Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు (Prabhakar Rao) ఆరోసారి సిట్ విచారణకు హాజరయ్యారు. సెట్ అధికారులు ఆయనను సుధీర్ఘంగా ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాడ్డాక అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెలుగు చూసిన విషయం తెలిసిందే. దీనిపై మొదట పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదు కాగా ఆ తరువాత వాటిని సిట్ కు మార్చారు. విచారణలో ఎస్ఐబీ ఛీఫ్ గా ఉన్న సమయంలో ప్రభాకర్ రావు (Prabhakar Rao) ప్రతిపక్ష పార్టీలు…ముఖ్యంగా కాంగ్రెస్ కు చెందిన కీలక నాయకుల (Phone Tapping) ఫోన్లను ట్యాప్ చేయించినట్టుగా వెల్లడైంది.
Also Read: Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్.. సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు
వివరాలను ఇవ్వడం లేదు
ఇదే కేసులో రెండో నిందితుడిగా ఉన్న ప్రణీత్ రావు విచారణలో ఇదే విషయాన్ని వెల్లడించాడు. అయితే, ప్రభాకర్ రావు మాత్రం ఫోన్ ట్యాపింగ్‌కు (Phone Tapping) సంబంధించి సిట్‌కు స్పష్టమైన వివరాలను ఇవ్వడం లేదు. బాధితుల వాంగ్మూలాలను ముందు పెట్టి ప్రశ్నించినా నేనం చేశానో నా పై అధికారులు అందరికీ తెలుసంటూ మరికొందరిని ఈ కేసులోకి లాగేలా జవాబులు చెబుతూ వస్తున్నాడు. ఇక, ఫలానా నాయకుల ఫోన్లను ట్యాప్ చేయాలని కూడా తాను ఎవ్వరికీ ఆదేశాలు ఇవ్వలేదన్నాడు.
మరోసారి విచారణ
ఈ క్రమంలో సహనం నశించిన సిట్ అధికారులు ప్రభాకర్ రావును అరెస్ట్ చేయొద్దంటూ సుప్రీం కోర్టు అతనికి కల్పించిన రక్షణను తొలగిపోయేలా చూడాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్, సిట్ ఇన్‌ఛార్జ్ వెంకటగిరిలు ఇటీవల ఢిల్లీ కూడా వెళ్లారు. న్యాయవాదులతో చర్చలు కూడా జరిపారు. తాజాగా, మంగళవారం మరోసారి ప్రభాకర్ రావును విచారణకు పిలిపించిన సిట్ అధికారులు ఇప్పటివరకు ట్యాపింగ్ బాధితులు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా మరోసారి ప్రశ్నించారు.
తమకు స్టేట్‌మెంట్ ఇచ్చిన బాధితుల పేర్లను ప్రస్తావిస్తూ వీరి ఫోన్లను ఎందుకు ట్యాప్ చేయించారు? అని అడిగినట్టు సమాచారం. వీరి ఫోన్ నెంబర్లను ట్యాప్ చేయాలని ఎవరి నుంచి సూచనలు అందాయి? అని కూడా ప్రశ్నించినట్టుగా తెలిసింది. అయితే, ప్రభాకర్ రావు ఇంతకు ముందులానే సమాధానాలు చెప్పినట్టుగా సమాచారం. తాను ఫలానా వ్యక్తుల ఫోన్లను ట్యాప్ చేయాలని ఎవరికీ ఆదేశాలు ఇవ్వలేదని అన్నట్టు తెలిసింది. తన పై అధికారులకు తెలిసే ఫోన్ల ట్యాపింగ్ (Phone Tapping) జరిగిందని చెప్పినట్టు సమాచారం.
Also Read: Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో.. సిట్ దూకుడు!