Uttam Kumar Reddy(image credit: twitter)
తెలంగాణ

Uttam Kumar Reddy: కృష్ణా గోదావరి బేసిన్లో సమస్యలపై చొరవచూపాలి.. పాటిల్‌కు మంత్రి లేఖ

Uttam Kumar Reddy: తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు, నీటి కేటాయింపులు, అనుమతులు, కృష్ణా గోదావరి నదీ బేసిన్‌లలో సమస్యలపై కేంద్రం చొరవ చూపాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) కోరారు. ఈ మేరకు సోమవారం కేంద్ర జల వనరుల శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌కు (C.R. Patil) లేఖ రాశారు. పాలమూరు- (Ranga Reddy) రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, డిండి లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలకు ఇప్పటికీ క్లియరెన్స్ రాలేదన్నారు. పాలమూరుకు మైనర్ ఇరిగేషన్ కాంపోనెంట్ నుంచి సేవింగ్స్ 45 టీఎంసీలు, గోదావరి నీటిని కృష్ణా నదికి బదిలీ చేయడం ద్వారా తెలంగాణకు రావాల్సిన 45 టీఏంసీలు ఈ ప్రాజెక్టు వినియోగించుకోవాలని ప్రతిపాదించిందన్నారు.

గోదావరి వాటర్ డిస్ప్యూట్స్ ట్రైబ్యునల్ (జీడబ్ల్యూడీటీ) అవార్డు ప్రకారం 45 టీఎంసీల కృష్ణా నీటిని నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌పైన వాడుకునే వీలుందని, ఆ నీటినే పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు కేటాయించిందన్నారు. పాలమూరు, డిండి ప్రాజెక్టుల డీపీఆర్లను కేంద్ర జల సంఘం ఆమోదించాలని, ఆ తర్వాత పర్యావరణ శాఖ, సీసీకు ఈసీ జారీ చేయమని సిఫార్స్ చేయాలన్నారు. ప్రాజెక్టుల నిర్మాణంలో జాప్యం కారణంగా కరువు పీడిత ప్రాంతాల రైతులకు ఆశించిన ప్రయోజనాలు అందడం లేదన్నారు. ఈ ప్రాజెక్టులకు ఎన్విరాన్ మెంటల్ క్లియరెన్స్ వస్తే కేంద్రం నుంచి గ్రాంట్లు, ఆర్థిక సాయంతో పాటు నాబార్డ్ లాంటి ఆర్థిక సంస్థల నుంచి తక్కువ వడ్డీతో రుణాలు పొందే వీలుంటుందని తెలిపారు.

 Also Read: Toddy Shops: కల్లు కాంపౌండ్లపై స్పెషల్​ డ్రైవ్.. పక్కాగా వివరాలు సేకరించేందుకు ప్లాన్

నీటిని మళ్లించేలా ఏపీ కాల్వల నిర్మాణాలు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందే 2007లోనే డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఆమోదం పొందిందని, ఫ్లోరోసిస్ సమస్యను పరిష్కరించే లక్ష్యంతో డిండి ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా పరిగణించాలని ప్రధాన మంత్రి కార్యాలయం 2010 డిసెంబర్ 10న ప్రతిపాదించిందన్నారు. 2021 సెప్టెంబర్ 21న కేంద్ర జలసంఘానికి సమ్మక్క సాగర్ ప్రాజెక్ట్ (తుపాకులగూడెం బ్యారేజ్) డీపీఆర్ సమర్పించిందని వెల్లడించారు. ఛత్తీస్‌గఢ్‌ నుంచి నో-అబ్జెక్షన్ లేదందునా ఇంటర్-స్టేట్ మ్యాటర్స్ డైరెక్టరేట్ నుంచి క్లియరెన్స్ ఆలస్యమవుతున్నదని, ఛత్తీస్‌గఢ్‌ (Chhattisgarh) సూచనలను, నిబంధనల ప్రకారం అక్కడి భూ యజమానులకు నష్టపరిహారం చెల్లించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

ముంపు విషయంలో ఖరగ్పూర్ ఐఐటీ ఇచ్చిన నివేదికలోని సిఫారసులను పాటించేందుకు సిద్ధంగా ఉందని వెల్లడించారు. కృష్ణా బేసిన్లో శ్రీశైలం నుంచి ఇతర బేసిన్లకు ఏపీ అక్రమంగా నీటిని మళ్లిస్తోందని మండిపడ్డారు. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి +880 అడుగుల వద్ద 1.5 లక్షల క్యూసెక్కుల కంటే ఎక్కువ సామర్థ్యంతో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా నీటిని మళ్లిస్తున్నదని, ఏకంగా 841 అడుగుల నుంచి రోజుకు 8 టీఎంసీల నీటిని మళ్లించేలా ఏపీ కాల్వల నిర్మాణాలు చేపట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 797 అడుగుల వద్ద రోజుకు 3 టీఎంసీలు తీసుకెళ్లే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌తో పాటు ముచ్చుమర్రి, మలయాల, గురు రాఘవేంద్ర ప్రాజెక్టులు నిర్మించిందని, కృష్ణా నది నుంచి వరద నీటిని బేసిన్ వెలుపల ప్రాంతాలకు డైవర్ట్ చేస్తుందన్నారు.

జల విద్యుత్ ఉత్పత్తిపై ప్రభావం
శ్రీశైలం అట్టడుగు నుంచి నీటిని డైవర్ట్ చేసే నిర్మాణాలతో రిజర్వాయర్‌ ఖాళీ అవుతున్నదని, శ్రీశైలం, నాగార్జునసాగర్ మీద ఆధారపడ్డ జల విద్యుత్ ఉత్పత్తిపై ప్రభావం పడుతున్నదన్నారు. రోజుకు 10 టీఎంసీల చొప్పున 20 రోజుల్లో 200 టీఎంసీలు డైవర్ట్ చేసే సామర్థ్యం ఉండడంతో తెలంగాణలోని ఇన్-బేసిన్ అవసరాలకు విఘాతం కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావానికి ముందే కృష్ణా నదిపై ఉమ్మడి రాష్ట్రంలో 287.06 టీఎంసీల సామర్థ్యంతో వివిధ ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయని, కేడబ్ల్యూడీటీ‌‌–2 ముందు ఈ వాదనలను వినిపించామని, ఈ విచారణ త్వరగా పూర్తి కావాలన్నారు.

1979లో ఎస్ఎల్బీసీ, 1984లో మొదలైన కల్వకుర్తి, 1997లో నెట్టెంపాడు, 2013లో పాలమూరు రంగారెడ్డి, 2007లో డిండి, 2005లో కొల్లాపూర్, 2014లో నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయని, కేడబ్ల్యూడీటీ-I అవార్డు ప్రకారం చేపట్టిన ప్రాజెక్టులకు కేంద్ర జల సంఘం అనుమతులివ్వాలని కోరారు. నిబంధనలకు విరుద్ధంగా ఇతర బేసిన్లకు నీటిని మళ్లించడాన్ని కేఆర్ఎంబీ అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. కృష్ణా జలాల మళ్లింపుపై నియంత్రణలు విధించాలని, ఇన్-బేసిన్ అవసరాల విషయంలో కేఆర్ఎంబీ న్యాయంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించాలన్నారు. నీటి ప్రవాహాలను ఖచ్చితంగా లెక్కించేందుకు టెలిమెట్రీ అమలు చేయాలని, టెలిమెట్రీ అమలుకు తెలంగాణ ప్రభుత్వం కేఆర్ఎంబీ ఖాతాకు రూ.4.15 కోట్లు జమ చేసిందన్నారు. ఇప్పటికీ ఏపీ పరిధిలో టెలీమెట్రీ పనులు జరగలేదని, వీటిని వెంటనే ఏర్పాటు చేయాలని కేఆర్ఎంబీకి సూచించాలన్నారు.

ఏపీ తీరుపై తుంగభద్ర బోర్డుకు లేఖలు
ఏపీ ప్రభుత్వం తుంగభద్ర నీటిని కేసీ కెనాల్ నుంచి హెచ్ఎల్సీ, ఎల్ఎల్సీ కెనాల్‌కు నీటిని డైవర్ట్ చేస్తున్నది, ఇది కేడబ్ల్యూడీటీ-I అవార్డును ఉల్లంఘించటమే అవుతుందన్నారు. అవార్డు ప్రకారం తుంగభద్ర నుండి వచ్చే ప్రవాహాలు కృష్ణా నదికి రావాలని, దానికి విరుద్ధంగా ఏపీ అనుసరిస్తున్న తీరుపై ఇప్పటికే తుంగభద్ర బోర్డుకు లేఖలు రాశామన్నారు. నాగార్జునసాగర్, కల్వకుర్తి, పాలమూరు రంగారెడ్డి, డిండి, ఎస్ఎల్బీసీ ఆయకట్టుకు నీటి కొరతతో పాటు శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతలలో గ్రీన్ పవర్ ఉత్పత్తి తగ్గిపోతోందన్నారు.

తెలంగాణకు జీవనాడిగా డాక్టర్ బీఆర్.అంబేద్కర్ ప్రాణహిత-చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్ట్ చేపట్టిందని, ఈ ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ఏఐబీపీ కింద ఆర్థిక సాయం అందించాలని కోరారు. గోదావరి బేసిన్ నుండి ఇతర బేసిన్‌లకు నీటిని బదిలీ చేసే విషయంపై చర్చలు జరగాల్సిన అవసరముందన్నారు. తెలంగాణలోని కరువు పీడిత ప్రాంతాలకు సాగు, తాగునీరు అవసరాలు తీర్చేందుకు 200 టీఎంసీల వరద నీటిని ఉపయోగించుకునేలా ఇచ్చంపల్లి వద్ద కొత్త ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అనుమతించాలని, గోదావరిపై పోలవరం, ఇచ్చంపల్లి ప్రాజెక్టులు చేపట్టమని జీడబ్ల్యూడీటీ పేర్కొందన్నారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నిధులు సమకూర్చుతున్నందున, అంతే సమానంగా ఇచ్చంపల్లి ప్రాజెక్ట్‌కు కేంద్రం నిధులు సమకూర్చాలని విజ్ఞప్తిచేశారు.

 Also Read: Telangana BJP: కొత్త వారికి ఛాన్స్ ఇస్తారా? మళ్లీ పాత వారికేనా?

Just In

01

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?