SarojaDevi ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్మెంట్

B SarojaDevi: అత్యంత బాధకరం.. బి.సరోజాదేవి మరణంపై సంతాపం తెలిపిన పవన్ కళ్యాణ్, బాలయ్య

B SarojaDevi: తెలుగు సినీ పరిశ్రమలో మరో దిగ్గజం కన్నుమూశారు. ప్రముఖ నటి బి. సరోజా దేవి మరణం ఇండస్ట్రీని శోకసంద్రంలో ముంచెత్తింది. తెలుగు, కన్నడ, తమిళ సినీ పరిశ్రమల్లో ‘అభినయ సరస్వతి’గా పేరొందిన ప్రముఖ నటి, పద్మభూషణ్ అవార్డు గ్రహీత బి. సరోజా దేవి (87) బెంగళూరులోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఈ క్రమంలోనే తెలుగు సెలెబ్రిటీలు పవన్, బాలయ్య  ఆమె మృతి పట్ల సంతాపం తెలిపారు.

ఆమె మరణ వార్త తెలిసి చాలా బాధ పడ్డా.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

శ్రీమతి బి.సరోజాదేవి గారి ఆత్మకు శాంతి చేకూరాలి. ప్రముఖ నటి శ్రీమతి బి.సరోజాదేవి గారు కన్నుమూశారని తెలిసి బాధపడ్డాను. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. 1955 నుంచి దాదాపు మూడు దశాబ్దాలపాటు తెలుగు, కన్నడ, తమిళ భాషా చిత్రాల్లో నటించి చిత్ర సీమపై తనదైన ముద్రను వేశారు. భూకైలాస్, పాండురంగ మహత్యం, సీతారామ కళ్యాణం, జగదేకవీరుని కథ, శకుంతల, దానవీర శూర కర్ణ, ఆత్మబలం లాంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించారు. శ్రీమతి బి.సరోజా దేవి గారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను అంటూ ఎక్స్ వేదికగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంతాపాన్ని  తెలిపారు.

Also Read: Kota Srinivasa Rao: ఆ శాపం వేటాడిందా.. అందుకే కోట శ్రీనువాసరావు జీవితంలో అలా జరిగిందా ?

అత్యంత బాధాకరం..  ఆమె ఆత్మకు శాంతి చేకూరాలి..  నందమూరి బాలకృష్ణ

దక్షిణ భారత సినీ పరిశ్రమలో ఒకనాడు ధ్రువతారగా వెలుగొందిన ప్రముఖ నటీమణి “పద్మభూషణ్” బి. సరోజాదేవి గారు పరమపదించారన్న వార్త అత్యంత బాధాకరం. అప్పట్లో తెలుగులో NTR గారితో, తమిళంలో MGR గారితో, కన్నడంలో రాజ్ కుమార్ గారితో ఏకకాలంలో హిట్ పెయిర్ గా వెలుగొందిన ఘనత ఆమెది.

Also Read: Vinutha Kotaa: వినుత కోటా డ్రైవర్ కేసులో నమ్మలేని నిజాలు.. అంతా ఆ వీడియో వల్లనే!

మా తండ్రి NTR గారి కాంబినేషన్లో 20 సంవత్సరాల కాలంలో దాదాపు 20 చిత్రాలలో హీరోయిన్ గా నటించారు. ఆయనతో శ్రీరాముడి ప్రక్కన సీతాదేవిగా, రావణాసురుడి ప్రక్కన మండోదరిగానూ నటించిన ప్రత్యేకత ఆమె సొంతం. శ్రీమతి బి. సరోజా దేవి మరణం భారతీయ చిత్ర పరిశ్రమకు, ముఖ్యంగా దక్షిణ భారత చిత్ర పరిశ్రమకు తీవ్ర విచారకరమైన పరిణామం. ఆమె వెండితెరపై మరియు నిజజీవితంలో చేసిన సేవలు రాబోయే తరాల తారలకు, చలనచిత్ర వర్గాల వారికి స్ఫూర్తినిస్తాయి. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ.. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను అంటూ ఎక్స్ వేదికగా నందమూరి బాలకృష్ణ  సంతాపాన్ని  తెలిపారు.

Also Read:  Warangal MGM hospital: ఎంజీఎం హస్పిటల్‌లో దారుణం.. బతికి ఉన్న వక్తి చనిపోయాడని తెలిపిన సిబ్బంది

 

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు