Society for Social Auditl( Image credit: twitter)
తెలంగాణ

Society for Social Auditl: సోషల్ ఆడిట్‌కు సహకరించని అధికారులు.. పంచాయతీ రాజ్ ససేమిరా!

Society for Social Auditl: ఉపాధి హామీ పథకంలో రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలు చేపడుతున్నారు. పంచాయతీ రాజ్ (Panchayat Raj)​ ఇంజినీరింగ్​ అధికారుల పర్యవేక్షిస్తున్నారు. గ్రామాల్లో ఎన్ని కిలో మీటర్లు సీసీ రోడ్లు వేశారు? మెటీరియల్‌, లేబర్​ కాంపోనెంట్‌ సంబంధించిన వివరాలను నమోదు చేయాల్సి. పనులకు ఎన్ని నిధులు మంజూరయ్యాయి? ఎంత మేరకు పనులు పూర్తి చేశారు? అసలు అక్కడ పనులు జరిగాయా లేదా? అని రాష్ట్ర ప్రభుత్వం సొసైటీ ఫర్‌ సోషల్‌ ఆడిట్‌, అకౌంటబిలిటీ అండ్‌ ట్రాన్స్‌పరెన్సీ (ఎస్​ఎస్​ఏఏటీ ) ​ఆధ్వర్యంలో పనులపై ఆడిట్​ నిర్వహిస్తోంది. పనులు పారదర్శకంగా జరిగాయా? లేదా? ఏమైనా అక్రమాలు చోటు చేసుకున్నాయా? బినామీ మస్టర్లే వేశారా? అనేది ‘సాట్’ తేలుస్తుంది.

పారదర్శకంగా జరిగాయా? లేదా?
రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నది. అందుకు కేంద్ర పథకం అయినా ఉపాధిహామీ నిధులతో పనులు చేపడుతుంది. సీసీరోడ్లు వేయడం, వ్యవసాయ బావుల వద్దకు వెళ్లే బాటలకు మట్టి పోయడం, వ్యవసాయ అనుబంధ పనులు, చెరువుల్లో సైతం పూడికతీత(సిల్ట్) పనులతో పాటు పలు పనులు చేపడుతున్నారు. అయితే, ఈ పనులు పారదర్శకంగా జరిగాయా? లేదా? అనేది సామాజిక తనిఖీ ప్రతి మండలంలోనూ చేపడుతున్నారు. పనులకు సంబంధించిన రికార్డులు పంచాయతీరాజ్ అధికారుల వద్ద ఉంటున్నాయి. ఇంజినీరింగ్ అధికారులు సైతం పనులకు సంబంధించిన వివరాలను రికార్డుల్లో పొందుపరుస్తారు. అయితే, ఆ రికార్డులను భద్రపరుస్తున్నట్లు సమాచారం.

Also Read: Sant Tukaram: విడుదలకు సిద్ధమైన ‘సంత్ తుకారం’… ఎప్పుడంటే?

ఈ పనులు పారదర్శకంగా జరిగాయా? లేదా అనే అంశాలను తెలుసుకునేందుకు ప్రభుత్వం సోషల్ ఆడిట్ విభాగంతో తనిఖీ చేయిస్తుంది. అంతేకాదు ప్రజల నుంచి ఫిర్యాదు వచ్చినప్పుడు కూడా ఆడిట్ విభాగం అధికారులు సంబంధిత పనులపై ఆరా తీయడంతోపాటు వివరాలను సేకరిస్తారు. నిబంధనలను ఉల్లంఘిస్తూ పనులు చేశారా? ప్రభుత్వ నిధులు ఏమేరకు దుర్వినియోగం అయ్యాయి అనే వివరాలను పరిశీలించనున్నారు. నిబంధనలు అతిక్రమిస్తే సంబంధిత అధికారుల నుంచి నిధులను రికవరీ చేయనున్నారు. అయితే, ఇంజినీరింగ్ అధికారులు అసలు పనులకు సంబంధించిన వివరాలను ఆడిట్ అధికారులు ఇవ్వడం లేదు. ఇది స్వయంగా ఆడిట్ అధికారులే పేర్కొంటున్నారు.

తనిఖీకి వెళ్లినా వివరాలు ఇవ్వడం లేదని
ప్రభుత్వ ఆదేశాల మేరకు బిచ్చుకుందా మండలంలో జరిగిన పనుల తనిఖీకి సోషల్ ఆడిట్ అధికారులు వెళ్లిన సమయంలో పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం అధికారులు ఇవ్వలేదు. 103 పనులు చేయగా కేవలం 19 పనులకు సంబంధించిన రికార్డులను మాత్రమే ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. అదే విధంగా కెరమెరి గ్రామంలో జరిగిన పనుల రికార్డులను సైతం ఇంజినీరింగ్ అధికారులు ఇవ్వలేదు. ఎన్ని వర్క్స్ జరిగాయో కూడా కనీసం సమాచారం ఇవ్వలేదని తెలిసింది.

ఈ రెండు మాత్రమే కాదు, సోషల్ ఆడిట్ అధికారులు ఎక్కడ పనుల తనిఖీకి వెళ్లినా చేసిన అభివృద్ధి పనులు, అందుకు అయిన ఖర్చు వివరాలు, ఏ పనులు ఎప్పటి లోగా పూర్తి చేశారనే వివరాలను సైతం ఇవ్వడం లేదని సమాచారం. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ అధికారులు సహకరించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ప్రతి పైసకు సార్థకత చేకూరేలా ప్లాన్ చేస్తున్నప్పటికీ పంచాయతీరాజ్ అధికారులు మాత్రం ఆడిట్ కు సహకరించడం లేదని సోషల్ ఆడిట్ డైరెక్టర్ నిర్మల తెలిపారు.

రోడ్ల నిర్మాణంలో నాణ్యత కొరవడడంతో శిథిలావస్థకు
పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్‌లో 2024-2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మెటీరియల్‌ కాంపొనెంట్‌ కింద గ్రామాల్లో రోడ్ల నిర్మిస్తున్నది. ఈజీఎస్‌లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 శాతం నిష్పత్తిలో గ్రామాల్లో పనులు చేపడుతున్నారు. 40 శాతం మెటీరియల్‌, 60 శాతం కూలీల కాంపొనెంట్‌గా ఖర్చులకు నిధులు కేటాయించారు. అయితే, గ్రామాల్లో ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్‌ కింద చేపట్టిన సీసీ రోడ్ల నిర్మాణ పనుల్లో నాణ్యత కొరవడడంతో కొంత కాలానికే శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. నాణ్యత విషయంలో ఇంజినీరింగ్‌ అధికారులు ‘మాములు’గా తీసుకున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చాలా గ్రామాల్లో సమయం లేకనో లేక గడువు ముగుస్తుందనే సాకుతో నాణ్యతకు తిలోదకాలిస్తూనే సీసీ రోడ్లు వేశారు.

Also Read: Gadwal: చెక్కింగ్ సిబ్బంది లేకపోవడమే.. అక్రమ దందాలకు ప్రోత్సాహమా?

ఈ రోడ్లు మున్నాళ్ల ముచ్చటగానే మారాయి. రోడ్ల నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడంతో కంకర తేలి దర్శనమిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో వేసే రోడ్లు పదికాలాలపాటు మన్నికగా ఉండాలని, నాణ్యతలో రాజీ పడొద్దని మంత్రి సీతక్క సమీక్షా సమావేశాల్లో పదే పదే చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో పీఆర్​ ఇంజినీరింగ్​ శాఖ అధికారుల తీరుతో ప్రభుత్వం అపవాదు మూటకట్టుకోవాల్సి వస్తోంది. ఇంజినీరింగ్​ అధికారులు కాంట్రాక్టర్​తో కుమ్మక్కై నాసిరకంగా నిర్మించిన రోడ్లకు బిల్లులు సాంక్షన్​ చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారని పల్లెవాసులు వాపోతున్నారు.

ఇటీవల పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్‌లోని ఓదెల మండల ఇన్‌ఛార్జ్ పంచాయతీరాజ్‌ అసిస్టెంట్‌ ఇంజినీర్‌, కాంట్రాక్టర్‌ నుంచి రూ.90 వేలు తీసుకుంటూ పట్టుపడడం అందుకు నిదర్శనం, సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ఎంబీ రికార్డు చేసేందుకు ఏఈ రూ.లక్ష లంచం డిమాండ్‌ చేయగా, రూ.90 వేలకు ఒప్పందం చేసుకున్నారు. కాంట్రాక్టర్‌ రాజు నుంచి ఏఈ రూ.90వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకుని కటకటాలకు పంపించారు. ఈయనే కాకుండా గతంలో పలువురు పీఆర్​ ఇంజినీరింగ్​ విభాగం అధికారులపై ఏసీబీ, విజిలెన్స్​ కేసులు ఉన్నాయి.

నిధుల దుర్వినియోగం
మరో వైపు మేజర్‌మెంట్స్, చేసిన పనుల్లో వ్యత్యాసం ఉంటున్నట్లు ఇప్పటి వరకు చేసిన పలు ఆడిట్లలో వెల్లడైనట్లు సమాచారం. దీంతో కోట్ల రూపాయల్లో నిధులు దుర్వినియోగం అవుతున్నట్లు ప్రభుత్వ దృష్టికి రావడంతోనే ఆడిట్ అధికారులతో పనుల తనిఖీలు చేయిస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. పంచాయతీ అధికారులు సహకరించకపోవడంతో సోషల్ ఆడిట్ విభాగం అధికారులు ఏం చేయాలో అర్థంకాని పరిస్థితి నెలకొంది. ఇంజినీరింగ్ అధికారుల తీరు తలనొప్పిగా మారిందని పలువురు పేర్కొంటున్నారు. ప్రభుత్వం స్పందిస్తేనే ఉపాధిహామీ పథకంలో చేపట్టే పనుల్లో, అభివృద్ధి పనుల్లో పారదర్శకత సాధ్యమని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

ప్రిన్సిపల్ సెక్రటరీకి లేఖరాస్తాం
సొసైటీ ఫర్‌ సోషల్‌ ఆడిట్‌, అకౌంటబిలిటీ అండ్‌ ట్రాన్స్‌పరెన్సీ బోర్డు డైరెక్టర్‌ తమ్మినేని నిర్మల
ఏప్రిల్ నుంచి జూన్ వరకు గ్రామాల్లో ఉపాధి హామీ పథకంలో జరిగిన అబివృద్ధి పనుల వివరాలుఇవ్వాలని పంచాయతీరాజ్ ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీకి లేఖ రాస్తాం. చేసిన పనుల వివరాలను ఇంజనీరింగ్ అధికారులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలిని కోరుతాం. పనుల్లో పారదర్శకత పెరగాలంటే సామాజిక తనిఖీ తప్పని సరి. అప్పుడే ప్రజల్లో సైతం కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ప్రభుత్వానికి సైతం మంచిపేరు వస్తుంది. కొన్ని గ్రామాల్లో వేసిన సీసీరోడ్లకు సంబంధించిన రికార్డులు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు ఇవ్వడం లేదు. దీంతో ఆడిట్ సమయంలో ఇబ్బందులు పడుతున్నాం.

Also Read: Phone Tapping Case: ట్యాప్​ చేయాలని ఎవరు ఆదేశించారు.. అంతా పై అధికారులకు తెలుసు

Just In

01

Turakapalem Village: ఎవరూ వంట చేసుకోవద్దు.. కనీసం నీళ్లూ తాగొద్దు.. ప్రభుత్వం ఆదేశాలు

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు