Sports News, Bharat Star Neeraj Chopra Won Gold Medal
స్పోర్ట్స్

Sports News: పసిడిని కైవసం చేసుకున్న నీరజ్

Sports News, Bharat Star Neeraj Chopra Won Gold Medal: సుధీర్ఘకాలం పాటు మూడేళ్ల అనంతరం తొలిసారి స్వదేశంలో పోటీపడ్డ భారత స్టార్‌ జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా స్వర్ణంతో మెరిశాడు. ఫెడరేషన్‌ కప్‌లో హరియాణా తరపున బరిలో దిగిన నీరజ్‌, పురుషుల జావెలిన్‌ త్రో ఛాంపియన్‌గా నిలిచి తన టాలెంట్‌ని ప్రదర్శించాడు. కానీ తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు.

26 ఏళ్ల నీరజ్‌ నాలుగో ప్రయత్నంలో 82.27 మీటర్ల దూరం జావెలిన్‌ విసిరాడు. కానీ మరే అథ్లెట్‌ కూడా అతడిని దాటలేకపోయారు. దీంతో చివరి రెండు ప్రయత్నాలను నీరజ్‌ చేతులారా వదిలేసుకున్నాడు. దీంతో డీపీ మను కర్ణాటక 82.06మీ, ఉత్తమ్‌ మహారాష్ట్ర 78.39మీ వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు.

Also Read:గేమ్‌కి దూరమైతే అంతే అంటూ షాకిచ్చిన కొహ్లీ

ఆసియా క్రీడల్లో రజతంతో పారిస్‌ ఒలింపిక్స్‌ బెర్తు పట్టేసిన కిశోర్‌ జెనా 75.49మీ. దూరంతో పేలవ ప్రదర్శన చేశాడు. 2021 మార్చిలో ఇవే పోటీల్లో నీరజ్‌ చివరిగా భారత్‌లో పోటీపడ్డాడు. అప్పుడు 87.80మీటర్ల ప్రదర్శన చేశాడు. అతని వ్యక్తిగత ఉత్తమ ప్రదర్శన 89.04 మీటర్లుగా ఉంది. దీంతో తన అభిమానులు తమ అభిమాన ఆటగాడి ప్రదర్శన పట్ల సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

Just In

01

Suryapet News: ప్రతి ఒక్కరూ చట్టపరిధిలో నడుచుకోవాలి: ఎస్పీ నరసింహ

Haryana: సిస్టర్స్ డీప్ ఫేక్ వీడియోలు.. సోదరుడు ఆత్మహత్య.. వెలుగులోకి షాకింగ్ నిజాలు

Crime News: మామిడి తోటలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. 6 గురు అరెస్ట్..!

ACB Rides: ఏసీబీ వలలో గ్రామ పరిపాలన అధికారి.. దేవుడే పట్టించేనా..!

Mass Jathara: మాస్ జాత‌ర ప్రీ రిలీజ్ ఈవెంట్.. రవితేజ కోసం కోలీవుడ్ స్టార్ హీరో..?