KTR on Congress: పాలన అంటే శంకుస్థాపనలు కాదు కేటీఆర్
KTR on Congress(image credit: twitter)
Political News

KTR on Congress: పాలన అంటే శంకుస్థాపనలు కాదు కేటీఆర్ సంచలన కామెంట్స్!

KTR on Congress: పరిపాలన అంటే కేవలం శంకుస్థాపనలు చేయడం మాత్రమే కాదని, అభివృద్ధి, ప్రగతి అంటే రాజకీయ హంగులు, ఆర్భాటాలు ఏమాత్రం కాదని బీఆర్‌ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. ఎక్స్ వేదికగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. నిజమైన నాయకుడు ఒక తరం లేదా ఒక ఎన్నిక గురించి మాత్రమే ఆలోచించడని, తరతరాలపాటు రాష్ట్రానికి ప్రయోజనాలు కలిగించే ప్రణాళికలే నిజమైన నాయకుడి లక్ష్యమని పేర్కొన్నారు.

 Also Read: BC reservation bill: బీసీ రిజర్వేషన్ ను 9వ షెడ్యూల్ లో చేర్చాలి.. మాజీ మంత్రి డిమాండ్

మరో సజీవ సాక్ష్యం

సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కేసీఆర్ విజన్‌కు మరో సజీవ సాక్ష్యమని కేటీఆర్ అభివర్ణించారు. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ మోటార్లు ఆన్ అవ్వడంతో ఖమ్మం జిల్లాలోని ప్రతి ఎకరం వ్యవసాయ భూమికి సాగునీరు అందుతుందని ఆయన తెలిపారు. మరో అద్భుతం యాదాద్రి థర్మల్ ప్లాంట్ అని పేర్కొన్నారు. దామరచర్లలోని అల్ట్రా మెగా థర్మల్ పవర్ ప్లాంట్‌లోని యూనిట్ వన్, 72 గంటల కోడ్ (కమర్షియల్ ఆపరేషన్ డేట్)ను విజయవంతంగా పూర్తి చేసిందని ఆయన తెలిపారు.

 Also Read: MLC Kavitha: నేను ఊరుకునే ప్రసక్తే లేదు.. ఎమ్మెల్సీ కవిత

Just In

01

Bigg Boss Telugu 9: ఐదుగురు హౌస్‌మేట్స్‌తో ఎమోషనల్ డ్రామా మొదలైంది.. సంజన, తనూజ ఔట్!

MyGHMC App: ‘మై జీహెచ్ఎంసీ’ యాప్‌లో చక్కటి ఫీచర్.. మీ చుట్టూ ఉన్న సౌకర్యాలు ఇట్టే తెలుసుకోవచ్చు

Funky: విశ్వక్ ‘ఫంకీ’ రిలీజ్ డేట్ ఫిక్సయింది.. వాలెంటైన్స్ వీకెండ్ టార్గెట్‌గా!

VV Vinayak: ‘ఉస్తాద్‌ భగత్ సింగ్‌‌’లో వివి వినాయక్.. ఈ ఫొటోకి అర్థం అదేనా?

Jio New Year offers: హ్యాపీ న్యూఇయర్ ప్లాన్స్ ప్రకటించిన రిలయన్స్ జియో