింగ్ పరుగు పందెం మెుదలుపెట్టారు. వ్యక్తిగత భావోద్వేగాలను ఎదుర్కోవడానికి పరుగు ఉత్తమ వ్యాయమని ఆయన తరుచూ చెబుతుండేవారు.