Blood Pressure: ఆధునిక జీవనశైలి మార్పులతో అధిక రక్తపోటు (హైపర్‌టెన్షన్) సమస్య ఇప్పుడు చాలా మందిని వేధిస్తోంది. రక్తపోటు సమతుల్యంగా ఉంటేనే ఆరోగ్యం బాగుంటుంది. ఇది కాస్త ఎక్కువైనా లేదా తక్కువైనా ఆరోగ్యానికి హానికరమని వైద్యులు చెబుతున్నారు. పోషకాహారం లేని ఆహారం, మసాలా ఫుడ్, ఒత్తిడితో కూడిన జీవనశైలి వల్ల రక్తపోటు సమస్య వస్తుంది. హైబీపీకి కారణమయ్యే ఐదు అలవాట్ల గురించి నిపుణులు వెల్లడించారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..
అధిక ఉప్పు వినియోగం
ఈ రోజుల్లో చిప్స్, ఫాస్ట్ ఫుడ్ వంటి ఆహారాల్లో సోడియం ఎక్కువగా ఉంటుంది. ఉప్పు శరీరంలో నీటిని నిలిపి ఉంచి, రక్తనాళాలపై ఒత్తిడిని పెంచుతుంది, దీనివల్ల రక్తపోటు పెరుగుతుంది. రోజువారీ ఆహారంలో ఉప్పు మోతాదును తగ్గించడం ద్వారా ఈ సమస్యను నియంత్రించవచ్చని నిపుణులు చెబుతున్నారు.
Also Read: Society for Social Auditl: సోషల్ ఆడిట్‌కు సహకరించని అధికారులు.. పంచాయతీ రాజ్ ససేమిరా!
కదలిక లేని జీవనశైలి
ప్రస్తుతం, యువత ఎక్కువ సమయం కంప్యూటర్ ముందు, ఆఫీస్ డెస్క్‌ల వద్ద గంటల తరబడి కూర్చోంటున్నారు. వ్యాయామం చేయకపోవడం వలన రక్త ప్రసరణను బలహీనపరుస్తుంది. అంతే కాదు, ఇది ఒత్తిడిని పెంచి, అధిక రక్తపోటుకు దారితీస్తుంది. రోజూ కనీసం 30 నిమిషాల వ్యాయామం ఈ సమస్యను నివారించడంలో సహాయపడుతుంది.
తగినంత నిద్ర లేకపోవడం
ఒత్తిడి, బిజీ షెడ్యూల్స్ కారణంగా చాలా మంది సరిపడా నిద్రపోవడం లేదు. తక్కువ నిద్ర వల్ల శరీరంలో కార్టిసాల్ అనే స్ట్రెస్ హార్మోన్ స్థాయిలు పెరుగుతాయి, ఇది రక్తపోటును పెంచుతుంది. రోజూ 7-8 గంటల నిద్ర అవసరమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
Also Read: Pranava One HSEL: సోమాజిగూడ హెచ్‌ఎస్ఈఎల్ భవనంపై తప్పుడు సర్టిఫికేట్.. అధికారులకు ఫిర్యాదు!
జంక్ ఫుడ్, కెఫిన్ అధిక వినియోగం
పిజ్జా, బర్గర్, శీతల పానీయాలు, ఎనర్జీ డ్రింక్స్ వంటివి యువత బాగా తింటున్నారు. ఈ ఆహారాల్లో ఉండే అధిక సోడియం, కెఫిన్ రక్తపోటును పెంచుతాయి. ఇలాంటి జంక్ ఫుడ్‌ను తగ్గించి, పోషకాహారం ఎక్కువగా ఉండే ఆహారాన్ని ఎంచుకోవడం మంచిది.
Also Read: Malnadu Restaurant Drugs Case: మల్నాడు డ్రగ్స్ కేసులో కీలక మలుపు.. పోలీస్ అధికారుల సుపుత్రులు
ధూమపానం, మద్యపానం
సిగరెట్, మద్యం వంటి అలవాట్లు రక్తనాళాలను సంకోచింపజేస్తాయి. నికోటిన్, ఆల్కహాల్ హృదయ స్పందన రేటును అసమతుల్యం చేస్తాయి, ఫలితంగా రక్తపోటు పెరుగుతుంది. ఈ అలవాట్లను వీలైనంత త్వరగా మానేయడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది.