Genelia
ఎంటర్‌టైన్మెంట్

Genelia: రామ్ చరణ్, ఎన్టీఆర్, బన్నీ.. ఇప్పుడున్న పొజిషన్ చూస్తుంటేనా?

Genelia: రాజకీయ నాయకుడు, వ్యాపారవేత్త గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి హీరోగా రాధా కృష్ణ దర్శకత్వం వహించిన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘జూనియర్‌’తో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుండగా.. జెనీలియా కీలక పాత్రలో కనిపించనుంది. వారాహి చలన చిత్రం బ్యానర్‌పై రజని కొర్రపాటి నిర్మిస్తున్న ఈ సినిమా జూలై 18న గ్రాండ్‌గా విడుదలయ్యేందకు ముస్తాబవుతోంది. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ మంచిస్పందనను రాబట్టుకోగా, తాజాగా ఈ చిత్ర విశేషాలను తెలుగు మీడియాకు తెలియజేసింది నటి జెనీలియా. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..

‘‘దాదాపు 13 ఏళ్ల తర్వాత సౌత్ సినిమా చేస్తున్నాను. ‘జూనియర్’ ప్రాజెక్టు మూడేళ్ల క్రితమే నా దగ్గరికి వచ్చింది. ఆ సమయంలో ఈ సినిమా చేయాలా? వద్దా? అనేది డిసైడ్ చేసుకోలేదు. రితేష్‌ ఈ కథ విని, నాకు చాలా పాజిటివ్‌గా చెప్పారు. ఒకసారి కథ విని, ఆ తర్వాత నిర్ణయం తీసుకో అన్నారు. దర్శకుడు ఆ కథ, అందులో నా పాత్రను చెప్పిన విధానం నాకు ఎంతగానో నచ్చాయి. అలా ఈ ప్రాజెక్ట్‌లో భాగమయ్యాను. నేను మొదటి నుంచి ఎప్పుడూ చేయని కొత్త క్యారెక్టర్స్ చేయాలనే ఉద్దేశంతోనే సినిమాలు చేస్తూ వచ్చాను. ‘జూనియర్’లో నా పాత్ర చాలా స్పెషల్‌గా ఉంటుంది. నేను ఇప్పటి వరకు ఇలాంటి పాత్ర అయితే చేయలేదు. అందుకే తప్పకుండా ఈ సినిమా చేయాలని అనిపించింది. ఈ సినిమా ప్రేక్షకులకి అద్భుతమైన ప్యాకేజ్. దేవి శ్రీ ప్రసాద్, సెంథిల్ కుమార్ వంటి వారితో పనిచేయడం నాకు రీయునియన్‌లా అనిపించింది.

Also Read- Samantha: నాగచైతన్యదే తప్పు.. భార్య దగ్గర నిజాయితీగా ఉండాలంటూ.. సమంత సంచలన కామెంట్స్

ఇందులో నా పాత్ర సీరియస్‌గా ఉంటుందని అనడం కంటే ఒక మంచి బాస్ క్యారెక్టర్ అని అంటే బాగుంటుంది. సినిమా ముందుకెళ్తున్న కొద్ది ఆ పాత్రలో చాలా మార్పులు వస్తాయి. అవన్నీ కూడా చాలా కొత్తగా ట్రీట్ చేశారు దర్శకుడు. కిరీటీ గురించి చెప్పాలంటే.. నేను ఇప్పటి వరకు చాలామంది కొత్త నటులతో పని చేశాను. వారిలో కిరీటి మాత్రం చాలా కాన్ఫిడెంట్ యాక్టర్ అని చెప్పగలను. అంతేకాదు, అద్భుతమైన డాన్సర్ కూడా. ఈ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేసి కంప్లీట్ ఎఫర్ట్ పెట్టాడు. సెంథిల్‌తో నేను ‘సై’ అనే సినిమా చేశాను. ఆయన ‘బాహుబలి, ఆర్ఆర్ఆర్’ వంటి అద్భుతమైన సినిమాలు చేసి వచ్చారు. చాలా రోజుల తర్వాత ఆయనతో కలిసి పని చేసినందుకు చాలా ఆనందంగా అనిపించింది. నా కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు సినిమాలకి బ్రేక్ ఇచ్చాను. అందుకు నాకు ఎటువంటి రిగ్రేట్ లేదు. లైఫ్ అన్నాక అన్నీ ఉంటాయి. నేను చేసినంతలో ఎన్నో అద్భుతమైన సినిమాలు చేశాను. ‘బొమ్మరిల్లు’ హాసిని వెరీ మెమొరబుల్ క్యారెక్టర్. అలాగే ‘హ్యాపీ’లో మధుమతి, ‘కథ’ సినిమా.. ఇప్పటికీ ఆడియన్స్ నా క్యారెక్టర్స్ పేరుతోనే పిలుస్తుంటారంటే, అది ఒక నటిగా చాలా గొప్ప ఆనందాన్ని ఇస్తుంది.

Also Read- Kota vs Anasuya: కోట, అనసూయల మధ్య గొడవేంటి? కోటను అంతమాట అందా?

ఇకపై యాక్టింగ్‌ని కొనసాగిస్తాను. మంచి పాత్రలు వస్తే నటించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ముఖ్యంగా చిన్న పాత్ర అయినా గుర్తుండిపోయేదిగా ఉండాలని కోరుకుంటున్నాను. నాకు డ్రీమ్ రోల్ అంటూ ఏమీ లేదు. శ్రీలీల అమేజింగ్ డాన్సర్, అలాగే అద్భుతమైన పెర్ఫార్మర్. ఎప్పుడూ చాలా ఎనర్జిటిక్‌గా ఉంటుంది. రామ్ చరణ్, ఎన్టీఆర్, బన్నీ వంటి వారంతా ఇప్పుడున్న పొజిషన్ చూస్తుంటే.. చాలా ఆనందంగా ఉంది. వీరితోనేనా నేను చేసింది అని ఆశ్చర్యపోతుంటాను. వారంతా సూపర్ స్టార్స్‌గా ఎంతో కష్టపడుతున్నారు. రితేష్‌తో కలిసి ‘మజిలీ’ రీమేక్ చేశాం. అది మంచి సక్సెస్ అయింది. మరో మంచి లవ్ స్టోరీ కుదిరితే.. మేము మళ్లీ ఓ సినిమా చేయాలనే ఆలోచనలో అయితే ఉన్నాం..’’ అని జెనీలియా చెప్పుకొచ్చారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!