BC Reservation Bill: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ కు లైన్ క్లియర్ అయింది. 42 శాతం రిజర్వేషన్ ను పక్కగా అమలు చేయాలని ప్రభుత్వం పకడ్భందీగా ముందుకు సాగుతున్నది. బీసీ బిల్లు(BC Bill)ను అమలు చేయాలంటే తొలుత 2018–2019 పంచాయితీ రాజ్ చట్టాన్ని రివైజ్డ్ చేయాల్సి ఉన్నది. ఈ నేపథ్యంలో ఆ చట్టం సవరణకు ప్రభుత్వం రూపొందించిన ఆర్డినెన్స్ గవర్నర్‌కు చేరింది. ఒకటి రెండు రోజుల్లో ఆర్డినెన్స్ పై స్టడీ చేసి, క్లీయర్ చేస్తారని ప్రభుత్వం చెప్తున్నది. ఆ తర్వాత వెంటనే లోకల్ బాడీ ఎన్నికల్లో(Local Body Elections) 42 శాతం రిజర్వేషన్ ను అమలు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రత్యేక జీవోను విడుదల చేయనున్నది. ఆ వెను వెంటనే ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు సెక్రటేరియట్ లోని ఓ ఉన్నతాధికారి తెలిపారు. బీసీ రిజర్వేషన్ అమలుపై ఎక్కడా బ్లేమ్ కాకుండా ప్రభుత్వం లీగల్ ఓపీనియన్లతో సహా, ఆర్డినెన్స్ ను డ్రాప్ట్ చేసినట్లు ఉన్నతాధికారులు చెప్తున్నారు.
ఎట్టి పరిస్థితుల్లో తిరస్కరణకు గురికాదు
గవర్నర్ రిజెక్ట్ చేయడానికి వీలులేకుండా ఫర్ ఫెక్ట్ గా ఆర్డినెన్స్ పంపించినట్లు ప్రభుత్వం చెప్తున్నది. దీంతో గవర్నర్ అప్రూవల్ తప్పనిసరి అని అధికారులతో పాటు ప్రభుత్వ పెద్దలు బలంగా నమ్మడం గమనార్హం. ఇక లోకల్ బాడీ ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్లను ఇంప్లిమెంట్ చేస్తామంటూ ప్రభుత్వం గవర్నర్(Governor) కు పంపించిన ఆర్డినెన్స్ ఎట్టి పరిస్థితుల్లో తిరస్కరణకు గురికాబడదని ఉన్నతాధికారులు చెప్తున్నారు. ఒక వేళ తిరస్కరిస్తే..పాత రిజర్వేషన్ ప్రకారమే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుంది. వందలో 99.9 శాతం రిజెక్ట్ చేసే ఛాన్సే లేదని అధికారులు నొక్కి చెప్పున్నారు.
Also Read: Medical College Vacancies: సీనియారిటీ ఆధారంగా సిటీలో పోస్టింగ్ ఛాన్స్.. సర్కార్ స్టడీ
స్టేట్ ఎలక్షన్ కమిషన్ రెడీ
గవర్నర్ కార్యాలయానికి ఆర్డినెన్స్ వెళ్లగానే ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని స్టేట్ ఎలక్షన్ కమిషన్(State Election Commission) అన్ని విభాగాల అధికారులకు ఆదేశాలిచ్చినట్లు సమాచారం. అంతేగాక అన్ని జిల్లాల నుంచి ఓటర్ల జాబితా, పోలింగ్, కౌంటింగ్ సమస్యాత్మక ప్రాంతాల లిస్టును కూడా సేకరించినట్లు తెలిసింది. ఓటర్ల వివరాలు, పోలింగ్ కేంద్రాలు, కౌటింగ్ కేంద్రాలు, స్టాఫ్, ఎన్నికల సింబల్స్ వంటి వాటిపై స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఉన్నతాధికారులు రివ్యూ కూడా పెట్టినట్లు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాంటి సమస్యలు, ఇబ్బందులు రాకూడదని ఉన్నతాధికారులు అన్ని జిల్లాలకు ఆదేశాలిచ్చారు. స్టాఫ్ ట్రైనింగ్, బూత్ ఏజెంట్ల వివరాలు, వంటి వాటిపై సీరియస్ గా ఉండాలని సీఈసీ నుంచి ఆదేశాలు వెళ్లాయి.
పార్టీల నుంచీ అలర్ట్
స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని ఇప్పటికే అన్ని ప్రధాన పార్టీలు తమ అభ్యర్ధులను అలర్ట్ చేశాయి. ఏ ఎన్నిక వచ్చినా, గెలుపు దిశగా ముందుకు సాగాల్సిందేనంటూ ఆదేశాలిస్తున్నాయి. ఇందుకు తగిన అభ్యర్ధులను ఎంపిక చేసి, తమకు వివరాలు సమర్పించాలని పార్టీ ప్రాధాన కార్యాలయాలు జిల్లా పార్టీ అధ్యక్షులకు ఆదేశాలిచ్చాయి. సర్పంచ్ లకు పార్టీ గుర్తు లేనందున, జనాల్లో మైలేజ్ కలిగిన నేతలను ఎంపిక చేయాలని కాంగ్రెస్ పార్టీ డీసీసీలకు సూచించింది. రెండు మూడు రోజుల్లో తగిన వివరాలు పార్టీ కార్యాలయానికి పంపించాలని ఆదేశించింది.
Also Read: Jangaon District farmers: మొహం చాటేసిన వర్షాలు.. ఎండుతున్న పంటలు