Wife Suicide Attempt (imagecredit:swetcha)
నార్త్ తెలంగాణ

Wife Suicide Attempt: వరంగల్‌ జిల్లాలో దారుణం.. యువ డాక్టర్ ఆత్మహత్య

Wife Suicide Attempt: రీల్స్‌ కలిపిన ప్రేమ ఓ పండంటి కాపురంలో చిచ్చు రేపింది. ఓ డాక్టర్ ఆత్మహత్యకు పాల్పడగా భర్త పోలీసుల అదుపులోకి పోయేలా చేసింది. తన భర్త పరాయి యువతితో ప్రేమాయణం సాగించడం భరించలేని భార్య బలవన్మరణానికి పాల్పడింది. ఇక వివరాల్లోకి వెలితే ఈ ఘటన వరంగల్‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వరంగల్‌(Warangal News) జిల్లాలో ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో డాక్టర్‌ ప్రత్యూష(Pratyusha) పని చేస్తోంది. ఈ క్రమంలో హసన్‌పర్తిలోని తన నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కారణం తన భర్త వేరొక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో మనస్థాపం చెందిన యువ డాక్టర్ ప్రత్యూష ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.

Also Read: Telangana News: త్వరలో తెలంగాణ పదకోశం.. రూపకల్పనలో సాహిత్య అకాడమీ

సోషల్ మీడియాలో రీల్స్ చేసే అమ్మాయి
ఇన్‌స్టా‌గ్రామ్‌లో రీల్స్ చేస్తూ పాపులారిటి సంపాదించుకున్న ఒ యువతిపై ప్రేమ వ్యవహరం కారనంగానే ప్రత్యూష మరనానికి కారణం అని ప్రత్యూష తల్లిదండ్రుల ఫిర్యాదుతో హసన్‌పర్తి పోలీసులు(Hsanparthy Police) కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో భర్త సృజన్‌(Srujan)ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నగరంలో సృజన్ ఒ ప్రవేటు హస్పిటల్‌ల్లో కార్డియాలజిస్ట్ డాక్టర్ గా పనిచేస్తున్నాడు. మరో ఆసుపత్రిలో ప్రత్యూష డెంటిస్ట్‌గా పనిచేస్తుంది. అయితే సోషల్ మీడియా(Social media)లో రీల్స్ చేసే అమ్మాయి సృజన్‌ను ఇంటర్యూ చేసింది.

తరువాత వాటిని రీల్స్‌గా చేసి సోషల్ మీడియాలో పోస్టు చేసింది. దీంతో ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఈ వ్యవహరం ప్రత్యూషకి తెలిసి భర్తను నిలదీయగా అప్పటినుండి ఇద్దరి మద్య గోడవలు మొదలయ్యాయి. ఇలా జరుగుతున్న క్రమంలో ఎన్నోసార్లు పెద్దలు సర్దిచెప్పి పంపించారు. అయినా సృజన్‌లో మార్పు రాకపోవడంతో తీవ్ర మనస్ధాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఎంజీఎం ఆస్పత్రి మార్చురీకి తరలించారు.

Also Read: Nimisha Priya: నిమిషా ప్రియాకు ఎల్లుండే ఉరి.. ఏమీ చేయలేమన్న కేంద్రం

 

Just In

01

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?