Gadwal District (imagecredit:swetcha)
నార్త్ తెలంగాణ

Gadwal District: రోడ్డుపై ఏరులై పారుతున్న మురుగు నీరు.. పట్టించుకోని అధికారులు

Gadwal District: మురుగు నీరు రోడ్లపై నిల్వ ఉండటాన్ని నిరసిస్తూ గ్రామస్తులు వినూత్నంగా మురుగు నీటిలో వరి నాట్లు వేసి నిరసన తెలిపారు. వివరాలోకి వెళ్లితే  గద్వాల జిల్లా కేటిదొడ్డి మండలం కుచినెర్ల గ్రామ రైతులు రోడ్డుపై నిలిచిన మురుగు నీటిలో వరినాట్లు వేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ కుచినెర్ల గ్రామంలో గత కొన్ని నెలలుగా నందిన్నె గ్రామానికి వెళ్లే రోడ్డుపై మురుగునీరు ఏరులై పారుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో ఇళ్లల్లో నుంచి వచ్చే మురుగు రోడ్డుపైనే ప్రవహిస్తోంది.

పంచాయతీ కార్యదర్శికి విన్నవించినా
దీంతో మురుగు దిగువ ప్రాంతానికి వచ్చి చేరి మడుగులను తలపిస్తోంది. మురుగు నీటితో పాటు వర్షపు నీరు వచ్చి చేరి మడుగులా ఏర్పడటంతో వాహనాల రాకపోకలు సాగించే వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. అంతే గాక పందుల సంచారం పెరిగిందన్నారు. ఈగలు, దోమలు స్వైరవిహారం చేస్తున్నాయని. కొంతమంది‌ ఇంటి ముందు‌ ఉన్న మురుగు కాలువలను మట్టితో పూడ్చి వేయడంతో ఆ మురుగు నీరు పారేందుకు అవకాశం లేకపోవడంతో రోడ్డుపైకి చేరుతోందన్నారు. ఈ విషయం గ్రామ పంచాయతీ కార్యదర్శికి విన్నవించినా పట్టించుకోకపోవడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాత్కాలిక మరమ్మత్తులు చర్యలు కాకుండా కాస్త నిధులు వెచ్చించి ఆ ప్రాంతంలో డ్రైనేజీ వ్యవస్థ పై శాశ్వత పరిష్కార మార్గాల దిశగా అధికారులు పని చేసి డ్రైనేజీ నిర్మించి, మురుగునీటి నిల్వ సమస్యను పూర్తిస్థాయిలో పరిష్కరించాలని ప్రజలు అధికారులును కోరుతున్నారు.

Also Read: Telangana News: త్వరలో తెలంగాణ పదకోశం.. రూపకల్పనలో సాహిత్య అకాడమీ

 

Just In

01

Srinivas Goud: వైన్స్ షాపుల్లో గౌడ్లకు 25శాతం ఇవ్వాల్సిందే… మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

CM Revanth Reddy: నిమజ్జనానికి సింపుల్ గా సీఎం.. ఏమైనా ఇబ్బందులున్నాయా?

Leaves denied: బ్రదర్ పెళ్లికి లీవ్స్ ఇవ్వలేదని ఓ మహిళా ఉద్యోగి తీసుకున్న నిర్ణయం ఇదీ

Students Protest: మా సార్ మాకు కావాలి.. నిరసనకు దిగిన విద్యార్థులు

Dhanush: మరో తెలుగు డైరెక్టర్‌కి ధనుష్ గ్రీన్ సిగ్నల్.. ఆ దర్శకుడెవరో తెలుసా?